Irumudi First Review: ఫర్ఫెక్ట్ ఎమోషనల్ ఫ్యామిలీ థ్రిల్లర్..!

మాస్ మహారాజా రవితేజ సినిమాలు అంటే గతంలో మినిమమ్ గ్యారంటీ అనేవారు. కానీ ఇటీవలి కాలంలో ఆయన సినిమాలు బాక్సాఫీస్ ముందు బోల్తా కొడుతున్నాయి. భర్త మహాశయులకు విజ్ఞప్తి, మాస్ జాతర, మిస్టర్ బచ్చన్, ఈగల్ సినిమాలు ఆశించినంత విజయం సాధించలేకపోయాయి. దాంతో ఇప్పుడు 'ఇరుముడి' మూవీపైనే రవితేజ ఆశలు పెట్టుకున్నారు. ఈ మూవీతో బిగ్గెస్ట్ కమ్ బ్యాక్ ఇవ్వాలని కసిగా ఈ సినిమా చేశారు. ఇరుముడి మూవీ ఆగస్టు 21 న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ మేరకు తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యుల ప్రకారం ఈ మూవీ రన్ టైమ్ 2 గంటల 25 నిమిషాలుగా ఉంది. ఈ మూవీలో రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌ గా నటిస్తుండగా.. సాయి కుమార్, అజయ్ ఘోష్, స్వసిక తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కింది.

అయితే 'ఇరుముడి' సినిమా ఫస్ట్ రివ్యూ చూస్తే.. ఈ సినిమా చాలా అద్భుతంగా ఉందని రవితేజ ఈ సినిమాలో చాలా కొత్తగా కనిపించారని ప్రివ్యూ చూసిన వాళ్లు సినిమా విశేషాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. రవితేజ నుంచి ఇలాంటి సినిమాని ఎవరూ ఊహించరని చెబుతున్నారు. U/A సర్టిఫికెట్ సొంతం చేసుకున్న ఈ మూవీ 2 గంటల 25 నిమిషాల క్రిస్పీ రన్ టైమ్ తో వస్తుండటం కారణంగా సినిమాకు రన్ టైమ్ ప్లస్ కానుంది. ఇరుముడి సినిమాలో రవితేజ అయ్యప్ప మాల వేసుకున్నాక క్యారెక్టర్‌ లో వచ్చే మార్పు సినిమాకు హైలైట్‌ అంటున్నారు.

Irumudi first review of Mass Maharaja Ravi Teja movie Irumudi a perfect emotional family thriller

ఇక తండ్రి కూతుళ్ల సెంటిమెంట్ ఈ కథకు ప్రధాన బలం. ఇది క్రైమ్ సస్పెన్స్ డ్రామా అని తెలుస్తోంది. దర్శకుడు శివ నిర్వాణ టేకింగ్, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సినిమాకు బలం.. అలాగే అయ్యప్ప స్వామికి సంబంధించిన ఇరుముడి కట్టు, మల్లెపూల పల్లకి పాటలతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ థ్రిల్లర్ కు అడిషనల్ అట్రాక్షన్ గా నిలిచాయి అని సినిమా చూసినవాళ్లు అంటున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్, సస్పెన్స్ అన్నీ పక్కాగా కుదరడంతో.. ఈ సినిమాతో రవితేజ బ్లాక్ బస్టర్ కంబ్యాక్ ఇచ్చేలా ఉన్నారని మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్నీ బాగా వర్క్ ఔట్ అయ్యాయి. కొన్ని తప్పులు ఉంటే అవి కూడా కరెక్ట్ చేసుకుంటాం అని టీం రెస్పాండ్ అయింది. దాంతో రవితేజకు బ్లాక్ బస్టర్ హిట్ గ్యారంటీ అని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+