Bihar jewellery heist: పట్టపగలే జ్యువెలరీ షాపులో దూరి.. రూ. 40 కోట్ల బంగారంతో జంప్.. మళ్లీ వస్తామంటూ..

బంగారం దుకాణాల్లో ఇటీవల దోపిడీలు అధికం అవుతున్నాయి. ఇటీవల తమిళనాడులోని మధురైలో కొత్తగా ప్రారంభించిన తనిష్క్ జ్యువెలరీ షాపులో దాదాపు రూ. 30 కోట్ల విలువైన బంగారాన్ని దుండగులు దోచుకెళ్లిన ఘటన తెలిసిందే. అయితే ఈ ఘటన మరువకముందే బిహార్ లో మరో షాకింగ్ ఘటన జరిగింది. తనిష్క్ తరహాలో బీహార్‌ లోనూ భారీ దోపిడీ జరిగింది.

పశ్చిమ చంపారన్ జిల్లాలోని సెంకో జ్యువెలర్స్ షోరూమ్‌ లోకి మూడు బైక్‌ లపై వచ్చిన ఎనిమిది మంది దుండగులు పట్టపగలే షోరూమ్ లోకి చొరబడి సుమారు రూ.30 నుంచి 40 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. అంతేకాక వెళ్లిపోయే ముందు ఆ దుండగులు 'మళ్లీ వస్తాం.. ఇదంతా సినిమా' అంటూ హెచ్చరించినట్లు సమాచారం.

Bihar jewellery showroom robbery gold worth 40 crore stolen broad daylight they promised to return

ఇక దోపిడీకు సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీటీవీల్లో రికార్డ్ అయ్యాయి. దుండగులు తొపాకులతో షోరూమ్ లోకి ప్రవేశించడంతో వారిని అడ్డుకునేందుకు షాపులోని ఉద్యోగులు ఎవరూ సాహసం చేయలేకపోయారు. అయితే అతికష్టం మీద ఓ ఉద్యోగి వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆ ఉద్యోగిపై తుపాకీతో దాడి చేసి గాయపరిచారు. తర్వాత బ్యాగుల్లో బంగారాన్ని సర్దుకుని అక్కడి నుంచి పరార్ అయ్యారు. ఇక సమాచారం తెలుసుకున్న వెంటనే చంపారన్ రేంజ్ డీఐజీ హర్ కిషోర్ రాయ్, ఎస్ ఎస్పీ కుమార్ గౌతమ్ లు భారీ పోలీసు బలగాలతో ఘటనా స్థలనానికి చేరుకున్నారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ప్రస్తుతం నిందితులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.

సినీ ఫక్కీలో జరిగిన ఈ భారీ దోపిడీతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. జ్యువెలరీ షాపులపై ఇలా వరుసగా దోపిడీలు జరుగుతుండటంపై వర్తక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సాధారణంగా రాత్రిళ్లు దొంగతనాలు జరగడం చూస్తుంటాం.. కానీ ఇటీవలికాలంలో పట్టపగలే తుపాకులతో ఇలాంటి దారుణాలు జరుగుతున్న నేపథ్యంలో బిహార్ లో లా అండ్ ఆర్డర్ పై సామాజిక మాధ్యమాల్లో పలు ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని నెట్టింట కామెంట్స్ పెడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+