ఓటీటీలోకి 300 కోట్ల మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ.. ఎందులో చూడాలంటే..??
సాధారణంగా మలయాళం సినిమాలు అనగానే హార్రర్, థ్రిల్లర్, సస్పెన్స్ తో కూడిన స్టోరీస్ ఎక్కువగా ఉంటాయి. ఇక ఇటీవలికాలంలో ఈ జానర్లలోనే సినిమాలు అధికంగా తీస్తున్నారు. అలాంటి సమయంలోనే ఓ బ్రీజీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన మూవీనే 'బెత్లెహాం కుటుంబ యూనిట్'.. ఇటీవల మలయాళంలో రిలీజ్ అయి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఏకంగా రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి అప్పటివరకూ ఉన్న అన్ని మలయాళం సినిమాల కంటే అత్యధిక వసూల్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది.
అంతేకాదు దక్షిణాది రాష్ట్రాల్లోనే ఈ ఏడాది అత్యధిక వసూల్లు సాధించిన చిత్రంగానూ రికార్డులు నమోదు చేసింది. తమిళంలో విజయ్ 'జన నాయగన్', తెలుగులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' చిత్రాలను సైతం వెనక్కు నెట్టినట్లు సమాచారం. హృదయానికి హత్తుకునేలా ఈ రొమాంటిక్ కామెడీ సినిమాను దర్శకుడు తెరకెక్కించడంతో యువతతోపాటు కుటుంబ ప్రేక్షకులూ ఈ మూవీకి కనెక్ట్ అయినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. మలయాళం యంగ్ హీరో నివిన్ పౌలీ, క్రేజీ హీరోయిన్ మమితా బైజు కాంబోలో తెరకెక్కిన ఈ మూవీకి 'ప్రేమలు' ఫేమ్ గిరీశ్ ఏడీ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో సంగీత్ ప్రతాప్, సురేశ్ కృష్ణ, వినయ్ ఫోర్ట్, రోషన్ షానవాస్ తదితరులు కీలకపాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి దిలీష్ పోతన్, ఫహాద్, శ్యామ్ పుష్కరన్ నిర్మాతలుగా వ్యవహరించారు. అయితే ఈ మూవీ ప్రముఖ ఓటీటీ జియో హాట్ స్టార్ లో అక్టోబర్ 2 నుంచి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.

ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే.. హీరో జస్టిన్ (నివిన్ పౌలీ) కేటరింగ్ బిజినెస్ నిర్వహిస్తుంటాడు. 30 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోలేదు. పక్కింటిలోకి కొత్తగా వచ్చిన ఆష్లే (మమితా బైజు)తో జస్టిన్ కు స్నేహం పెరుగుతుంది. ఆమె జస్టిన్ కంటే పది పన్నెండేళ్లు చిన్న వయసు. ఇక ఆష్లే ఓ కాలేజీ స్టూడెంట్ కాగా తండ్రి మద్యానికి బానిస కావడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తి సొంతూరిని వదిలి అంగమాలికి షిఫ్ట్ అవుతుంది. అయితే అక్కడే స్థానిక చర్చికి సంబంధించిన ఓ ప్రార్థనా బృందం బెత్లహామ్ కుటుంబ యూనిట్ పరిచయం అవుతుంది. ఈ క్రమంలో జస్టిన్ ను ఆష్లే ప్రేమిస్తుంది. ఆ తర్వాత జస్టిన్ కూడా లవ్ చేస్తాడు. అయితే వీరి పెళ్లిని పెద్దలు అంగీకరించారా..? చివరకు ఒకటయ్యారా..? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే..












Click it and Unblock the Notifications
