భారత్ సంచలనం.. మలేషియాను చిత్తు చేసి స్వర్ణం కైవసం!

Asian Games 2026: ఆసియా క్రీడలు 2026 పురుషుల హాకీ విభాగంలో భారత జాతీయ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. శనివారం(అక్టోబర్ 3) జపాన్‌లోని కకామిగహారా గిఫు ప్రిఫెక్చురల్ గ్రీన్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ పోరులో హర్మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత జట్టు 5-1 గోల్స్ తేడాతో మలేషియాను ఘోరంగా ఓడించింది. ఈ చారిత్రాత్మక విజయంతో భారత్ ఆసియా క్రీడల్లో పసిడి పతకాన్ని ముద్దాడటమే కాకుండా 2028లో జరగబోయే లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించింది. ఇప్పటికే భారత మహిళల హాకీ జట్టు ఒలింపిక్ బెర్త్ ను ఖాయం చేసుకోగా.. ఇఫ్పుడు పురుషుల జట్టు కూడా అర్హత సాధించి దేశానికి రెట్టింపు సంతోషాన్ని అందించింది.

IND vs PAK: పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం.. స్వర్ణ పతకం కైవసం!
IND vs PAK: పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం.. స్వర్ణ పతకం కైవసం!

భారత జట్టుకు పెనాల్టీ కార్నర్ల ద్వారా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, జుగ్రాజ్ సింగ్ భారత్ తరఫున గోల్స్ చేశారు. ఆసియా క్రీడల్లో భారత పురుషుల జట్టు వరుసగా రెండోసారి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. వరుసగా రెండో ఆసియా క్రీడల టైటిల్‌ను భారత్‌కు అందించిన తొలి భారత కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ సింగ్ చరిత్ర సృష్టించాడు. పురుషుల జట్టుకు ముందు భారత మహిళల జట్టు కూడా స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. ఫైనల్‌లో మహిళల జట్టు చైనాను ఓడించింది. ఆసియా క్రీడల్లో పురుషుల, మహిళల హాకీ జట్లు రెండూ స్వర్ణ పతకాలు గెలుచుకోవడం ఇదే మొదటిసారి. ఆసియా క్రీడల్లో భారత పురుషుల జట్టు స్వర్ణ పతకం గెలుచుకోవడం ఇది ఐదోసారి. మహిళల జట్టు రెండోసారి స్వర్ణం గెలుచుకుంది.

Asian Games 2026 India Beats Malaysia 5-1 to Win Hockey Gold and Los Angeles 2028 olympics Berth

అద్భుతమైన ఆరంభం చేసిన భారత్
ఎప్పటిలాగే భారత్ అద్భుతంగా ప్రారంభించి, 10వ నిమిషంలో 1-0 ఆధిక్యాన్ని సాధించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచి జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. అయితే కేవలం నాలుగు నిమిషాల తర్వాత సిల్వరస్ సెల్లో చేసిన గోల్‌తో మలేషియా స్కోరును సమం చేసింది. తొలి పావుగంట 1-1 డ్రాతో ముగిసింది.

రెండో క్వార్టర్లో భారత్ ఆధిక్యం
మ్యాచ్ రెండో క్వార్టర్‌లో పెనాల్టీ కార్నర్ ద్వారా భారత్ తమ రెండో గోల్ సాధించి మలేషియాపై 2-1 ఆధిక్యం సాధించింది. 23వ నిమిషంలో జుగ్రాజ్ ఓ అద్భుతమైన గోల్ చేశాడు. దీని తర్వాత మలేషియా జట్టు గోల్ కోసం తంటాలు పడుతూ మధ్యలో తప్పులు చేస్తూ చాలా దూకుడుగా ఆడటం ప్రారంభించింది. అయితే రెండవ క్వార్టర్ ముగిసేసరికి స్కోరు భారత్‌కు అనుకూలంగా 2-1గా నిలిచింది.

Viral Video: వైభవ్ సూర్యవంశీని ఔట్ చేసి పాక్ బౌలర్ ఓవర్ యాక్షన్!
Viral Video: వైభవ్ సూర్యవంశీని ఔట్ చేసి పాక్ బౌలర్ ఓవర్ యాక్షన్!

మూడో క్వార్టర్‌లో కూడా భారత్ గోల్
మూడో క్వార్టర్‌లో భారత్ మలేషియాపై తీవ్ర ఒత్తిడి తెచ్చింది. నిలకడగా పెనాల్టీ కార్నర్‌లను సంపాదిస్తూ భారత్ మలేషియా ఆటగాళ్లపై ఒత్తిడి పెంచింది. వారు తప్పులు చేసినప్పుడు, పెనాల్టీని సంపాదించింది. 42వ నిమిషంలో హార్దిక్ ఆ పెనాల్టీని సులభంగా గోల్‌గా మార్చి, భారత్‌కు 3-1 ఆధిక్యాన్ని అందించాడు. అక్కడి నుంచి విజయం అనివార్యంగా అనిపించింది, కానీ జాగ్రత్త చాలా అవసరం.

ముగింపులో గోల్స్ వర్షం
చివరి క్వార్టర్లో భారత ఆటగాళ్లు పూర్తిగా చెలరేగిపోయారు. 54వ నిమిషంలో శిలానంద్ ఫీల్డ్ గోల్ చేసి భారత్‌కు 4-1 ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత 57వ నిమిషంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి జట్టుకు విక్టరీ గోల్ అందించాడు. దీంతో టీమిండియా ఫైనల్ మ్యాచ్‌ను 5-1 తేడాతో గెలిచి, వరుసగా తమ రెండో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+