IPLలో ధోనీ మ్యాజిక్: కెప్టెన్ కూల్ ఆ 5 రికార్డులు ఇప్పటికీ చెక్కుచెదరలేదు!

MS Dhoni: భారత క్రికెట్ దిగ్గజం, చెన్నై సూపర్ కింగ్స్ ఆరాధ్య దైవం, ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ కెప్టెన్లలో ఒకరైన మహేంద్ర సింగ్ ధోనీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆటగాడిగా తన సుదీర్ఘ ప్రస్థానానికి ముగింపు పలికాడు. 2020లోనే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోనీ.. ఇప్పటివరకు కేవలం ఐపీఎల్ లో మాత్రమే కొనసాగుతూ అభిమానులను అలరించారు. తాజాగా ఐపీఎల్ 2027 సీజన్ ప్రారంభానికి ముందు 45 ఏళ్ల ధోనీ తన రిటైర్మెంట్‌ను ప్రకటించాడు. ఇప్పుడు ఆ ప్రస్థానానికి ధోనీ ముగింపు పలికి చెన్నై సూపర్ కింగ్స్ మెంటార్‌గా కొత్త బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ చరిత్రలో కెప్టెన్ కూల్ నెలకొల్పిన, ఎవరూ బద్ధలు కొట్టలేని 5 అద్భుత రికార్డుల గురించి తెలుసుకుందాం.

IPL 2027కు ముందే ప్లేయర్ల బదిలీ.. CSK, SRH జట్ల మధ్య మెగా డీల్!
IPL 2027కు ముందే ప్లేయర్ల బదిలీ.. CSK, SRH జట్ల మధ్య మెగా డీల్!

1. కెప్టెన్‌గా అత్యధిక మ్యాచ్‌లు (226)
ఐపీఎల్ చరిత్రలో కెప్టెన్ గా అత్యధిక మ్యాచ్‌లకు నాయకత్వం వహించిన అరుదైన రికార్డు మహేంద్ర సింగ్ ధోనీ పేరిటే ఉంది. ధోనీ మొత్తం 226 ఐపీఎల్ మ్యాచులలో సారథిగా వ్యవహరించి, తన జట్టుకు 133 విజయాలు అందించారు. నేటి రోజుల్లో ఫ్రాంచైజీలు తరచూ కెప్టెన్లను మారుస్తున్న తీరు చూస్తుంటే.. భవిష్యత్తులో మరే ఆటగాడూ సారథిగా 200 మ్యాచ్‌ల మైలురాయిని అందుకోవడం దాదాపు అసాధ్యం.

MS Dhoni Retires from IPL 5 Unbreakable Records Set by Captain Cool in IPL History Full Details

2. 100 సార్లు నాటౌట్‌గా నిలిచిన ఏకైక బ్యాటర్
క్రికెట్ ప్రపంచం ధోనీని అత్యుత్తమ ఫినిషర్‌గా ఎందుకు కీర్తిస్తుందో ఈ రికార్డు నిరూపిస్తుంది. ఐపీఎల్ చరిత్రలో ఏకంగా 100 సార్లు నాటౌట్‌గా పెవిలియన్‌కు చేరిన ఏకైక బ్యాటర్ ధోనీ మాత్రమే. లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ కు వచ్చి చివరి బంతి వరకు క్రీజులో నిలిచి జట్టును గెలిపించడం ఆయన ప్రత్యేకత. ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్న ఆటగాడు కూడా ధోనీకి దరిదాపుల్లో లేరు.

3. ఒకే జట్టును 10 సార్లు ఫైనల్‌కు చేర్చిన సారథి
ధోనీకి, సీఎస్కేకు మధ్య ఉన్న అనుబంధం ఎంతో ప్రత్యేకమైనది. కెప్టెన్‌గా ధోనీ తన నాయకత్వ పటిమతో సీఎస్కే జట్టును ఏకంగా 10 సార్లు ఐపీఎల్ ఫైనల్‌కు చేర్చారు. అందులో 5 సార్లు(2010, 2011, 2018, 2021, 2023) ఛాంపియన్‌గా నిలిపి ట్రోఫీలను ముద్దాడారు. ఒకే కెప్టెన్ తన జట్టును 10 సార్లు టైటిల్ పోరుకు తీసుకెళ్లడం ఐపీఎల్ చరిత్రలో ఓ అద్భుత ఘనత.

4. వికెట్ కీపర్‌గా అత్యధిక ఔట్లు
ఎంఎస్ ధోనీ ఎంత చాకచక్యమైన కెప్టెనో, వికెట్ల వెనుక ఆయన వేగం అంతకంటే పదునైనది. ఐపీఎల్‌లో వికెట్ కీపర్‌గా 180కి పైగా ఔట్‌లలో ఆయన భాగస్వామయ్యారు. ఇందులో అత్యధిక క్యాచ్‌లతో పాటు మెరుపు వేగంతో చేసిన స్టంపింగ్స్ ఉన్నాయి. కనురెప్ప పాటులో బెయిల్స్‌ను ఎగరగొట్టే ఆయన చిరుత వేగాన్ని అందుకోవడం నేటి యువకీపర్లకు పెను సవాలే.

సన్‌రైజర్స్ బౌలింగ్‌లో భారీ మార్పులు.. మరో స్టార్ పేసర్‌కు గుడ్‌బై!
సన్‌రైజర్స్ బౌలింగ్‌లో భారీ మార్పులు.. మరో స్టార్ పేసర్‌కు గుడ్‌బై!

5.ఒక్క సెంచరీ లేకుండానే 5 వేలకు పైగా పరుగులు
సాధారణంగా టీ20 క్రికెట్లో 5 వేలకు పైగా పరుగులు చేసిన బ్యాటర్ల ఖాతాలో పలు సెంచరీలు ఉంటాయి. ఎందుకంటే వారంతా టాపార్డర్‌లో బ్యాటింగ్ చేస్తారు. కానీ ధోనీ తన కెరీరా మొత్తం 5,6,7 స్థానాల్లోనే బ్యాటింగ్ చేశారు. ఆడటానికి చాలా తక్కువ బాల్స్ లభించినప్పటికీ.. ఒక్క సెంచరీ కూడా లేకుండానే ఐపీఎల్‌లో 5,400కు పైగా పరుగులు సాధించడం కేవలం ధోనీకి మాత్రమే సాధ్యమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+