చైనా చేరుకున్న ట్రంప్.. ప్రపంచ భవితవ్యాన్ని మార్చబోయే మీటింగ్!

ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా షెన్‌జెన్ నగరమే హాట్ టాపిక్‌గా మారింది. ఫిలిప్పీన్స్ పర్యటనను విజయవంతంగా ముగించుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అత్యంత ప్రతిష్టాత్మకమైన త్రిసభ్య సమావేశంలో పాల్గొనేందుకు చైనాలోని షెన్‌జెన్‌కు చేరుకున్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఆయనకు ఘన స్వాగతం పిలికారు. ప్రపంచ దేశాల రాజకీయ భవితవ్యాన్ని మార్చగల ఈ మహా శిఖరాగ్ర సమావేశంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో పాటు, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒకే వేదికపైకి రానున్నారు. ముఖ్యంగా ఇరాన్ సంక్షోభం, ఉక్రెయిన్ యుద్ధం వంటి అత్యంత సున్నితమైన అంతర్జాతీయ అంశాలపై ఈ ముగ్గురు అగ్రనేతలు చర్చించనుండటం సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.

ఫిలిప్పీన్స్ డీల్‌పై ట్రంప్ హర్షం.. సోషల్ మీడియాలో పోస్ట్..

ఫిలిప్పీన్స్‌లో జరిగిన ఆసియాన్ సదస్సు, క్వాడ్ నేతల సమావేశం ముగిసిన వెంటనే డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. "మేము వాణిజ్యం, జాతీయ భద్రత వంటి అంశాలపై అద్భుతమైన చర్చలు జరిపాము. ఫిలిప్పీన్స్‌తో ఒక సరికొత్త, అద్భుతమైన వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని ప్రకటించడానికి సంతోషిస్తున్నాను. ముఖ్యంగా మా దేశ రైతులు, ఇంధన వ్యాపారులకు ఈ డీల్ ఎంతో మేలు చేస్తుంది" అని ట్రంప్ పేర్కొన్నారు. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు మార్కోస్ గొప్ప నాయకుడని కొనియాడిన ఆయన, అక్కడి పర్యటన ముగించుకుని నేరుగా చైనాకు బయలుదేరినట్లు తెలిపారు.

Philippine Trade Deal Secured As US President Donald Trump Departs For Shenzhen Trilateral Meet
ప్రపంచ రాజకీయాల్లో పెను సంచలనం.. ఒకే వేదికపైకి ట్రంప్, జిన్‌పింగ్, పుతిన్!
ప్రపంచ రాజకీయాల్లో పెను సంచలనం.. ఒకే వేదికపైకి ట్రంప్, జిన్‌పింగ్, పుతిన్!

షీ జిన్‌పింగ్, పుతిన్ ముఖాముఖి భేటీ.. అమెరికాకు సూటి సంకేతాలు..

మరోవైపు ఆసియా-పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ (APEC) వేదికగా చైనాలో సమావేశమైన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ పరస్పరం కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత గడ్డు రాజకీయ పరిస్థితుల మధ్య రష్యా, చైనాలు కలిసి మరింత సమర్థవంతమైన, న్యాయమైన బహుళ ధృవ ప్రపంచాన్ని (Multipolar World) ఆకారంలోకి తేవాలని పుతిన్ అభిప్రాయపడ్డారు. అమెరికా ఆధిపత్యానికి పరోక్షంగా చురకలంటిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రష్యా-చైనా విదేశాంగ సంబంధాలు ఎప్పుడూ స్థిరంగా, సానుకూల ధోరణితో ముందుకు సాగుతున్నాయని పుతిన్ స్పష్టం చేశారు.

మోదీకి ట్రంప్ బిగ్ కాంప్లిమెంట్.. ఆ ఒక్క మాటతో ఆకాశానికెత్తిన అమెరికా అధ్యక్షుడు!
మోదీకి ట్రంప్ బిగ్ కాంప్లిమెంట్.. ఆ ఒక్క మాటతో ఆకాశానికెత్తిన అమెరికా అధ్యక్షుడు!

అగ్రరాజ్యాల బాధ్యత అదేనన్న షీ జిన్‌పింగ్..

పుతిన్ వ్యాఖ్యలతో ఏకీభవించిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మాట్లాడుతూ.. ప్రస్తుత అస్థిర ప్రపంచంలో రెండు దేశాలు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. అంతర్జాతీయ సంబంధాల్లో ప్రజాస్వామ్యాన్ని, బహుళ ధృవ ప్రపంచాన్ని ముందుకు నడిపించాల్సిన పెద్ద మనుషుల బాధ్యత తమపై ఉందని ఆయన పేర్కొన్నారు. అల్లకల్లోలంగా మారిన ఈ ప్రపంచానికి రష్యా-చైనా మైత్రి మరింత స్థిరత్వాన్ని చేకూరుస్తోందని ప్రశంసించారు. సమానత్వం, పరస్పర గౌరవం, ప్రయోజనాలే ప్రాతిపదికగా సాగుతున్న ఈ ద్వైపాక్షిక సంబంధాలు ప్రపంచ దేశాలన్నింటికీ ఒక రోల్ మోడల్ అని జిన్‌పింగ్ అభివర్ణించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+