ఏపీ మీదుగా వారణాసికి ప్రత్యేక రైలు- హాల్ట్ స్టేషన్లు
పండగ సీజన్ లో రైళ్లకు ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంటుంది. వివిధ పుణ్యక్షేత్రాలు, పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి, దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించాలనుకునే వాళ్ల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంటుందీ పండగల సీజన్‌లో. వాళ్లంతా కూడా రైళ్ల మీదే ఎక్కువగా ఆధారపడుతుంటారు. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు పలు ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది.
ఈ క్రమంలో మరో ప్రత్యేక రైలును అధికారులు ప్రకటించారు. కాశీ తమిళ్ సంగం సమావేశం కోసం ప్రత్యేకంగా ప్రకటించిన ఎక్స్ ప్రెస్ రైలు ఇది. ఏపీ మీదుగా కోయంబత్తూర్ నుంచి బనారస్ కు రాకపోకలు సాగిస్తుంది. ఈ కాశీ తమిళ్ సంగం సమావేశం కాబోతోండటం ఇది అయిదోసారి. దీనికి తమిళనాడు నుంచి పెద్ద ఎత్తున హాజరవుతుంటారు. ఈ రద్దీని నివారించడానికి ఈ రైలును ప్రవేశపెట్టినట్లు అదికారులు వెల్లడించారు.

- ఈ నెల 29వ తేదీన ఆదివారం సాయంత్రం 6 గంటలకు కోయంబత్తూర్ నుంచి బయలుదేరే నంబర్ 06047 ప్రత్యేక రైలు రెండో రోజు రాత్రి 8 గంటలకు వారణాసికి చేరుకుంటుంది.
- తిరుగు ప్రయాణంలో డిసెంబర్ 5వ తేదీన శనివారం రాత్రి 10: 30 గంటలకు వారణాసి నుంచి బయలుదేరే నంబర్ 06048 ప్రత్యేక రైలు రెండో రోజు రాత్రి 11: 55 నిమిషాలకు కోయంబత్తూర్ కు చేరుకుంటుంది.
- తిరుప్పూర్, ఈరోడ్, సేలం, జోలార్ పేట, కాట్పాడి, అరక్కోణం, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, వరంగల్, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్ నగర్, బల్లార్షా, గోండియా, నైన్ పూర్, జబల్ పూర్, కత్ని, సత్నా, మాణిక్ పూర్, ప్రయాగ్ రాజ్ ఛియోకి మీదుగా ఈ ప్రత్యేక రైలు రాకపోకలు సాగిస్తుంది.
- మొత్తం 20 బోగీలు ఉండే ఎక్స్ ప్రెస్ ఇది. ఇందులో 13 ఏసీ 3 టయర్, రెండు ఏసీ 3 టయర్ ఎకానమి కోచ్ లు, మూడు స్లీపర్ క్లాస్ కోచ్ లు, రెండు లగేజ్ కమ్ బ్రేక్ వ్యాన్లు ఉంటాయి.












Click it and Unblock the Notifications
