నువ్వేం ముఖ్యమంత్రివి.. నీదేం భాష - రేవంత్ పై కోమటిరెడ్డి సంచలనం..!!
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. సీఎం రేవంత్ లక్ష్యం గా విరుచుకుపడ్డారు. నిధుల విషయంలో అల్టిమేటం ఇచ్చారు. ప్రభుత్వం ఉన్నది పేదల కోసం అని.. కాంట్రాక్టర్ల కోసం కాదని వ్యాఖ్యానించారు. పెన్షన్లను వెంటనే ₹5,000 వరకు పెంచాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రికి అదృష్టం కలిసి వచ్చిందని.. మిగిలిన రెండేళ్ల కాలం అందరినీ సమానంగా చూస్తూ తండ్రి పాత్ర పోషించాలంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
సీఎం రేవంత్ రెడ్డి పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. రేవంత్ పాలనలో ఎవరూ సంతోషంగా లేరని ఫైర్ అయ్యారు. కాలం కలిసి వచ్చి రేవంత్ ముఖ్యమంత్రి అయ్యారని వ్యాఖ్యానించారు. ఆంధ్ర కనుసన్నల్లోనే రేవంత్ పాలన సాగుతుందని తీవ్ర వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ అంటే కొడంగల్, మధిర, హుజూర్ నగర్ మాత్రమేనా అని ప్రశ్నించారు. తన నియోజక వర్గానికి నిధులు ఇవ్వకుంటే కురుక్షేత్రం తప్పదని హెచ్చరించారు. ఫ్యూచర్ సిటీ ఎందుకని.. ఉన్న సిటీకే గతి లేదంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని.. నువ్వేం ముఖ్యమంత్రివి.. నీదేం భాష.. పండబెట్టి తొక్కుతా అనటం ఏంటని రాజగోపాల్ రెడ్డి నిలదీసారు. పదవుల కోసం తాను ఎవరి ఇంటి చుట్టూ తిరగనని... తనకు పదవి రావాల్సి ఉంటే అదే వస్తుందని వ్యాఖ్యానించారు.

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలతో
ఉన్న సిటీకే గతి లేదు.. ఫ్యూచర్ సిటీ ఎందుకంటూ నిలదీసారు. మునుగోడు నిధులు ఆపితే మరో చరిత్ర సృష్టిస్తానని హెచ్చరించారు. అర్హులైన వారందరికీ ఫించన్లు అందాలన్నారు. వచ్చిన వారి లో పది శాతం అనర్హులు ఉన్నారని చెప్పారు. రైతు బంధు నిజమైన వ్యవసాయం చేసే రైతులకు ఇవ్వాలని సూచించారు. హైదరాబాద్ లో ఉండి ఉద్యోగం చేసుకునే వారికే ఇస్తున్నారని.. కౌలు రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు. ప్రభుత్వం పై విమర్శలు చేయటానికి ప్రతిపక్షంలో ఉండాల్సిన అవసరం లేదన్నారు. గత ప్రభుత్వం కాంట్రాక్టర్ల కోసం లక్షల కోట్లు అప్పులు చేసి అవినీతికి పాల్పడిందని.. అవి మొత్తం రికవరీ చేయాలని డిమాండ్ చేసారు. నాడు వైఎస్సార్ మాట తప్పం.. మడమ తిప్పమని పాలన ఏంటో చూపించారన్నారు. తమకు నిధులు ఇవ్వాలని.. రాహుల్ ప్రధాని కావాలనేది తమ ఆకాంక్షగా రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.













Click it and Unblock the Notifications
