న్యూజిలాండ్ తో మొదటి టెస్ట్- టీమిండియా కీ వెపన్స్

న్యూజిలాండ్ లో భారత జట్టు పర్యటన తుది అంకానికి చేరుకుంది. ఇప్పటికే టీ20, వన్డే సిరీస్ లను దిగ్విజయంగా ముగించుకున్న టీమిండియా.. ఇక టెస్టుల్లో ఆ జట్టును ఢీకొనబోతోంది. వెలింగ్టన్‌ బేసిన్ రిజర్వ్ స్టేడియం వేదికగా తొలి టెస్ట్ జరగబోతోంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ అర్హత రేసులో నిలవడానికి ఈ రెండు టెస్టుల సిరీస్ టీమిండియాకు అత్యంత కీలకం. వెల్లింగ్టన్ పిచ్ ఫాస్ట్ బౌలింగ్ కు అనుకూలిస్తోన్న నేపథ్యంలో ఏడుమంది స్పెషలిస్ట్ బ్యాటర్లు, నలుగురు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగనుంది.

ఈ మ్యాచ్ చూడాలనుకుంటే వేకువ జామునే మేల్కొనాల్సి ఉంటుంది. భారత కాలమానం ప్రకారం వేకువ జామున 3:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. మూడు గంటలకు టాస్ పడుతుంది. సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్, సోనీలివ్ లో లైవ్ టెలికాస్ట్, స్ట్రీమింగ్ అవుతుంది. 1955 నుంచి ఈ రెండు జట్ల మధ్య మొత్తం 65 మ్యాచ్ లు జరగ్గా అత్యధికంగా భారత్ 22 సార్లు గెలిచింది. 16 మ్యాచ్ లల్లో కివీస్ విజయం సాధించింది. 27 టెస్టులు డ్రా అయ్యాయి.

India vs New Zealand 1st test Shubman Gill leading and Jasprit Bumrah returning to red-ball setup

యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ జట్టును ఇన్నింగ్ ను ఆరంభించనున్నారు. మూడో స్థానంలో దేవ్‌దత్ పడిక్కల్, కీలకమైన నాలుగో స్థానంలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్‌కు దిగనున్నారు. గాయం నుంచి కోలుకొని టెస్టు జట్టులోకి పునరాగమనం చేసిన వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ అయిదో స్థానంలో ఆడటం ఖాయంగా కనిపిస్తోంది. సరిపడా మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోయినా పంత్ రాకతో టీమిండియా మిడిల్ ఆర్డర్‌కు అదనపు బలం సమకూరినట్టయింది. స్టార్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా కూడా అందుబాటులోకి రావడంతో బౌలింగ్ బలోపేతమైనట్టే.

చెన్నై రూపురేఖలు మార్చే ప్రాజెక్టులను ప్రారంభించిన విజయ్
చెన్నై రూపురేఖలు మార్చే ప్రాజెక్టులను ప్రారంభించిన విజయ్

జట్టులో ఏకైక ప్రధాన స్పిన్ ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజా ఆరో స్థానంలో ఆడనున్నాడు. ఏడో స్థానం కోసం కొంత పోటీ నెలకొంది. ఇటీవల న్యూజిలాండ్- ఎ పై వరుసగా సెంచరీ, హాఫ్ సెంచరీ సాధించిన ధ్రువ్ జురెల్‌కు ప్రాధాన్యత లభించే అవకాశం ఎక్కువగా ఉంది. రెండో స్పిన్నర్‌గా వాషింగ్టన్ సుందర్ అందుబాటులో ఉన్నప్పటికీ, నలుగురు పేసర్లతో ఆడాల్సి రావడం వల్ల జురెల్‌కే జై కొట్టొచ్చు. ఇక్కడి పిచ్ స్వభావానికి తగ్గట్లుగా పేస్ విభాగాన్ని బలోపేతం చేసింది మేనేజ్మెంట్.

పసిడి ధరలు పాతాళానికి- మరో మహా పతనం: 14 నెలల కనిష్టానికి
పసిడి ధరలు పాతాళానికి- మరో మహా పతనం: 14 నెలల కనిష్టానికి

జస్ ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ప్రధాన పేసర్లుగా కొత్త బౌలింగ్ అటాక్ ప్రారంభిస్తారు. ఇటీవల ముగిసిన వన్డే సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గెలుచుకున్న గుర్నూర్ బ్రార్ టెస్టుల్లో అరంగేట్రం చేసే అవకాశాలు లేకపోలేదు. నాలుగో పేసర్‌గా ఆకాశ్ దీప్ ఎంపికయ్యే అవకాశం ఉంది. ప్రసిద్ధ్ కృష్ణ, అన్షుల్ కాంబోజ్ రూపంలో ఫాస్ట్ బౌలింగ్ ప్రత్యామ్నాయాలు ఉన్నప్పటికీ, ప్రస్తుత ఫామ్ ఆధారంగా గుర్నూర్‌కే తొలి ప్రాధాన్యం లభించవచ్చు.

ఈ టౌన్ లో 65 రోజుల పాటు చీకటి రాత్రులు: చిట్టచివరి సూర్యాస్తమయం
ఈ టౌన్ లో 65 రోజుల పాటు చీకటి రాత్రులు: చిట్టచివరి సూర్యాస్తమయం

మ్యాచ్ సాగుతున్న కొద్దీ పిచ్ ఫ్లాట్‌గా మారినా, నిలకడగా వికెట్లు పడగొట్టే సామర్థ్యం ఉన్న బౌలర్లకే ప్రాధాన్యం ఇస్తామని గిల్ ఇదివరకే స్పష్టం చేశాడు. ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్‌లో భారత్‌కు ఇంకా ఏడు టెస్టు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోవడానికి ఈ రెండు మ్యాచ్ లనూ నెగ్గడం అవసరం. న్యూజిలాండ్‌ను సొంత గడ్డపై ఢీకొట్టడం సవాల్ తో కూడుకున్నదే అయినప్పటికీ, సరైన బౌలింగ్ కాంబినేషన్‌తో మ్యాచ్‌పై ఆధిపత్యం చెలాయించాలని పట్టుదలతో ఉంది.. టీమిండియా.

టీమిండియా తుదిజట్టులో.. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, శుభ్‌మన్ గిల్ (కేప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్/వాషింగ్టన్ సుందర్, ఆకాష్ దీప్, గుర్నూర్ బ్రార్, మహ్మద్ సిరాజ్, జస్ ప్రీత్ బుమ్రాకు అవకాశం లభించవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+