ఇన్ స్టాలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా..?

ప్రస్తుతం సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే. చిన్నా పెద్దా అని తేడా లేకుండా అందరూ సోషల్ మీడియాలో మునిగిపోతున్నారు. ఇక సెలబ్రిటీలు తమకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయడం అలవాటుగా మారిపోయింది. సినిమాకు సంబంధించిన విషయాలు అయినా పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలు అయినా నెట్టింట తమ ఫ్యాన్స్ తో పంచుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అలాగే ఫ్యాన్స్ కూడా తమ అభిమాన హీరో, అభిమాన హీరోయిన్ నుంచి వచ్చే చిన్న అప్డేట్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తుంటారు. తమ అభిమాన సినీతారలు ఏ పోస్టు పెట్టినా క్షణాల్లో దాన్ని వైరల్ చేయడం.. కామెంట్స్ పెట్టడం.. షేర్ చేయడం మనం చూస్తుంటాం..

అయితే ప్రస్తుతం టాలీవుడ్ భారతీయ చిత్ర పరిశ్రమలోనే అగ్రగామిగా దూసుకెళ్తోంది. ఏ చిత్ర పరిశ్రమకూ లేనన్ని పాన్ ఇండియా రికార్డ్స్ ను టాలీవుడ్ సొంతం చేసుకుంటోంది. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోలకు పాన్ ఇండియా రేంజ్ లో భారీగా ఫ్యాన్స్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే వీరిలో ఇన్ స్టాగ్రామ్ లో అత్యధిక మంది ఫాలోవర్స్ ఉన్న తెలుగు హీరోల వివరాలు ఇక్కడ చూద్దాం.. ఈ లిస్టులో ఫస్ట్ ప్లేస్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉన్నారు. ఆయనకు ఇన్ స్టాలో ఏకంగా 27.9 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అంటే దాదాపు 3 కోట్ల మంది ఆయన్ను ఫాలో అవుతున్నారని సమాచారం. ఇక ఈ లిస్టులో రెండో స్థానంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉన్నారు. ఆయనకు ఇన్ స్టాలో 23.9 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు.

Tollywood actors These are the Tollywood heroes with the highest number of followers on Instagram

వీరితోపాటు టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకు ఇన్ స్టా గ్రామ్ లో 23.1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. విజయ్ ఈ లిస్టులో మూడో స్థానంలో ఉండటం విశేషం. ఇక నాలుగో స్థానంలో మహేష్ బాబు 15.4 మిలియన్ ఫాలోవర్స్ తో ఉన్నారు. అలాగే ఐదో స్థానంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఉన్నారు. ఆయనకు ఇన్ స్టాలో 13.9 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఆరో స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు. ఆయనకు 8.1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. నటీమణుల్లో రష్మిక మందన్నా, సమంత టాప్ ప్లేస్ లో ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+