తనను బూతులు తిట్టిన వాడితోనే ట్రోఫీ గెలిచాడు!.. ధోనీ కెప్టెన్సీ వెనుక షాకింగ్ స్టోరీ!

భారత క్రికెట్ దిగ్గజం, సీఎస్కే మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోమా ఐపీఎల్‌‌కు వీడ్కోలు పలికిన నేపథ్యంలో ఆయన నాయకత్వ పటిమకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ స్టోరీలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. 2023 ఐపీఎల్ సీజన్లో చెన్నై జట్టులోని ఓ ఆటగాడు స్వయంగా కెప్టెన్ ధోనీనే దుర్భాషలాడినప్పటికీ..ధోనీ అతడిని జట్టు నుంచి తప్పించకుండా కొనసాగించి ట్రోఫీ గెలిచాడని మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా సంచలన విషయాన్ని వెల్లడించారు.

ఆ స్టార్ హీరోయిన్ల ప్రేమలో పడిన 'కెప్టెన్ కూల్'.. మహీ మనసు దోచుకున్న ఆ బ్యూటీలు ఎవరంటే?
ఆ స్టార్ హీరోయిన్ల ప్రేమలో పడిన 'కెప్టెన్ కూల్'.. మహీ మనసు దోచుకున్న ఆ బ్యూటీలు ఎవరంటే?

అసలేం జరిగింది? ఆకాశ్ చోప్రా ఏం చెప్పారంటే?
తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా ఆకాశ్ చోప్రా ఈ ఘటనను గుర్తుచేసుకున్నారు. 2023 ఐపీఎల్ సమయంలో సీఎస్కే జట్టుకు చెందిన ఓ ఆటగాడు కెప్టెన్ ధోనీతో అత్యంత దురుసుగా ప్రవర్తించడమే కాకుండా బూతులు కూడా తిట్టాడు. ఈ వ్యవహారం జట్టులో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ ఆటగాడిని తక్షణమే జట్టు నుంచి తప్పించి ఇంటికి పంపించాలని జట్టు చుట్టూ ఉన్న కొందరు ధోనీకి సలహా ఇచ్చారు. అతడు లేకపోయినా చెన్నై జట్టు బాగా ఆడగలదని వారు భావించారు. అయితే ధోనీ మాత్రం అందుకు ససేమిరా అన్నాడు.

CSK Player Abused MS Dhoni in IPL 2023 Still Won Trophy Aakash Chopra Big Revelation about Captain Cool

నా అహంకారం అడ్డురాకూడదు: ధోనీ గొప్పతనం
ఆటగాడి తప్పును పట్టించుకోకుండా జట్టు గెలుపునకే ధోనీ ప్రాధాన్యత ఇచ్చాడని ఆకాశ్ చోప్రా ప్రశంసించారు. ఆకాశ్ చోప్రా వెల్లడించిన వివరాల ప్రకారం ధోనీ ఇలా అన్నాడు. " అతడు మూర్ఖపు పని చేస్తున్నాడని నాకు తెలుసు. కానీ ఇక్కడ కెప్టెన్‌ను నేను. ఒకవేళ నా అహంకారాన్ని అడ్డుపెట్టుకుంటే తక్షణమే అతడి బ్యాగులు సర్దించి ఇంటికి పంపించేయగలను. కానీ అతడు నాకు, జట్టుకు ఎంతో ఉపయోగపడతాడు. చెన్నైని గెలిపించడంలో కీలక పాత్ర పోషిస్తాడు. కాబట్టి పర్వాలేదు నా అహంకారాన్ని పక్కన పెట్టి అతడిని ఆడిస్తాను' అని ధోనీ అన్నాడట.

IPLలో ధోనీ మ్యాజిక్: కెప్టెన్ కూల్ ఆ 5 రికార్డులు ఇప్పటికీ చెక్కుచెదరలేదు!
IPLలో ధోనీ మ్యాజిక్: కెప్టెన్ కూల్ ఆ 5 రికార్డులు ఇప్పటికీ చెక్కుచెదరలేదు!

ధోనీ నిర్ణయమే నిజమైంది!
ఆ ఆటగాడి పేరును గానీ, అతడు ఎందుకు అలా ప్రవర్తించాడన్న విషయాన్ని గానీ ఆకాశ్ చోప్రా బహిర్గతం చేయలేదు. అయితే వ్యక్తిగత కోపాన్ని జట్టు ప్రదర్శనపై పడనీయకుండా ధోనీ తీసుకున్న ఆ నిర్ణయం అద్భుత ఫలితాన్ని ఇచ్చింది. ఆ ఆటగాడిని జట్టులో కొనసాగించగా.. చివరకు 2023 ఐపీఎల్ టైటిల్‌ను సీఎస్కే కైవసం చేసుకుంది.

ఐపీఎల్‌లో ధోనీ లోటు తీరనిది
ఎంఎస్ ధోనీ సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ఐదు సార్లు(2010, 2011, 2018, 2021, 2023) ఐపీఎల్ ఛాంపియన్‌‌గా నిలవడంతో పాటు రెండు సార్లు ఛాంపియన్స్ లీగ్ టీ20 ట్రోఫీలను గెలుచుకుంది. అలాగే భారత కెప్టెన్‌గా మూడు ఐసీసీ ట్రోఫీలను(2007 టీ20 ప్రపంచ కప్, 2011 వన్డే ప్రపంచ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ) అందించారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో పాటు ధోనీ ఐపీఎల్‌కు అతిపెద్ద బ్రాండ్‌గా నిలిచారని, ధోనీ బ్యాటింగ్ కు వస్తుంటే స్టేడియంలో కనిపించే ఆ ఉత్సాహం ఇకపై మిస్ అవుతామని ఆకాశ్ చోప్రా పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+