భారత్ సీజ్ ఫైర్ ప్రతిపాదన భేష్.. రష్యాతో యుద్ధం వేళ ఉక్రెయిన్ కీలక ప్రకటన
ఉక్రెయిన్- రష్యా మధ్య భీకర యుద్ధం ఏళ్లుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలి కాలంలో ఇరు దేశాల మధ్య మరోసారి యుద్ధం తీవ్రరూపం దాల్చింది. అయితే ఉక్రెయిన్- రష్యా మధ్య రాజీ కుదుర్చేందుకు ఇప్పటికే భారత్ సీజ్ ఫైర్ ప్రతిపాదనను పంపించింది. ఈ మేరకు తాజాగా ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ ప్రతిపాదించిన సీజ్ ఫైర్ ప్రతిపాదనపై దృష్టి సారించేందుకు ఉక్రెయిన్ సిద్ధంగా ఉందన్నారు. " ఉక్రెయిన్- రష్యా మధ్య సీజ్ ఫైర్ కోసం మాకు నాలుగు ప్రతిపాదనలు వచ్చాయి. వాటిలో భారత్ పంపించిన సీజ్ ఫైర్ ప్రతిపాదన విస్తృతంగా ఉంది. బ్లాక్ సీ సీజ్ ఫైర్, ఎనర్జీ సీజ్ ఫైర్ కు ఉక్రెయిన్ సిద్ధంగా ఉంది. కానీ ఈ రెండు కాంబినేషన్లు అయితే మాత్రమే" అని ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంలో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో మీడియాతో ఆండ్రీ సిబిహా ఈ వ్యాఖ్యలు చేశారని యూరోపియన్ ప్రావ్ డా న్యూస్ పేపర్ వెల్లడించింది.
సిబిహా మాట్లాడుతూ.. ఉక్రెయిన్- రష్యా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ప్రొపోజల్స్ భారత్, టర్కీ, ఈజిప్ట్, అలాగే అమెరికా నుంచి వచ్చాయి. అయితే ఇరు దేశాల మధ్య సంధి కోసం ఉక్రెయిన్ వేరే మార్గాలను అన్వేషించింది. కానీ ఏ అగ్రీమెంట్ అయినా ఆపరేషన్స్ ను కంట్రోల్ చేయడమే కాదు ఎనర్జీ, ఇన్ ఫ్రా స్ట్రక్చర్ మీద జరిగే దాడులను కూడా ముగించే విధంగా ఉండాలి.. అని అన్నారు. అంతకుముందు ఇదే అంశంపై రష్యా ప్రధాని వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతూ రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం ముగియడంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ వద్ద వెరీ గుడ్ ఐడియాలు ఉన్నాయని అన్నారు. అయితే పుతిన్ కామెంట్స్ చేసిన మరుసటి రోజే ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా ఈ కామెంట్స్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

అంతకుముందు పుతిన్ మాట్లాడుతూ.. రష్యా- ఉక్రెయిన్ యుద్ధంపై ప్రధాని మోదీ తరచూ మాట్లాడేవారు.. తమ మధ్య జరిగిన ప్రతి సమావేశంలో ఈ యుద్ధాన్ని ముగించాలని పరిష్కారం కోసం అన్వేషించాలని విజ్ఞప్తి చేసేవారు. వాల్దాయ్ ఇంటర్నేషనల్ డిస్కషన్ క్లబ్ యానువల్ మీటింగ్ లో భాగంగా పుతిన్ ఈ కామెంట్స్ చేశారని రష్యా కు చెందిన టాస్ న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది. ఇక గతనెలలో బ్రిక్స్ సమావేశానికి ముందు కూడా పుతిన్- మోదీ సమావేశం అయ్యారు. ఈ భేటీలో ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధానికి సంబంధించిన వివరాలను మోదీకి పుతిన్ వివరించారు. ఇక అంతకుముందు ఇదే అంశంపై క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ మాట్లాడుతూ.. ఇరు దేశాల మధ్య జరుగుతున్న వివాదాన్ని పరిష్కరించేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలను రష్యా స్వాగతిస్తుందని అన్నారు. భారత్ ప్రతిపాదనను రష్యా ఏకీభవిస్తోందని తెలిపారు.












Click it and Unblock the Notifications
