'వారణాసి' తర్వాత మహేష్ సినిమాపై క్లారిటీ వచ్చేసింది.. ఆ డైరెక్టర్ తోనే..!
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో వారణాసి అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ఇటీవల పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వారణాసి మూవీ 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా భారతీయ భాషలతో పాటు, పలు విదేశీ భాషల్లోనూ రిలీజ్ కానుంది. ఇక ఈ మూవీలో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నటిస్తోంది.
అలాగే మలయాళం స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నెగిటివ్ రోల్ కుంభ పాత్రలో కనిపించనున్నారు. ఇక ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి స్వరాలను సమకూరుస్తున్నారు. అలాగే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ స్టోరీని అందిస్తున్నారు. అటు రాజమౌళి సతీమణి రమా రాజమౌళి కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ మూవీని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై సీనియర్ నిర్మాత కే ఎల్ నారాయణ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.
అయితే మహేష్ ఫ్యాన్స్ కు ఇప్పుడు ఒక్కటే ప్రశ్న వెంటాడుతోంది. వారణాసి తర్వాత మహేష్ ఏ సినిమా చేస్తారు..? దర్శకుడు ఎవరు..? అని.. అయితే ఇప్పటికే చాలా మంది దర్శకులు లిస్టులోకి వచ్చారు. మరోవైపు వారణాసి మూవీతో గ్లోబల్ ఆడియన్స్ ను టార్గెట్ చేసిన మహేష్ బాబు ఆ తర్వాత కూడా అదే స్థాయిలో మూవీ ఉంటేనే బెటర్ అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇక మహేష్ తో సినిమా చేయబోయే దర్శకుల్లో ఫస్ట్ వినిపిస్తున్న పేరు సందీప్ రెడ్డి వంగా.. ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది దీపావళి కానుకగా అక్టోబర్ 29 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అయితే ప్రభాస్ తో మూవీ తర్వాత మహేష్ తో సినిమా తీస్తారని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.












Click it and Unblock the Notifications
