దిశ మార్చుకున్న అక్వాన్ తుఫాన్, ఈ జిల్లాలో భారీ వర్షాలు- మూడు రోజులు బిగ్ అలర్ట్..!!
బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తీవ్ర తుపాన్ క్రమంగా ముందుకు కదులుతోంది. గడిచిన ఆరు గంటల్లో గంటకు 8 కిలోమీటర్ల వేగంతో పయనిస్తున్న ఈ తుపాన్ ప్రస్తుతం నరసాపురానికి 540 కిలోమీటర్లు, చెన్నైకి 570 కిలోమీటర్లు, కళింగపట్నానికి 600 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. అలాగే గోపాల్‌పూర్‌కు 690 కిలోమీటర్లు, పూరీకి 770 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తుఫాను ప్రభావం తెలంగాణ పైన ఉంటుందని తాజాగా అప్రమత్తం చేసింది.
బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం 'అక్వాన్' తుపానుగా బలపడుతుండటం తో తెలంగాణపైనా దీని ప్రభావం గట్టిగా పడనుంది. ఇప్పటికే చలి తీవ్రతతో వణుకుతున్న రాష్ట్ర ప్రజలకు, ఈ తుపాను రూపంలో మరో అకాల వాతావరణ మార్పు ఎదురుకానుంది. ఉత్తర వాయ వ్య దిశగా కదులుతున్న ఈ తుపాను ఈ నెల 20వ తేదీన ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటే సమయం లో గంటకు 120 నుంచి 145 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచే అవకాశం ఉందని, దీని ప్రభావంతో నవంబర్ 20 నుంచి 22 వరకు మూడు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. 21, 22 తేదీల్లో హైదరాబాద్ నగరంతో పాటు పరిసర జిల్లాల్లోనూ వాతావరణం పూర్తిగా మారిపోనుంది.

వాతావరణ శాఖ తాజా హెచ్చరికలు
ప్రధానంగా తూర్పు తెలంగాణ జిల్లాలైన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ జిల్లాలపై వర్ష ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ఆయా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురు గాలులతో కూడిన వానలు పడే సూచనలు ఉన్నందున ప్రజలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఏపీలో అర్నబ్ తరహాలోనే దీని ప్రభావం ఉండనుది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. ముందుగానే నష్టనివారణ చర్యలు తీసుకుంటుంది. దీని ప్రభావంతో ఏపీ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది.













Click it and Unblock the Notifications
