రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల బుకింగ్‌ పై TTD కీలక ప్రకటన, భారీ డిమాండ్ తో..!!

టీటీడీ కీలక ప్రకటన చేసింది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా టీటీడీ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా దర్శనంతో పాటుగా మౌలిక వసతుల కల్పన పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. కాగా.. ప్రతీ నెలా టీటీడీ విడుదల చేస్తున్న రూ 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు అందటం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ టికెట్ల బుకింగ్ కు వస్తున్న డిమాండ్ తో పాటుగా.. జరుగుతున్న ప్రచారం పైన టీటీడీ స్పష్టత ఇచ్చింది.

 తిరుమల కొండపైకి బైక్‌లకు నో ఎంట్రీ - దర్శనం, పార్కింగ్ పై టీటీడీ కీలక సూచనలు..!!
తిరుమల కొండపైకి బైక్‌లకు నో ఎంట్రీ - దర్శనం, పార్కింగ్ పై టీటీడీ కీలక సూచనలు..!!

శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల ఆన్‌లైన్ బుకింగ్‌పై భక్తుల్లో వ్యక్తమవుతున్న సందేహాలకు టీటీడీ వివరణ ఇచ్చింది. టీటీడీ ఆన్‌లైన్ బుకింగ్ వ్యవస్థలను అధిక సంఖ్యలో భక్తులు ఒకేసారి వచ్చే డిమాండ్‌ను నిర్వహించేలా Google Cloud Platform (GCP), Load Balancing, Auto Scaling, Distributed Application Architecture, Horizontal Scaling వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహిస్తున్నట్లు తెలిపింది. అధిక డిమాండ్ సమయంలో వివిధ Application, API, Gateway తదితర సేవలను అనేక Replicas ద్వారా నిర్వహిస్తూ వ్యవస్థ పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొంది. టికెట్ల విడుదల సమయంలో ప్రత్యేక Technical War-Room ఏర్పాటు చేసి, Application Performance, Infrastructure Health, Transactions, Security తదితర అంశాలను నిరంతరం పర్యవేక్షిస్తూ, సమస్యలు తలెత్తిన వెంటనే పరిష్కరించే విధంగా సాంకేతిక బృందాలు పనిచేస్తున్నాయని వివరించింది.

తిరుమలలో వారికీ డ్రెస్ కోడ్: టీటీడీ తాజా ఆదేశాలు
తిరుమలలో వారికీ డ్రెస్ కోడ్: టీటీడీ తాజా ఆదేశాలు
TTD Clarifies Doubts Over 300 Special Entry Darshan Ticket Booking here the full details

అదే విధంగా ఈ టికెట్ల కోసం అధిక డిమాండ్ ఉన్న బుకింగ్ సమయంలో సుమారు 6 లక్షల మంది యూజర్లు టికెట్ల కోసం ప్రయత్నిస్తుండగా, ఒక్కో యూజర్ సగటున నలుగురు కుటుంబ సభ్యుల కోసం ప్రయత్నిస్తే సుమారు 24 లక్షల టికెట్లకు డిమాండ్ ఏర్పడే అవకాశం ఉందని టీటీడీ తెలిపింది. అయితే అందుబాటులో ఉన్న కోటా సుమారు 2.69 లక్షల టికెట్లు మాత్రమే అని వివరించింది. అందుబాటులో ఉన్న కోటాతో పోలిస్తే డిమాండ్ దాదాపు 9 రెట్లు అధికంగా ఉంటుందని పేర్కొంది. ఈ కారణంగా వేలాది మంది ఒకే సమయంలో ఒకే స్లాట్ కోసం ప్రయత్నించడంతో టికెట్లు అత్యంత తక్కువ సమయంలోనే పూర్తవుతాయని వివరించింది.ఒకేసారి భారీ సంఖ్యలో అభ్యర్థనలు వచ్చినప్పుడు Backend Systemsపై అధిక భారం పడకుండా, మొత్తం వ్యవస్థ స్థిరత్వాన్ని కాపాడేందుకు Virtual Queue ఉపయోగిస్తున్నట్లు టీటీడీ తెలిపింది. ఇది అధిక ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే సాంకేతిక విధానమని స్పష్టం చేసింది.

అలాగే 'Slot Unavailable' వంటి సందేశాలు అధిక డిమాండ్ కారణంగా అందుబాటులో ఉన్న టికెట్లు తక్కువ సమయంలో పూర్తవడం వల్ల కూడా రావచ్చని, దీనిని మాత్రమే ఆధారంగా చేసుకుని సాంకేతిక వైఫల్యంగా నిర్ధారించడం సరికాదని సూచించింది. అదే విధంగా ఆన్‌లైన్ చెల్లింపుల ప్రక్రియ TTD అప్లికేషన్‌తో పాటు Payment Gateways, Banking Networks, UPI Networks వంటి బాహ్య వ్యవస్థలపై కూడా ఆధారపడి ఉంటుందని టీటీడీ వివరించింది. దీని వలన ఏదైనా Transaction విఫలమైనప్పుడు సమస్య ఏ దశలో ఏర్పడిందో పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొంది. టికెట్ లభించకపోవడాన్ని, ఆన్‌లైన్ బుకింగ్ వ్యవస్థ పనిచేయకపోవ డాన్ని ఒకటిగా పరిగణించరాదని టీటీడీ స్పష్టం చేసింది. భక్తుల Feedbackను పరిగణనలోకి తీసుకుని Online Booking, Application మరియు Database Performance, High-Load Handling, Security, Anti-Bot Mechanisms, Payment Processes తదితర అంశాల్లో నిరంతరం సాంకేతిక అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+