షారుఖ్ ఖాన్ జట్టుకు బిగ్ ట్విస్ట్.. కేకేఆర్‌లో పెట్టుబడి పెట్టనున్న అమెరికన్ దిగ్గజం!

ఐపీఎల్ మూడుసార్లు ఛాంపియన్, బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ సహ-యజమానిగా ఉన్న కో‌ల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ యాజమాన్యంలో భారీ మార్పు చోటుచేసుకోబోతోంది. ఈ జట్టులో కీలక భాగస్వామి, ప్రముఖ నటి జుహీ చావ్లా భర్త జయ్ మెహతా తన వాటాలో సగభాగాన్ని విక్రయించడానికి సిద్ధమయ్యారు. తన వద్ద ఉన్న 45 శాతం వాటాలో సగం, అంటే 22.5 శాతం వాటాను అమెరికాకు చెందిన దిగ్గజ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ 'ఏరిస్ మేనేజ్మెంట్'కు విక్రయించనున్నారు. ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ క్లబ్ 'చెల్సియా ఎఫ్సీ', ఎన్ఎఫ్ఎల్ జట్టు 'మియామీ డాల్ఫిన్స్' యాజమాన్యంలోనూ ఈ అమెరికన్ సంస్థకు వాటాలుండటం విశేషం.

తనను బూతులు తిట్టిన వాడితోనే ట్రోఫీ గెలిచాడు!.. ధోనీ కెప్టెన్సీ వెనుక షాకింగ్ స్టోరీ!
తనను బూతులు తిట్టిన వాడితోనే ట్రోఫీ గెలిచాడు!.. ధోనీ కెప్టెన్సీ వెనుక షాకింగ్ స్టోరీ!

రూ.16,634 కోట్లకు చేరిన కేకేఆర్ వాల్యూ
క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. జయ్ మెహతా, ఏరిస్ యాజమాన్యం మధ్య ఈ మెగా డీల్ సుమారు 400 మిలియన్ డాలర్లకు(భారత కరెన్సీలో దాదాపు రూ.3,730 కోట్లు) కుదరబోతోంది. ఈ ఒప్పందం ప్రకారం కోల్‌కతా నైట్ రైడర్స్ మొత్తం విలువ ఏకంగా 1.78 బిలియన్ డాలర్లు(సుమారు రూ.16,634 కోట్లు)గా నమోదైంది. ఇటీవల రాజస్థాన్ రాయల్స్(రూ.15,660 కోట్లు), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(రూ.16,660 కోట్లు) ఫ్రాంచైజీల విక్రయ ధరలకు ఇది దాదాపు సమానంగా ఉంది.

Kolkata Knight Riders US Firm Ares Management to Buy 22 5 Stake in Shah Rukh Khan KKR for 400 Million

షారుఖ్ వాటాకు ఢోకా లేదు.. బీసీసీఐకి రూ.200 కోట్లు!
కేకేఆర్ ఫ్రాంచైజీలో అత్యధికంగా 55 శాతం వాటా ఉన్న సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తన వాటాను అలాగే కొనసాగించనున్నారు. 2007లో తొలిసారి ఐపీఎల్ జట్ల వేలం జరిగినప్పుడు షారుఖ్ ఖాన్, జుహీ చావ్లా, జయ్ మెహతా కలిసి 'నైట్ రైడర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్' ద్వారా ఈ జట్టును కొనుగోలు చేశారు. ప్రస్తుతం జయ్ మెహతా, ఏరిస్ మేనేజ్మెంట్ మధ్య పూర్తిస్థాయి నగదు ఒప్పందం చివరి దశకు చేరుకుంది. కొత్త యజమాని నేపథ్యాన్ని పరిశీలించిన తర్వాత బీసీసీఐ దానికి అధికారిక ఆమోదం తెలపాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం ఈ డీల్ విలువలో 5 శాతం అంటే సుమారు 20 మిలియన్ డాలర్లు(దాదాపు రూ.200 కోట్లు) బీసీసీఐ ఖజానాకు చేరనున్నాయి.

IPL 2027 రిటెన్షన్.. ఏ జట్టు ఎవరిని వదిలేసిందో తెలుసా?
IPL 2027 రిటెన్షన్.. ఏ జట్టు ఎవరిని వదిలేసిందో తెలుసా?

ఐపీఎల్‌లో పెరుగుతున్న అమెరికన్ కంపెనీల హవా
2022లో సీవీసీ క్యాపిటల్ సంస్థ గుజరాత్ టైటాన్స్ జట్టును కొనుగోలు చేసినప్పటి నుంచి ఐపీఎల్‌పై అమెరికన్ పెట్టుబడి సంస్థల ఆసక్తి విపరీతంగా పెరిగింది. ఆర్సీబీలోనూ బ్లాక్‌స్టోన్, బోల్డ్ వెంచర్స్ వంటి యూఎస్ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. ఏరిస్ మేనేజ్‌మెంట్‌కు క్రికెట్ కొత్తేమీ కాదు.. ఇంగ్లాండ్‌లోని 'ది హండ్రెడ్'లీగ్‌లో 'ట్రెంట్ రాకెట్స్' జట్టుకు కూడా ఈ సంస్థ సహ-యజమానిగా వ్యవహరిస్తోంది. కాగా కేకేఆర్ జట్టు 2012, 2014, 2024 సీజన్లలో ఐపీఎల్ ట్రోఫీలను ముద్దాడగా.. 2021లో రన్నరప్‌గా నిలిచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+