షాకింగ్ క్రైమ్: భార్యను చంపి... 3 రోజులు శవంతోనే ఒకే గదిలో!

బెంగళూరు నగరపాలక సంస్థ ఖాళీ స్థలాలను శుభ్రం చేసే కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనులు ఓ సంచలనాత్మక హత్య కేసును వెలుగులోకి తెచ్చాయి. సంపిగేహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఖాళ్లీ స్థలంలో పారిశుద్ధ కార్మికులు చెత్తను తొలగిస్తుండగా.. దారుణంగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ఓ మహిళ మృతదేహం బయటపడింది. పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టి, హత్యకు గురైన మహిళ 28 ఏళ్ల అనసూయ బెహెరాగా గుర్తించి, ఆమె భర్త సాగర్ చంద్ర రావత్‌ను అరెస్ట్ చేశారు.

బీహార్ కు చెందిన సాగర్ రావత్(32), అనసూయ(28) కొంతకాలంగా ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు. జీవనోపాధి కోసం కొద్ది నెలల క్రితమే వీరిద్దరూ బెంగళూరుకు వచ్చారు. సాగర్ ఓ హోటల్లో పనిచేస్తుండగా.. అనసూయ ఓ దుస్తుల షోరూమ్‌లో ఉద్యోగం చేస్తుండేది. అయితే ఆర్థికపరమైన విషయాల్లో వీరిద్దరి మధ్య తరచూ తీవ్ర వివాదాలు జరుగుతుండేవి.

సీఈసీపై తేల్చేందుకు ఇండియా కూటమి సిద్ధం..! 30న కీలక భేటీ..!
సీఈసీపై తేల్చేందుకు ఇండియా కూటమి సిద్ధం..! 30న కీలక భేటీ..!

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆగస్టు 11న దంపతుల మళ్లీ గొడవ జరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన సాగర్ రావత్, అనసూయపై తీవ్రంగా దాడి చేసి, మెడ నులిమి హత్య చేశాడు. హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని దాదాపు మూడు రోజుల పాటు ఇంట్లోనే ఉంచాడు. అనంతరం మృతదేహాన్ని ఓ బెడ్‌షీట్‌‌లో చుట్టి, బెడ్ లో కప్పి సంపిగేహళ్లిలోని ఓ ఖాళీ స్థలంలో పడేశాడు.

Bengaluru Crime Man Kills Wife Stays With Body For 3 Days dumping her body in a vacant plot

మృతదేహాన్ని పడేసిన తర్వాత కూడా సాగర్ రావత్ ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు రోజూ ఆ ప్లాట్ వద్దకు వచ్చి మృతదేహాన్ని ఎవరైనా గుర్తించారా లేదా అని చూసి వెళ్లేవాడు. ఆగస్టు 11న జరిగిన ఈ హత్యోదంతం సెప్టెంబర్ 2న పారిశుద్ధ్య కార్మికులు ఆ ఖాళీ స్థలాన్ని శుభ్రం చేస్తున్నప్పుడు వెలుగులోకి వచ్చింది. అప్పటికే మృతదేహం బాగా కుళ్లిపోయి వీధికుక్కలు కొంత భాగాన్ని తినేశాయి.

మీరొక కీలుబొమ్మ: ఐరాసలో పాకిస్తాన్ ను ఉతికి ఆరేసిన భారత్
మీరొక కీలుబొమ్మ: ఐరాసలో పాకిస్తాన్ ను ఉతికి ఆరేసిన భారత్

మృతదేహం గుర్తుపట్టలేని విధంగా ఉండటంతో గుర్తింపు సాధించడం పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. అయితే మృతదేహంపై ఉన్న దుస్తుల ట్యాగ్ పోలీసులకు కీలక ఆధారంగా మారింది. ఆ ట్యాగ్ ఆధారంగా దుస్తులు కొనుగోలు చేసిన మాల్‌ను ట్రాక్ చేసి అనసూయ సమాచారాన్ని పోలీసులు సేకరించారు. ఆ తర్వాత ఆమె భర్త సాగర్ హోటల్లో యథావిధిగా విధులకు హాజరువుతున్నట్లు గుర్తించారు.

హోటల్ వద్ద విచారణ జరిపిన పోలీసులు, భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాల గురించి తెలుసుకుని సాగర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో సాగర్ తన భార్యను తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. సంపిగేహళ్లి పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరచి రిమాండ్‌కు తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+