చిన్న బడ్జెట్, బలమైన కంటెంట్.. ట్రైలర్‌లోనే ఇన్ని ట్విస్టులా?

కొత్త తరహా కథాంశంతో వాస్తవికతకు అద్దం పట్టేలా తెరకెక్కిన లేడీ ఓరియెంటెడ్ మూవీ 'వ్యూ'. 'ది పాయింట్ ఆఫ్ వ్యూ' అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో రూపొందిన ఈ సినిమాలో పూజా రెడ్డి ప్రధాన పాత్రలో నటించగా.. ప్రదీప్ సోనియా ఇతర కీలక పాత్రల్లో మెరిశారు. మాస్టర్ కార్తికేయ సమర్పణలో పరవాణి చలనచిత్ర, ప్రచుర కంటెంట్ అగ్రిగేటర్స్ బ్యానర్స్‌పై సత్య చౌదరి ఈ సినిమాను నిర్మించారు. మహేశ్ కాంపెల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా, శ్రీలక్ష్మీ పిక్చర్స్ అధినేత బాపిరాజు ద్వారా ఈ నెల 20న గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో సినిమా ప్రీ-రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు.

బాక్సాఫీస్ సునామీ.. టికెట్ ముక్క లేదు.. వామ్మో ఇన్ని కోట్లా..!
బాక్సాఫీస్ సునామీ.. టికెట్ ముక్క లేదు.. వామ్మో ఇన్ని కోట్లా..!

మన ఇంట్లో, పొరుగింట్లో జరిగినట్లుగా ఉంటుంది: డైరెక్టర్ మహేశ్ కాంపెల్లి
ఈ సందర్భంగా డైరెక్టర్ మహేశ్ కాంపెల్లి మాట్లాడుతూ.. సినిమా వెనుక ఉన్న ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. ఈ స్టోరీని నిర్మాత సత్య చౌదరికి వినిపించగానే ఆయనకు బాగా నచ్చి తన దగ్గరున్న బడ్జెట్ గురించి చెప్పారని.. ఆ బడ్జెట్ సరిపోతుందని ధైర్యంగా సినిమా మొదలుపెట్టామన్నారు. గతంలో ఎవరి దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేయలేదని.. కేవలం సినిమాపై ఉన్న ప్యాషన్‌తోనే అత్యుత్తమ సాంకేతిక నిపుణులను ఎంచుకుని ఈ సినిమాను తెరకెక్కించినట్లు చెప్పారు. ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ తమ వ్యూ ఉంటుందని.. ఈ స్టోరీని తన పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పినట్లు తెలిపారు. ఈ సినిమాను చూస్తే మన ఇంట్లో లేదా పొరుగింట్లో జరిగిన సంఘటనలను చూసినట్లే అనిపిస్తుందన్నారు.

View Movie Pre-Release Event Actress Pooja Reddy Lady-Oriented Film Releases on November 20 Details

ఒక టికెట్ కొన్నవారు వందమందితో కొనిపిస్తారు: డిస్ట్రిబ్యూటర్ బాపిరాజు
సినిమా డిస్ట్రిబ్యూటర్ బాపిరాజు మాట్లాడుతూ సినిమా బృందంపై ప్రశంసల వర్షం కురింపించారు. "ఈ ఏడాది తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంతో కలిసొచ్చింది. కంటెంట్ ఉన్న సినిమాలను, డబ్బింగ్ సినిమాలను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. వ్యూ సినిమాలో బలమైన కంటెంట్ ఉన్నందునే తాము ఈ సినిమాను విడుదల చేస్తున్నామన్నారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి మరో వందమందికి సినిమా బాగుందని చెబుతారు. అంటే ఓ టికెట్ కొన్న ప్రేక్షకుడు వందమందితో టికెట్లు కొనిపించే స్థాయిలో సినిమా ఉంటుందన్నారు. డైరెక్టర్ మహేశ్‌లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, దర్శకరత్న దాసరి నారాయణరావు మేకింగ్ శైలి కనిపిస్తోందన్నారు. త్వరలోనే ఆయనతో కలిసి ఓ సినిమా చేయాలనుకుంటున్నామని ఆయన వెల్లడించారు.

కళామతల్లి ఆదరణకు కృతజ్ఞతగా ఈ సినిమా చేశా: నిర్మాత సత్య చౌదరి
నిర్మాత సత్య చౌదరి మాట్లాడుతూ.. "నేను ఈ రోజు నిర్మాతగా మీ ముందు ఉన్నానంటే కారణం మా డైరెక్టర్ మహేశ్. ప్రతి క్రాఫ్ట్ ను ఆయనే దగ్గరుండి చూసుకుంటా మంచి సినిమా చేశాడు. మా బాపిరాజు సినిమాను రిలీజ్ చేసేందుకు రావడం సంతోషంగా ఉంది. శ్రీ లక్ష్మీ పిక్చర్స్, ప్రచుర కంటెంట్ అగ్రిగేటర్స్ బ్యానర్స్ నాకు సపోర్ట్ గా నిలిచాయి. నన్ను ఆదరించింది కళామతల్లి. ఆ తల్లి ఆదరణకు కృతజ్ఞతగా ఒక మంచి ఫీమేల్ ఒరియెంటెడ్ మూవీ చేశాను. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా. మీ ఫ్యామిలీతో కలిసి మా సినిమాను చూడండి" అని అన్నారు.

రూ. 2 కోట్లతో తీస్తే.. రూ. 155 కోట్లు వచ్చాయి.. సడెన్ గా ఓటీటీలోకి లేటెస్ట్ బ్లాక్ బస్టర్..!
రూ. 2 కోట్లతో తీస్తే.. రూ. 155 కోట్లు వచ్చాయి.. సడెన్ గా ఓటీటీలోకి లేటెస్ట్ బ్లాక్ బస్టర్..!

కెరీర్ ప్రారంభంలోనే ఇలాంటి పాత్ర దక్కడం నా అదృష్టం: హీరోయిన్ పూజా రెడ్డి
హీరోయిన్ పూజా రెడ్డి తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. "ఇలాంటి బలమైన లేడీ ఓరియెంటెడ్ పాత్రలో నటించే అవకాశం నా కెరీర్ ప్రారంభంలోనే దక్కడం నా అదృష్టం. నాపై నమ్మకంతో ఈ అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు. ట్రైలర్‌లో మీరు ఎంత ఎనర్జీని చూశారో, సినిమా ఆద్యంతం అంతే ఉత్కంఠభరితంగా సాగుతుంది. సక్సెస్ మీట్‌లో మరిన్ని విశేషాలు పంచుకుంటాను" అని ధీమా వ్యక్తం చేశారు.

ఆద్యంతం ఆకట్టుకునే కంటెంట్: నటీనటులు ప్రదీప్, సోనియా
నటుడు ప్రదీప్ మాట్లాడుతూ.. "ఇది నా మొదటి సినిమా. నటనలో దర్శకుడు మహేశ్ పూర్తి స్వేచ్ఛనిచ్చారు. కొత్త తరహా కంటెంట్‌తో ప్రేక్షకులను కట్టిపడేసే చిత్రమిది" అన్నారు. నటి సోనియా మాట్లాడుతూ.. "ఎన్నో ఆడిషన్స్ తర్వాత ఒక మంచి పాత్ర కోసం ఎదురుచూస్తున్న తరుణంలో 'వ్యూ' అవకాశం వచ్చింది. నన్ను ప్రోత్సహించిన నా తల్లిదండ్రులకు, అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు" అని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+