ఎల్లుండే.. ఉస్తాద్.. ఫ్యాన్స్ కు పండగ

పవన్ కల్యాణ్ నటిస్తోన్న సినిమా.. ఉస్తాద్ భగత్ సింగ్. హైఓల్టేజ్ యాక్షన్‌ మూవీ ఇది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. హరీష్ శంకర్ దర్శకుడు. మైత్రీ మూవీస్ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ సినిమాను నిర్మించారు. శ్రీలీల హీరోయిన్. అశుతోష్ రాణా, నవాబ్ షా, అవినాష్, గౌతమి కీలక పాత్రల్లో నటిస్తోన్నారు. తమిళంలో విజయ్ నటించిన థేరి సినిమాకు రీమేక్ ఇది. దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

2012లో రిలీజ్ అయిన గబ్బర్ సింగ్ కూడా వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమానే కావడం వల్ల దీనిపై మంచి హైప్ క్రియేట్ అయింది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపించింది గబ్బర్ సింగ్. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సైతం అదే స్టైల్‌లో ఉంటుందని సంబరపడుతున్నారు ఫ్యాన్స్. దీనికి తోడు పవన్ కల్యాణ్ రగ్డ్ లుక్స్‌లో కనిపిస్తోండటం సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ ను ఓ రేంజ్ కు తీసుకెళ్లింది.

Get Ready for an Electrifying Ustaad Bhagat Singh Pre-Release Evening at Yousufguda on March 15

ఈ నెల 19వ తేదీన విడుదల కాబోతోంది.. ప్రపంచవ్యాప్తంగా. ఈ మూవీ ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న అభిమానులకు పండగలాంటి వార్త అందింది. ఈ నెల 15వ తేదీన ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనుంది. హైదరాబాద్ యూసుఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్ లో ఈ ఈవెంట్ జరుగనుంది. దీనికి పవన్ కల్యాణ్ హాజరు కానున్నారు. దర్శకుడు హరీష్ శంకర్, హీరోయిన్ శ్రీలీల, ఇతర నటీనటులు పాల్గొననున్నారు.

ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు నిర్మాతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సినిమాపై ముందే ఉన్న ఆకాశమంత అంచనాలు ఉన్నందు వల్ల ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో అభిమానుల తరలి రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఓ పండుగ వాతావరణాన్ని వారికి అందించనుంది. నిర్మాతలు ఈ ఈవెంట్‌ను చాలా ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నారు. వేదిక అభిమానుల కోలాహలంతో నిండిపోవడం ఖాయం. సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు, తాజా అప్‌డేట్‌లు ఇక్కడ వెల్లడయ్యే అవకాశం ఉంది, 'ఉస్తాద్ భగత్ సింగ్'కు ఇది అత్యంత కీలకమైన ప్రచార కార్యక్రమం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+