అమెజాన్ ప్రైమ్ వీడియోను ఊచకోత కోస్తున్న మూవీ
బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట ముగించిన సూపర్ స్టార్ రజనీకాంత్, ఇప్పుడు డిజిటల్ స్క్రీన్‌పైనా తన హవాను కొనసాగిస్తున్నారు. తాజాగా అందుతున్న గణాంకాల ప్రకారం, అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియాలో 'జైలర్ 2' చిత్రం నంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతూ రికార్డు సృష్టిస్తోంది. కేవలం సినిమాల విభాగంలోనే కాకుండా, ప్రైమ్ వీడియో ఓవరాల్ ట్రెండింగ్ జాబితాలోనూ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుని తలైవా మేనియా ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది. తమిళం నుంచి మొదటి రూ.వెయ్యి కోట్ల సినిమాగా సంచలన రికార్డు సాధిస్తుందని అందరూ భావించారుకానీ రూ.800 కోట్ల చిల్లర దగ్గరే జైలర్ 2 ఆగిపోయింది.
నెల్సన్ మార్క్ యాక్షన్
ప్రముఖ గ్లోబల్ ఓటీటీ డేటా ట్రాకర్ 'ఫ్లిక్స్‌ప్యాట్రోల్' విడుదల చేసిన తాజా జాబితా ప్రకారం, భారతదేశంలో ప్రస్తుతం అత్యధికంగా వీక్షిస్తున్న చిత్రాల్లో 'జైలర్ 2' మొదటి స్థానంలో నిలిచింది. దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కించిన ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు అనిరుధ్ రవిచందర్ అందించిన నేపథ్య సంగీతం, రజనీకాంత్ మాస్ స్క్రీన్ ప్రెజెన్స్ ఓటీటీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

టాప్ 5లో నిలిచిన ఇతర చిత్రాలు
ప్రైమ్ వీడియో ఇండియా టాప్ 5 సినిమాల జాబితాలో రజనీకాంత్ 'జైలర్ 2' అగ్రస్థానంలో నిలవగా, ఆ తర్వాతి స్థానాల్లో పలు క్రేజీ చిత్రాలు పోటీ పడుతున్నాయి.రజనీకాంత్ హీరోగా నటించిన ఈ మాస్ యాక్షన్ థ్రిల్లర్ ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో తిరుగులేని నంబర్ 1 మూవీగా దూసుకుపోతోంది. 'జైలర్ 2' తర్వాత వరుసగా వైబ్, మీర్జాపూర్, జైలర్ 1, కూలీ.. యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు 2, 3, 4, 5 స్థానాల్లో కొనసాగుతున్నాయి.
థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులతో పాటు, రజనీ మేనరిజమ్స్‌ను మరోసారి చూడాలనుకునే అభిమానులు రిపీట్ మోడ్‌లో ఈ సినిమాను చూస్తుండటంతో 'జైలర్ 2' వ్యూయర్‌షిప్ రికార్డు స్థాయిలో నమోదవుతోంది. రానున్న వీకెండ్‌లో ఈ చిత్రం మరిన్ని సరికొత్త స్ట్రీమింగ్ రికార్డులను తన ఖాతాలో వేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.














Click it and Unblock the Notifications
