'తప్పులేదు ప్రేమలో'.. ఎట్టకేలకు రిలేషన్ బయటపెట్టిన 'కోర్ట్' బ్యూటీ శ్రీదేవి.. ప్రియుడు ఎవరంటే..?

ఇండస్ట్రీలో ఎప్పుడూ అవకాశాలు చాలానే ఉంటాయి. యువ నటీనటులకు గుర్తింపు రావాలంటే చాలా కష్టం. ఒక్కో సినిమాలో ఒక్కో పాత్ర చేసుకుంటూ వెళ్తేనే జనాలు గుర్తిస్తుంటారు. అయితే తమ టాలెంట్ తో ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ లో స్టార్స్ అయినవాళ్లూ ఉన్నారు. అలాంటి కోవకు చెందిన హీరోయిన్ కాకినాడ శ్రీదేవి.. కాకినాడ శ్రీదేవి అంటే గుర్తుపట్టడం కష్టమే.. కానీ 'కోర్ట్' మూవీ శ్రీదేవి అంటే ఎవరైనా టక్కున గుర్తుపట్టేస్తారు. అలా 2025 లో 'కోర్ట్ - స్టేట్ వర్సెస్ ఎ నోబడీ' మూవీతో తొలి సినిమాతోనే సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీదేవి ఆపళ్ల. జాబిల్లి పాత్రలో ఈ మూవీలో తన నటనతో ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. అలాగే ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా నిర్మాతలుగా వ్యవహరించారు. గతేడాది మార్చిలో విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. యువ నటీనటులతో పాటు కమెడియన్ ప్రియదర్శి, ప్రముఖ నటుడు సాయి కుమార్ కీలక పాత్రల్లో నటించారు.

ఈ మూవీలో యంగ్ హీరో హర్ష్ రోషన్- శ్రీదేవి కెమిస్ట్రీ అద్దిరిపోయింది. దాంతో వీళ్లిద్దరూ కలిసి బ్యాండ్ మేళం అనే మరో సినిమా చేశారు. ఈ మూవీ ఈ ఏడాది మార్చి 26 న విడుదలైంది. కానీ కోర్ట్ మూవీ అంత హిట్ కాలేదు. ఈ చిత్రానికి సతీష్ జవ్వాజి దర్శకత్వం వహించారు. శివ ముప్పరాజు స్క్రీన్ ప్లే అందించారు. విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ అందించారు. అయితే బ్యాండ్ మేళం మూవీ ఆశించినంత విజయం సాధించలేదు. ఇక ప్రస్తుతం శ్రీదేవి హైకూ అనే చిత్రంలో నటిస్తోంది. శ్రీదేవి, ఏగన్‌‌, ఫెమినా జార్జ్‌‌ లీడ్ రోల్స్‌‌ లో నటిస్తున్నారు. ఈ మూవీకి యువరాజ్ చిన్నసామి దర్శకత్వం వహించారు. అలాగే ఈ చిత్రానికి డా. డీ. అరుళానందు, మాథేవో అరుళానందు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఇటీవల ఈ చిత్రం షూటింగ్‌‌ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌‌ వర్క్స్‌‌ జరుగుతున్నాయి.

Sridevi Apalla Court movie actress Instagram post by has gone viral on social media fans gone crazy

అయితే తాజాగా హీరోయిన్ శ్రీదేవి తన అధికారిక ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె తన చేతితో ఓ యవకుడి చేయిని పట్టుకుని ఉంది. జర్నీ బిగిన్స్ అనే క్యాప్షన్ తో శ్లాష్ ఎస్ఎస్ అని, లవ్ సింబల్ కూడా పెట్టింది. దాంతో శ్రీదేవి రిలేషన్ షిప్ లో ఉందని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. మరికొందరు మాత్రం ఏదో కొత్త సినిమా స్టార్ట్ అయిందని అందుకు సంబంధించిన అప్డేట్ అయి ఉంటుందని కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికి ఒక్క పోస్టుతో మరోసారి నెట్టింట వైరల్ గా మారింది కోర్ట్ బ్యూటీ శ్రీదేవి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+