‘విశ్వనాధ్ & సన్స్’ చిత్రాన్ని కావాలనే ఫ్లాప్ చేశారు
తెలుగు ప్రేక్షకులు మంచి కంటెంట్ ఉన్న ఏ భాషా సినిమానైనా గుండెల్లో పెట్టుకుంటారు. ముఖ్యంగా తమిళ హీరోల చిత్రాలకు ఇక్కడ మాతృభాషలో వచ్చే వసూళ్లతో సమానంగా కలెక్షన్లు ఇస్తారు. కానీ, మన సినిమాల విషయంలో తమిళ ప్రేక్షకులు చూపిస్తున్న వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో సూర్య నటించిన 'విశ్వనాధ్ & సన్స్' చిత్రాన్ని అక్కడ కావాలనే పక్కన పెట్టారనే వార్తలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
తెలుగులో అద్భుతమైన కలెక్షన్లు
ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన ఓపెనింగ్స్, పాజిటివ్ టాక్ వచ్చాయి. కానీ, తమిళనాడులో కనీస స్థాయి వసూళ్లు కూడా సాధించలేకపోయింది. తమిళనాడులో మూడు రోజులకు వచ్చిన గ్రాస్ కంటే తెలుగు రాష్ట్రాల మూడు రోజుల గ్రాస్ చాలా ఎక్కువ కావడం గమనార్హం. సూర్య గత చిత్రం 'కరుప్పు' 150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అలాంటిది మంచి పాజిటివ్ టాక్ ఉన్న 'విశ్వనాధ్ & సన్స్' చిత్రానికి అక్కడి ప్రేక్షకులు ఎందుకు దూరంగా ఉంటున్నారు? ఈ వ్యతిరేకతకు ప్రధాన కారణం సినిమా వెనుక ఉన్న తెలుగు టెక్నీషియన్లే అనే వాదన సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తోంది.

తెలుగు దర్శకుడు అని
సినిమాని తెరకెక్కించింది మన వెంకీ అట్లూరి. ఒక తెలుగు దర్శకుడు తమిళ హీరోతో సినిమా తీస్తే అక్కడి ఆడియన్స్ ఆమోదించలేకపోతున్నారు. ఈ ప్రాజెక్ట్ లో ఎక్కువ మంది నటీనటులు, నిర్మాణ సంస్థ తెలుగు రంగానికి చెందినవే. సినిమా పూర్తిగా తెలుగు ఫ్లేవర్ తో ఉందనే నెపంతో అక్కడ నెగెటివిటీ ప్రచారం చేశారు. ధనుష్, నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన 'కుబేర' ఇక్కడ పెద్ద హిట్ అయినా, తమిళనాడులో డిజాస్టర్ చేశారు.
బాహుబలి మినహా..
ఒక్క బాహుబలి మినహా మన సూపర్ హిట్లు, చివరికి 'పుష్ప' సిరీస్ ను కూడా కోలీవుడ్ ఆడియన్స్ ఆదరించలేదు. చెత్త సినిమాలను పక్కన పెట్టడం వేరు, కానీ కేవలం "డైరెక్టర్ తెలుగోడు" అనే ఒకే ఒక్క కారణంతో మంచి కంటెంట్ ఉన్న సినిమాను కావాలని ఫ్లాప్ చేయడం అక్కడి నేటివిటీ పిచ్చిని, తెలుగు పరిశ్రమపై ఉన్న అసూయని స్పష్టంగా చూపిస్తోందని నెటిజన్లు మండిపడుతున్నారు.














Click it and Unblock the Notifications