IPL 2027కు ముందే ప్లేయర్ల బదిలీ.. CSK, SRH జట్ల మధ్య మెగా డీల్!

IPL 2027: రాబోయే ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముందు ట్రేడింగ్ మార్కెట్లో పెను సంచలనం నమోదైంది. డిసెంబర్ 16న గోవాలో జరగనున్న వేలానికి ముందే ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీలు నలుగురు ప్లేయర్లతో కూడిన భారీ ట్రేడ్ డీల్‌ను పూర్తి చేశాయి. ఈ ఒప్పందం ద్వారా చెన్నై తన ఆల్‌రౌండ్ విభాగాన్ని బలోపేతం చేసుకోగా.. హైదరాబాద్ తన పేస్ బౌలింగ్‌కు మరింత పదును పెట్టింది.

కావ్య పాపకు బిగ్ షాక్.. సన్‌రైజర్స్‌ను వీడనున్న విధ్వంసకర ఓపెనర్!
కావ్య పాపకు బిగ్ షాక్.. సన్‌రైజర్స్‌ను వీడనున్న విధ్వంసకర ఓపెనర్!

సీఎస్కే గూటికి ఇద్దరు విధ్వంసకర ఆల్‌రౌండర్లు
గత సీజన్‌లో బ్యాటింగ్ విభాగంలో ఎదురైన లోపాలను సరిదిద్దుకునేందుకు సీఎస్కే వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. ఈ ట్రేడ్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ నుంచి ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్‌లను సీఎస్కే సొంతం చేసుకుంది. గతంలో హైదరాబాద్ రూ.13 కోట్లకు కొనుగోలు చేసిన లియామ్ లివింగ్‌స్టోన్.. సవరించిన ఫీజు కింద రూ.6 కోట్లకే చెన్నై జట్టులో చేరాడు. రాజస్థాన్, పంజాబ్, బెంగళూరు, హైదరాబాద్ తర్వాత లివింగ్ స్టోన్‌కు ఇది ఐదో ఐపీఎల్ ఫ్రాంచైజీ కానుంది.ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ తన ప్రస్తుత ధర రూ.3 కోట్లకే సీఎస్కే క్యాంపులో అడుగుపెట్టాడు. కాలికి గాయం కారణంగా ఐపీఎల్ 2026 సీజన్‌కు దూరమైన జాక్ ఎడ్వర్డ్స్.. ఈ సారి సీఎస్కే తరఫున అరంగేట్రం చేసేందుకు సిద్ధమయ్యాడు.

IPL 2027 Mega Trade CSK Sign Liam Livingstone Jack Edwards SRH Get Khaleel Ellis Details

ఎస్ఆర్‌హెచ్ లోకి తిరిగొచ్చిన ఖలీల్.. తోడుగా నాథన్ ఎల్లిస్
ఇద్దరు ఆల్‌రౌండర్లను వదులుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. అందుకు ప్రతిగా సీఎస్కే నుంచి ఇద్దరు పేసర్లను దక్కించుకుంది. భారత లెఫ్టార్మ్ పేసర్ ఖలీల్ అహ్మద్ రూ.4.8 కోట్ల ప్రస్తుత ఫీజుతో తిరిగి తన పాత గూడు సన్‌రైజర్స్ హైదరాబాద్ చేరుకున్నాడు. 2018 నుంచి 2021 వరకు హైదరాబాద్‌కు ఆడిన ఖలీల్ అహ్మద్.. ఐపీఎల్ 2025లో సీఎస్కే తరఫున 14 మ్యాచుల్లో 15 వికెట్లు తీసి అద్భుతంగా రాణించాడు.

ఐపీఎల్‌కు ధోనీ గుడ్ బై?.. రేపే అసలు ట్విస్ట్! ఆందోళనలో ఫ్యాన్స్!!
ఐపీఎల్‌కు ధోనీ గుడ్ బై?.. రేపే అసలు ట్విస్ట్! ఆందోళనలో ఫ్యాన్స్!!

డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా పేరున్న ఆస్ట్రేలియా పేసర్ నాథన్ ఎల్లిస్ రూ.2 కోట్ల ధరతో సన్‌రైజర్స్ జట్టులో చేరాడు. వైవిధ్యమైన బంతులతో బ్యాటర్లను కట్టడి చేయగల నాథన్ ఎల్లిస్ రాకతో హైదరాబాద్ బౌలింగ్ విభాగానికి అదనపు బలం చేకూరింది. వేలానికి ముందే రెండు ప్రధాన జట్లు తమ బలాబలాలను బేరీజు వేసుకుని చేసుకున్న ఈ పరిస్పర మార్పడి రాబోయే ఐపీఎల్ 2027 సీజన్‌పై అంచనాలను మరింత పెంచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+