హిట్లర్ తన మేనకోడలినే చంపేశాడా? 95 ఏళ్ల తర్వాత తెరపైకి రహస్యం!

జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ సవతి మేనకోడలు ఏంజెలా గెలీ రౌబాల్ మరణం వెనుక ఉన్న 95 ఏళ్ల నాటి నిగూఢ రహస్యం కొత్త ఆధారాలతో మళ్లీ తెరపైకి వచ్చింది. 1931లో మ్యూనిచ్‌లోని హిట్లర్‌కు తన మేనకోడలు గెలీ రౌబాల్ మరణంతో సంబంధం ఉందా అనే 95 ఏళ్ల నాటి చారిత్రక రహస్యం, కొత్తగా వెలుగులోకి వచ్చిన పత్రాల ఆధారంగా మళ్లీ చర్చనీయాంశమైంది.

సీఈసీపై తేల్చేందుకు ఇండియా కూటమి సిద్ధం..! 30న కీలక భేటీ..!
సీఈసీపై తేల్చేందుకు ఇండియా కూటమి సిద్ధం..! 30న కీలక భేటీ..!

చారిత్రక ఆధారాలు
జర్మన్ చరిత్రకారుడు హెరాల్డ్ సాండ్నర్ పరిశోధనలో మ్యూనిచ్ అధికారిక మరణాల రిజిస్టర్‌తో పాటు రెండు మరణ ప్రకటనలలో ఓ కీలకమైన రికార్డు లభ్యమైంది. ఇప్పటివరకు ఆమోదించబడిన రికార్డుల ప్రకారం గెలీ రౌబల్ మృతదేహం 1931 సెప్టెంబర్ 19న లభించిందని.. ఆ సమయానికి హిట్లర్ మ్యూనిచ్ వదిలి నూరెంబర్గ్‌కు వెళ్లాడని నమ్మేవారు. కానీ కొత్త ఆధారాల ప్రకారం ఆమె మృతదేహం సెప్టెంబర్ 18న ఉదయం 10.15 గంటలకే కనుగొనబడింది. అంటే గెలీ రౌబల్ మరణం అందరూ భావించిన దాని కంటే 24 గంటల ముందే సంభవించింది. ఈ నూతన కాలక్రమం ప్రకారం.. మృతదేహం లభించిన సమయంలో హిట్లర్ ఇంకా మ్యూనిచ్‌లోనే ఉన్నాడని స్పష్టమవుతోంది.

Did Hitler Kill His Niece Geli Raubal 95 Year Old Mystery Resurfaces Full Details Here

పోలీసు దర్యాప్తు
ఆ రోజుల్లో నాజీ పార్టీ జర్మనీ రాజకీయాల్లో విస్తృత ప్రజాదరణ పొందేందుకు, ప్రచారాల్లో హిట్లర్ ను నీతి నిజాయితీలకు ప్రతీకగా చిత్రీకరించేది. ఇటువంటి సమయంలో హిట్లర్ అపార్ట్‌మెంట్లో అతని సొంత పిస్టల్ తో మేనకోడలు మరణించడం ఓ పెద్ద కుంభకోణానికి దారితీసే అవకాశం ఉంది. అందువల్ల నాజీ పార్టీ సానుభూతిపరులైన నాటి పోలీసు అధికారులు హిట్లర్ ను ఈ కేసు నుంచి కాపాడేందుకు మరణించిన తేదీని, కాలానుక్రమాన్ని మార్చి కేసును కప్పిపుచ్చే ప్రయత్నం చేసి ఉండవచ్చని చరిత్రకారులు అనుమానిస్తున్నారు. అబెర్డీన్ విశ్వవిద్యాలయ హిస్టరీ ప్రొఫెసర్ థామస్ వెబర్ కూడా ఈ పత్రాల ప్రామాణికతను పరిశీలించి, ఇవి పాత ఆధారాలను తీవ్రంగా సవాలు చేస్తున్నాయని అంగీకరించారు.

హైదరాబాద్ రుచికి గ్లోబల్ క్రేజ్.. ఉస్మానియా బిస్కెట్ కథ ఇదే!
హైదరాబాద్ రుచికి గ్లోబల్ క్రేజ్.. ఉస్మానియా బిస్కెట్ కథ ఇదే!

హిట్లర్, గెలీ రౌబాల్ సంబంధం
గెలీ రౌబాల్ హిట్లర్ సవతి సోదరి అయిన ఏంజెలా కుమార్తె. 1929లో ఆమె మ్యూనిచ్ లోని హిట్లర్ అపార్ట్‌మెంట్‌కు మారినప్పటి నుంచి వారిద్దరి మధ్య అనుబంధం పెరిగింది. హిట్లర్ ఆమెపై తీవ్రమైన వ్యామోహంతో, పూర్తి ఆధిపత్యాన్ని చెలాయించేవాడని, ఆమె స్వేచ్ఛను అదుపు చేసేవాడని చరిత్రకారులు పేర్కొంటారు. ఆమె మ్యూజిక్ నేర్చుకోవడానికి వియన్నా వెళ్లాలని భావించిన సమయంలో వారిద్దరి మధ్య తీవ్ర వివాదం జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. వారి మధ్య అక్రమ సంబంధం ఉందనే ప్రచారాలు కూడా ఉన్నప్పటికీ.. వాటిపై స్పష్టమైన ఆధారాలు లేవు.

ఈ కొత్త ఆధారాలు గెలీ రౌబాల్ మరణ సమయాన్ని, ఆ సమయంలో హిట్రర్ ఉనికిని స్పష్టం చేస్తున్నప్పటికీ.. ఆమెను హిట్లరే నేరుగా హత్య చేశాడని పూర్తి స్థాయిలో నిరూపించలేకపోతున్నాయి. ఆమెది ఆత్మహత్యో లేదా హత్యో అనే నిజాన్ని స్పష్టంగా తేల్చకపోయినప్పటికీ.. ఇప్పటివరకు నమ్మిన చారిత్రక కథనాన్ని మలుపు తిప్పి ఈ 95 ఏళ్ల నాటి రహస్యాన్ని మళ్లీ పరిశోధనలోకి నెట్టాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+