ఫేక్ షీ టీమ్ నోటీసుతో ప్రియుడ్ని భయపెట్టాలని చూసిన యువతి.. చివరికి.. ఏమైందంటే..?
ఏడాది క్రితం బ్రేకప్ చెప్పిన ప్రియుడికి ఆ యువతి షాక్ ఇవ్వాలని ప్లాన్ వేసింది. ప్రియుడ్ని భయపెట్టాలని చూసింది. కానీ పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్ అయి తనకే బిగ్ షాక్ తగిలింది. ఆ యువతితోపాటు ఆమెకు సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్ పరిధిలోని కూకట్ పల్లిలో జరిగింది. సైఫాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్ పల్లి హౌజింగ్ బోర్డులోని బాలాజీ నగర్ లో తిరువేశ్వర్ వీరంకి అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. అతడు మహీంద్రా యూనివర్సిటీలో చదువుతున్నాడు. అయితే అదే యూనివర్సిటీకు చెందిన కొల్లూరి హస్విత తేజతో గత ఐదేళ్లుగా ప్రేమాయణం సాగిస్తున్నాడు.
అయితే పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. ఏడాదిగా తనకు దూరంగా ఉండటంతో పాటు సోషల్ మీడియాలో కూడా బ్లాక్ చేశాడని తేలింది. దాంతో తన ప్రియుడిని భయపెట్టాలని.. బెదిరించాలని ప్లాన్ వేసింది హస్విత తేజ. ఈ క్రమంలోనే ఏఐ టూల్ సాయంతో ఓ ఫేక్ షీ టీమ్ కంప్లైంట్ ను సృష్టించింది. తన స్నేహితుడైన హరి సాయంతో తిరువేశ్వర్ కు వాట్సప్ మెసేజ్ పంపించింది. అయితే నిజంగానే షీటీమ్ నుంచి మెసేజ్ వచ్చిందని గ్రహించిన తిరువేశ్వర్ విచారణకు హాజరు అయ్యారు. అయితే షీ టీమ్స్ అధికారులు దాన్ని నకిలీ అని తేల్చారు.

ఈ నేపథ్యంలో తిరువేశ్వర్ వెంటనే సైఫాబాద్ స్టేషన్ లో ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక ఈ వ్యవహారంలో యువతితో పాటు నోటీసు పంపించేందుకు సహకరించిన ఆమె స్నేహితుడి మీద పోలీసులు సైబర్ క్రైం, చీటింగ్, ఫోర్జరీ కేసులను నమోదు చేశారు. మరోవైపు ఇలాంటి నోటీసుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచనలు చేశారు.












Click it and Unblock the Notifications
