సోనియా ఆత్మకథలో తెలంగాణ ప్రస్తావన లేకపోవటం వెనుక..!!
సోనియా గాంధీ ఆత్మకధ ఇప్పుడు సంచలనంగా మారింది. జాతీయ రాజకీయాలతో పాటుగా పలు వురు ప్రముఖుల ప్రస్తావన ఆసక్తి కర రాజకీయ చర్చకు కారణమైంది. ఇందిరాగాంధీ నుంచి తన కుటుంబం.. రాజీవ్ ప్రస్థానం.. మన్మోహన్ ప్రధాని.. పాలనా పరమైన వ్యవహారాలు.. ప్రధాని మోదీ గురించి సోనియా తన ఆత్మకధలో కీలక అంశాలను ప్రస్తావించారు. అయితే, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రత్యేకించి తెలంగాణ గురించి ప్రస్తావన చేయకపోవటం ఆసక్తిగా మారింది. ఇదే అంశం పైన బీఆర్ఎస్ నేతలుకు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు.
సోనియా ఆత్మకధలో తెలంగాణ ప్రస్తావన చేయకపోవటం పైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ అని చెప్పుకొనే కాంగ్రెస్ నేతలు.. ఆమె ఆత్మకథలో తెలంగాణ ప్రస్తావన ఎందుకు లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు. తెలంగాణ ఉద్యమ ఉప్పెనలో కొట్టుకుపోతామన్న భయంతోనే కాంగ్రెస్ పార్టీ అనివార్యంగా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చిందే కానీ.. సోనియాగాంధీ గుండెల్లో తెలంగాణ ఉందని చెప్పడం విడ్డూరమని వ్యాఖ్యానించారు. అదే విధంగా మాజీ ప్రధాని పీవీ నర సింహారావుపై కాంగ్రెస్ నేతలకు అంత ప్రేమ ఉంటే ఆయన అంత్యక్రియలను ఢిల్లీలో ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. గతంలో రాహుల్ గాంధీని ముద్దపప్పు అని విమర్శించింది తాము కాదని, రేవంత్ రెడ్డేనని, సోనియాను బలిదేవత అని కూడా అన్నారని చెప్పుకొచ్చారు.

కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్ ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు చేసారు. ఎన్నికలకు ముందు అభయహస్తం.. ఎన్నికల తర్వాత రిక్తహస్తం అన్నట్లుగా కాంగ్రెస్ మూడేళ్ల పాలన ఉందన్నారు. మూడేళ్ల తెలంగాణ నాట్ రైజింగ్.. తెలంగాణ ఫాలింగ్ అని కేటీఆర్ విశ్లేషించారు. కాంగ్రెస్ పాలనలో మూడేళ్ల కాలంలో రూ.లక్షల కోట్ల పెట్టుబడులను తెచ్చామని చెబుతున్న ప్రభుత్వం.. ఎన్ని పెట్టుబడులు వాస్తవ రూపం దాల్చాయి, ఎన్ని పరిశ్రమలు, ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయనే అంశాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గాంధీ కుటుంబానికి రేవంత్ రెడ్డి బాడీగార్డ్‌గా మారారని, ఇది తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని కేటీఆర్ వ్యాఖ్యానించారు. బీజేపీలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోందని విమర్శించారు. తనకంటే ఐదేళ్లు చిన్నవాడైన కేంద్ర మంత్రి అమిత్ షా కాళ్లకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు మొక్కడం ఏమిటని, ఆయన చెప్పులు మోయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని కేటీఆర్ నిలదీసారు.












Click it and Unblock the Notifications
