ఓటీటీని అల్లాడిస్తున్న మైండ్ బ్లోయింగ్ మాస్టర్ పీస్ థ్రిల్లర్! డోంట్ మిస్
మలయాళ చిత్రసీమ నుంచి వచ్చే సస్పెన్స్ థ్రిల్లర్‌లకు ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా, కేవలం బలమైన కథాబలంతో ప్రేక్షకులను సీట్ల అంచున కూర్చోబెట్టే చిత్రాల్లో 'ఇరట్టా' ఎప్పుడూ ముందుంటుంది. ప్రముఖ నటుడు జోజు జార్జ్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సైకలాజికల్ పోలీస్ థ్రిల్లర్, ఓటీటీలో రిలీజైనప్పట్నుంచి సినీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
కవలల చుట్టూ తిరిగే కథ
రోహిత్ ఎంజీ కృష్ణన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వినోద్, ప్రమోద్ అనే ఇద్దరు కవలల చుట్టూ కథ తిరుగుతుంది. వినోద్ ఒక పోలీస్ స్టేషన్‌లో ఏఎస్‌ఐగా పనిచేస్తుంటే, అతని కవల సోదరుడు ప్రమోద్ డీవైఎస్‌పీగా బాధ్యతలు నిర్వర్తిస్తుంటారు. అయితే, ఒకరోజు వాగమండ్ పోలీస్ స్టేషన్‌లో ఎవరికీ అంతుచిక్కని రీతిలో వినోద్ అనుమానాస్పద స్థితిలో హత్యకు గురవుతాడు. పోలీస్ స్టేషన్ లోపలే జరిగిన ఈ హత్య ఎవరు చేశారు? దీని వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? అనే కోణంలో దర్యాప్తు మొదలవుతుంది. మృతుడి సోదరుడైన ప్రమోదే స్వయంగా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ బాధ్యతలు చేపట్టినప్పుడు అనేక షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తాయి.

అన్నదమ్ముల పాత్రల్లో సూపర్.. జోజు జార్జ్
ఈ చిత్రంలో జోజు జార్జ్ తన అద్భుతమైన నటనతో ఇద్దరు అన్నదమ్ముల పాత్రల్లో వేరియేషన్స్ చూపిస్తూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ఒకరిపై ఒకరికి ఉండే ఈగో, చిన్ననాటి చేదు జ్ఞాపకాలు, వారి కుటుంబ నేపథ్యాన్ని దర్శకుడు అత్యంత సహజంగా తెరకెక్కించారు. సినిమా ప్రయాణమంతా ఒక సాధారణ ఇన్వెస్టిగేషన్ డ్రామా లాగా సాగినప్పటికీ, చివరి 10 నిమిషాల్లో వచ్చే క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం ప్రేక్షకులకు మైండ్ బ్లాంక్ చేసేలా ఉంటుంది.
ఊహించని మలుపులతో ముగిసే ఈ ముగింపు ప్రేక్షకులను తీవ్రంగా ఆలోచింపజేస్తుంది. సస్పెన్స్ థ్రిల్లర్‌లను ఇష్టపడే ప్రతి ఒక్కరూ కచ్చితంగా చూడాల్సిన ఈ సినిమా, ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంతో పాటు తెలుగులోనూ అందుబాటులో ఉన్న ఈ థ్రిల్లర్ మూవీ వీకెండ్‌లో చూసేందుకు అద్భుతమైన ఆప్షన్.














Click it and Unblock the Notifications
