భారత్ చేతిలో ఇరాన్ కు మళ్లీ చావుదెబ్బ..: డబుల్ బొనాంజా

జపాన్ వేదికగా సాగుతున్న ఆసియా గేమ్స్ లో భారత ప్రతిష్ట మరోసారి మార్మోగింది. లీగ్ దశ నుంచి అజేయంగా దూసుకొచ్చిన భారత పురుషుల కబడ్డీ జట్టు ఫైనల్ లో సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి ఇరాన్ ను మట్టికరిపించింది. అత్యంత బలమైన ఈ జట్టును ఓడించి పసిడి పతకాన్ని ముద్దాడింది. 40-33 పాయింట్ల తేడాతో ఇరాన్ ను ఓడించి, తిరుగులేదనిపించుకుంది.

అంతకుముందే ఇదే కబడ్డీ ఈవెంట్ లో ఇదే ఇరాన్ ను చిత్తు చేసింది భారత మహిళల కబడ్డీ టీమ్. దీంతో ఒకే రోజు ఒకే స్పోర్ట్ ఈవెంట్ లో భారత్ రెండు బంగారం పతకాలను సాధించినట్టయింది. మ్యాచ్ ప్రారంభం నుంచే బరిలో ఈ రెండు జట్ల అమీ తుమీ అన్నట్లుగా ఢీ కొట్టాయి. గట్టి పోటీ నెలకొంది. డిఫెన్స్ విభాగాన్ని పటిష్టంగా ఉండేలా చూసుకున్న ఇరాన్.. ఆరంభంలో భారత రైడర్లపై తీవ్రమైన ఒత్తిడి పెంచింది. ఉక్కిరిబిక్కిరికి గురి చేసింది. ప్రతి ఒక్క పాయింట్ కోసం ఇరు జట్ల ప్లేయర్లు శ్రమించాల్సి వచ్చింది.

Indian Men s Kabaddi Team clinching Gold Medal after thrilling battle against Iran 40-34 in finals

ఇరాన్ డిఫెన్స్ చూపిన పట్టుదల కారణంగా తొలి సగభాగం ముగిసే సమయానికి ఆ జట్టు 18-17 పాయింట్లతో తేడాతో స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. ఇది భారత్ క్యాంప్ లో ఆందోళన కలిగించినప్పటికీ.. ఆటగాళ్లు మరింత పట్టుదలతో సెకెండాఫ్ లో బరిలో దిగారు. తమ వ్యూహాలను మరింత పదునుపెట్టారు. అటాకింగ్ కు ప్రాధాన్యత ఇచ్చారు.

ఫైనల్ లో ఇరాన్ ను కబడ్డీ ఆడేసిన భారత్
ఫైనల్ లో ఇరాన్ ను కబడ్డీ ఆడేసిన భారత్

రెండో భాగం ప్రారంభం కాగానే భారత కబడ్డీ జట్టు పూర్తిగా భిన్నంగా కనిపించింది. కెప్టెన్ సునీల్ కుమార్ మార్గదర్శకత్వంలో ఆటగాళ్లు పాదరసంలా కదిలారు. స్టార్ రైడర్లు అర్జున్ దేశ్వాల్, అస్లాం ఇనామ్ దార్.. ఇరాన్ డిఫెన్స్ ను సమర్థవంతంగా ఛేదిస్తూ పాయింట్ల వర్షం కురిపించారు. మ్యాచ్ మరో కొన్ని నిమిషాల్లో ముగుస్తుందనగా, భారత డిఫెన్స్ విభాగం అసాధారణమైన సమష్టి ప్రతిభను ప్రదర్శించి ఇరాన్‌ను ఆలౌట్ చేసింది.

చంద్రుడిపై ఒక రాత్రి గడవాలంటే 14 రోజులు: సోలార్ టవర్ కు ప్లాన్..!!
చంద్రుడిపై ఒక రాత్రి గడవాలంటే 14 రోజులు: సోలార్ టవర్ కు ప్లాన్..!!

ఈ అద్భుత ప్రదర్శనతో లభించిన పాయింట్లే భారత్‌కు తిరుగులేని ఆధిక్యాన్ని తెచ్చిపెట్టి విజేతగా నిలిపింది. ఇది పురుషుల కబడ్డీ జట్టుకు తొమ్మిదో స్వర్ణపతకం. ఆసియా గేమ్ లో భారత్ సాధించిన నాలుగో బంగారం పతకం ఇది. పురుషుల జట్టు ఈ చారిత్రాత్మక విజయం సాధించడానికి కొద్ది గంటల ముందే భారత మహిళల కబడ్డీ టీమ్ కూడా ఇరాన్‌ను ఫైనల్ లో ఓడించి దేశానికి బంగారు పతకాన్ని కానుకగా ఇచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+