'ఆమె మళ్లీ మోసం చేస్తుంది, వదిలేయ్': జేమ్స్ బాండ్ హీరోకు డొనాల్డ్ ట్రంప్ 11 ట్వీట్ల వార్నింగ్!
హాలీవుడ్ స్టార్ హీరో రాబర్ట్ ప్యాటిన్సన్ కొత్త జేమ్స్‌బాండ్‌గా ఎంపికైన నేపథ్యంలో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆయన పేరు మారుమోగిపోతోంది. ఈ క్రమంలోనే 2012లో ఆయన వ్యక్తిగత జీవితంలో చోటుచేసుకున్న సంచలనం బ్రేకప్ వ్యవహారం, అందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసుకున్న ఆసక్తికర జోక్యం ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ ట్రెండ్ అవుతోంది. నాడు 'ట్విలైట్'హీరోయిన్ క్రిస్టెన్ స్టీవర్ట్ చేసిన మోసం గురించి డొనాల్డ్ ట్రంప్ ఏకంగా 11 ట్వీట్లు చేస్తూ రాబర్ట్ ప్యాటిన్సన్‌కు బహిరంగంగా హెచ్చరికలు జారీ చేశారు.
అసలేం జరిగింది? క్రిస్టెన్ స్టీవర్ట్ మోసం ఏమిటి?
'ట్విలైట్' సినిమా సిరీస్ సమయంలో ఎడ్వర్డ్ కల్లెన్, బెల్లా స్వాన్‌లుగా నటించిన రాబర్ట్ ప్యాటిన్సన్,క్రిస్టెన్ స్టీవర్ట్ నిజ జీవితంలోనూ ప్రేమలో పడ్డారు. హాలీవుడ్ లో అత్యంత క్రేజ్ ఉన్న జంటగా వీరికి పేరుండేది. అయితే 2012 జులైలో వీరి లవ్ స్టోరీకి ఊహించని షాక్ తగిలింది. 'స్నో వైట్ అండ్ ది హంట్స్‌మన్' సినిమా దర్శకుడు రూపెర్ట్ శాండర్స్‌తో క్రిస్టెన్ స్టీవర్ట్ అత్యంత సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి. అప్పటికే రూపెర్ట్ శాండర్స్‌కు పెళ్లయి పిల్లలు ఉండటం, క్రిస్టెన్ ప్యాటిన్సన్‌తో రిలేషన్లో ఉండటంతో ఈ వ్యవహారం హాలీవుడ్‌లో పెనుదుమారం రేపింది. ఆ తర్వాత క్రిస్టెన్ బహిరంగంగా ప్యాటిన్సన్‌కు క్షమాపణలు చెప్పింది. కొంతకాలం దూరంగా ఉన్న ఈ జంట మళ్లీ కలిసినప్పటికీ.. 2013లో పూర్తిగా విడిపోయింది.

5 రోజుల్లో 11 ట్వీట్లు.. ట్రంప్ ఎందుకు స్పందించారు?
2012 అక్టోబర్ నాటికి డొనాల్డ్ ట్రంప్ ఇంకా పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రాలేదు. ఓ ప్రముఖ వ్యాపారవేత్తగా, రియాలిటీ టీవీ స్టార్ గా సోషల్ మీడియాలో చురుగ్గా ఉండేవారు. ఈ క్రమంలో రాబర్ట్-క్రిస్టెన్ వివాదంపై ట్రంప్ ఎక్కుగా ఇంట్రెస్ట్ చూపిస్తూ వరుస ట్వీట్లు చేశారు.
అక్టోబర్ 17, 2012: "రాబర్ట్ ప్యాటిన్సన్ ఎట్టిపరిస్థితుల్లోనూ క్రిస్టెన్ స్టీవర్ట్ ను మళ్లీ దగ్గరకు చేర్చుకోవద్దు. ఆమె కుక్కలా మోసం చేసింది, మళ్లీ అలాగే చేస్తుంది. రాబర్ట్ కు ఆమె కంటే ఎంతో మంచి అమ్మాయి దొరుకుతుంది" అని ట్రంప్ తొలి ట్వీట్ చేశారు.
అక్టోబర్ 18, 2012: మరుసటి రోజే స్పందిస్తూ.. "క్రిస్టెన్ మళ్లీ మోసం చేస్తుందని నాకు 100 శాతం నమ్మకం ఉంది. అసలే నేనేప్పుడైన తప్పుగా చెప్పానా?" అంటూ ప్రశ్నించారు.
అక్టోబర్ 19,22: వీరి బంధం ఎప్పటికీ విరిగిపోయిందని, రాబర్ట్ వెంటనే ఆమెను వదిలేయాలని, కొన్నేళ్ల తర్వాత తన సలహాకు రాబర్ట్ కచ్చితంగా కృతజ్ఞతలు చెబుతాడని ట్రంప్ పేర్కొన్నారు. అంతే కాకుండా తన మినివర్స్ పోటీలకు రావాలని కూడా ఆహ్వానించారు. ఇలా అక్టోబర్-నవంబర్ మధ్యకాలంలో ఏకంగా 11 ట్వీట్లు చేసి వార్తల్లో నిలిచారు.
ట్రంప్ నా బాయ్‌ఫ్రెండ్ ప్రేమలో పడ్డారేమో: క్రిస్టెన్ కౌంటర్
2017 జనవరిలో ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత కూడా ఈ ట్వీట్ల ప్రస్తావని వచ్చింది. ఓ ఇంటర్వ్యూలో క్రిస్టెన్ మాట్లాడుతూ.. నాడు ట్రంప్ తనపై చూపిన విపరీతమైన ఆసక్తి అర్థం కాలేదన్నారు. ఆ తర్వాత 'సాటర్డే నైట్ లైవ్' షోలో ఆమె సరదాగా స్పందిస్తూ.. "అధ్యక్షుడు నా గురించి ఏకంగా 11 సార్లు ట్వీట్ చేశారు. దీన్ని బట్టి ఆయన నన్ను ద్వేషించడం లేదని, నా బాయ్‌ఫ్రెండ్(రాబర్ట్) తో ప్రేమలో పడ్డారని అనిపిస్తోంది" అంటూ చమత్కరించారు.













Click it and Unblock the Notifications
