సినిమా చూసిన వాళ్లంతా ఫిదా.. రేటింగ్స్ చూస్తే మైండ్ బ్లాకే!

ఓటీటీ వేదికపై వినూత్న కథాంశాలతో తెరకెక్కిన సినిమాలకు ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడుతుంటారు. తాజాగా ఇదే కోవలో 'హ్యాపీ జర్నీ' సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్‌లో నిలిచి సంచలనం సృష్టిస్తోంది. 'కొన్ని ప్రయాణాలు ప్రణాళికలను మారుస్తాయి.. మరికొన్ని జీవితాలనే మార్చేస్తాయి' (Some trips change plans... Some change lives) అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ఈ చిత్రం, డిజిటల్ ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది.

చిన్న బడ్జెట్, బలమైన కంటెంట్.. ట్రైలర్‌లోనే ఇన్ని ట్విస్టులా?
చిన్న బడ్జెట్, బలమైన కంటెంట్.. ట్రైలర్‌లోనే ఇన్ని ట్విస్టులా?

కేవలం వ్యూస్ పరంగానే కాకుండా, రేటింగ్స్ విషయంలోనూ 'హ్యాపీ జర్నీ' తన సత్తా చాటుతోంది. ప్రముఖ రేటింగ్ ప్లాట్‌ఫామ్ ఐఎండీబీ (IMDb)లో ఈ సినిమా ఏకంగా 9.7/10 రేటింగ్ సాధించి ఔరా అనిపించింది. మరోవైపు బుక్ మై షో (BookMyShow)లోనూ 9.5/10 రేటింగ్‌తో ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది. ఆద్యంతం ఆకట్టుకునే కథనం, సహజమైన నటన ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి.

Happy Journey Movie Trending on Amazon Prime Video With Record 9 7 IMDb Rating Full Details
బాక్సాఫీస్ సునామీ.. టికెట్ ముక్క లేదు.. వామ్మో ఇన్ని కోట్లా..!
బాక్సాఫీస్ సునామీ.. టికెట్ ముక్క లేదు.. వామ్మో ఇన్ని కోట్లా..!

గుట్ట ప్రొడక్షన్స్, కమలాకర్ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్లపై బాలాజీ గుట్ట, కౌశిక్ రెడ్డి, అభిరామ్ నాయుడు ఈ సినిమాను నిర్మించారు. తరుణ్ రెడ్డి, శైలేంద్ర కుమార్, రాజేష్ వ్రజ్‌లాల్ వసాని, సలోని జయ్ వసాని, అవిషా గోస్వామి తదితరులు కీలక పాత్రల్లో మెరిశారు. సాంకేతిక నిపుణుల పనితీరు కూడా ఈ చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించింది. శేఖర్ చంద్ర సంగీతం, మణికందన్ సుబ్రమణియన్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్షన్ చిత్రానికి మరింత వన్నె తెచ్చాయి. అనిల్ అండ్ భాను, వంశీ శేఖర్ ఈ చిత్రానికి పబ్లిసిటీ బాధ్యతలు నిర్వర్తించగా, జీ మ్యూజిక్ కంపెనీ ద్వారా పాటలు విడుదలయ్యాయి. కుటుంబ సమేతంగా చూడదగ్గ ఒక మంచి ఫీల్-గుడ్ ఎంటర్‌టైనర్‌గా 'హ్యాపీ జర్నీ' ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో సందడి చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+