వాస్తు ప్రకారం ఇంట్లో తలుపులు, కిటికీలు సరిసంఖ్యలో ఉండాలా? బేసి సంఖ్యలో ఉండాలా?

వాస్తు ప్రకారం ఇంటికి ఉండే తలుపులు, కిటికీలు సరిసంఖ్యలో ఉండాలా? బేసి సంఖ్యలో ఉండాలా? అనే సందేహం అందరినీ వేధిస్తుంటుంది. వాస్తు ప్రకారమే నిర్మాణం జరిగినా కొంతమంది వాస్తు నిపుణుల సలహాలను అనుసరించి కొందరు సరిసంఖ్యలో, మరికొందరు బేసి సంఖ్యలో తలుపులను, కిటికీలను పెడుతుంటారు. అలాగే వీటిని కలిపి లెక్కించాలా? విడిగా లెక్కించాలా? అలా లెక్కించినప్పుడు సరిసంఖ్య రావాలా? బేసి సంఖ్య రావాలా? అనే వివరాలను మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. అలాగే బాత్ రూం తలుపులను కూడా లెక్కించాలి.

ఇంట్లోని తలుపులు, కిటికీలు మొత్తం సరిసంఖ్యలో ఉండాలి.
2, 4, 6, 8, 10, 12, 14, 16.. ఇలా ఉండాలి.
అయితే తలుపుల సంఖ్య చివరలో సున్నా రాకూడదు.
10, 20, 30 కాకుండా, 8, 12, 14, 16.. ఇలా ఉండాలి.
బేసి సంఖ్య వద్దని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు.

Vastu Tips should there be an even number of doors and windows in a house Should there be an odd number

కిటికీల సంఖ్యను కూడా సరిసంఖ్యలోనే ఉంచుకోవాలి.
వీలుంటే తలుపుల కంటే కిటికీలు ఎక్కువగా ఉండేలా చూడండి.
తలుపులు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉంటే
ఇంట్లోకి గాలి, వెలుతురు ధారాళంగా వస్తాయి.
ఇలా రావడం అనేది వాస్తు ప్రకారం చాల మంచిది.

ఇంటి ప్రధాన ద్వారం ఇతర తలుపుల కంటే పెద్దదిగా ఉండాలి.
దీన్ని సాధ్యమైనంత ఆకర్షణీయంగా ఉండేలా చూడండి.
మీ ఇంట్లో తలుపులు బేసి సంఖ్యలో ఉంటే, వాటిని మార్చడం వీలుకాకపోతే
ఒక చిన్న కిటికీని లేదా తలుపును అదనంగా నిర్మించాలి.
ఇలా చేస్తే అవి సరిసంఖ్యకు చేరుకుంటాయి.
వాస్తు నిపుణుల ప్రకారం మార్పులు చేసుకోండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+