Shocking Video: 43 వ అంతస్తు నుంచి దూకిన వ్యక్తి.. బాడీ తునాతునకలు

ఉత్తర్ ప్రదేశ్ లోని నోయిడాలో షాకింగ్ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నోయిడా సెక్టార్ 94 లోని సూపర్ నోవా బిల్డింగ్ మీద నుంచి ఓ 29 ఏళ్ల వ్యక్తి దూకి సూసైడ్ చేసుకున్నాడు. అతడు 43 వ అంతస్తు నుంచి కిందకు దూకడంతో శరీరం పూర్తిగా నుజ్జు నుజ్జు అయింది. ఈ ఘటన శనివారం ఉదయం జరిగింది. మృతుడు సంభవ్ జైన్ గా పోలీసులు గుర్తించారు. అతడు గురుగ్రామ్ లోని మనేసర్ లో నివాసం ఉంటున్నట్లు సమాచారం. నోయిడా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో జైన్.. సూపర్ నోవా స్పైరా సొసైటీ బిల్డింగ్ కు వచ్చాడు. రాత్రంతా రూమ్ లో ఒంటరిగానే ఉన్నాడు. ఇక శనివారం ఉదయం 11 గంటల సమయంలో జైన్ తాను ఉంటున్న 43 వ అంతస్తులోని బాల్కనీ రైలింగ్ ను దాటి బిల్డింగ్ చివరకు వచ్చాడు. ఆ తర్వాత క్షణాల్లోనే అక్కడి నుంచి దూకేశాడు. అంత ఎత్తు మీద నుంచి దూకేయడంతో స్పాడ్ లోనే ప్రాణాలు కోల్పోయాడు జైన్.

Noida Shocking incident in Noida UP Man jumps from the 43rd floor video goes viral Shocking Video

జైన్ 43 వ అంతస్తు నుంచి కిందకు దూకడంతో అతని శరీరం ముక్కముక్కలుగా పడిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే సెక్టార్ 126 స్టేషన్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. జైన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టానికి తరలించారు. పోలీస్ అధికారులతోపాటు, ఫోరెన్సిక్ బృందం కూడా ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలను స్వాధీనం చేసుకుంది. అలాగే పోలీసులు సీసీటీవీ ఫూటేజ్ ను కూడా చూస్తున్నారు. దాంతో ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై వారికి ఓ క్లారిటీ రానుంది. ఇక ఈ ప్రమాద సమయంలో ఉన్న ప్రత్యక్ష సాక్షులను పోలీసులు విచారించనున్నారు. అయితే ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం జైన్ మృతికి కారణం అతనికున్న మానిటరీ సమస్య, ఒత్తిడి అని పోలీసులు గుర్తించారు.

పోలీసుల సమాచారం ప్రకారం జైన్ తన ఇంటి నుంచి మూడు రోజుల క్రితం వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. డబ్బు సమస్య కారణంగానే అతడు మరణించినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించినా.. జైన్ మృతికి గల అసలైన కారణం దర్యాప్తు పూర్తయ్యాకే తెలియనుంది. ఈ మేరకు సెక్టార్ 126 స్టేషన్ హెడ్ ఆఫీసర్ సుమ్నేష్ కుమార్ మాట్లాడుతూ ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. ఈ ఘటనపై మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+