'ఆకాశంలో ఒక తార' మూవీ ఫస్ట్ రివ్యూ ఇదే.. దుల్కర్ సల్మాన్ ఖాతాలో మరో హిట్ పడిందా..?

కంటెంట్ ఉన్న సినిమాలతో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను అలరించడంలో ముందుంటారు దుల్కర్ సల్మాన్. పాత్ర ఏదైనా అందులోకి పరకాయ ప్రవేశం చేసి తనదైన శైలిలో నటనతో మెప్పిస్తుంటారు. తెలుగులో గతంలో లక్కీ భాస్కర్, సీతారామం లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న ఆయన ఇప్పుడు మరోసారి స్ట్రైయిట్ తెలుగు సినిమాతో అలరించేందుకు వస్తున్నారు అదే 'ఆకాశంలో ఒక తార' మూవీ.. ఈ మూవీ నవంబర్ 20 న గ్రాండ్ గా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.

మనసును హత్తుకునే ఎమోషన్స్​ ఈ మూవీలో ఉండనున్నాయని ట్రైలర్ చూస్తుంటే అర్థం అవుతోంది. ఇక ఈ మూవీలో శ్రుతిహాసన్, డైరెక్టర్ గౌతమ్​ మేనన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సమర్పణలో సందీప్‌ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మించారు. ఈ చిత్రానికి ప‌వ‌న్ సాధినేని దర్శకత్వం వహించారు. మరి వెండితెరపై ఈ ఎమోషనల్ జర్నీ ప్రేక్షకులను ఏ మేరకు కట్టిపడేస్తుందో నవంబంర్ 20న తెలియనుంది.

DulquerSalmaan Here is the first review of the movie Aakasamlo Oka Tara has scored another hit

ఇక ఆకాశంలో ఒక తార మూవీ సెన్సార్ కార్యక్రమాలను ఇటీవల పూర్తి చేసుకుంది. ఈ మూవీ రన్ టైమ్ సుమారు 160 నిమిషాలు అంటే 2 గంటల 40 నిమిషాలు ఉండనున్నట్లు సమాచారం. అటు సెన్సార్ సభ్యుల నుంచి కూడా ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో భావోద్వేగాలు, కుటుంబ బంధాలు, స్ఫూర్తిదాయక సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయని ఇండస్ట్రీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో మొత్తానికి దుల్కర్ సల్మాన్ కెరీర్ లో మరో హిట్ చేరిందని సామాజిక మాధ్యమాల ద్వారా మాట్లాడుకుంటున్నారు. ఇలా వరుసగా దుల్కర్ సల్మాన్ తెలుగులో మంచి హిట్స్ సాధించడం గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఈ మూవీ ఈ నెల 20న తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. అయితే ఆకాశంలో ఒక తార మూవీ ఫుల్ రివ్యూ కోసం నవంబర్ 20 వరకు ఆగాల్సిందే..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+