సీఎం యోగి ఆదిత్యనాథ్ కు ఢిల్లీ నుంచి పిలుపు

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతతోంది. వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ లో పోలింగ్ జరిగే అవకాశం ఉంది. దేశంలోనే అత్యధికంగా 402 అసెంబ్లీ స్థానాలు ఉన్న అతిపెద్ద రాష్ట్రం కావడం, బీజేపీకి గట్టి పట్టు ఉండటం వల్ల ఈ ఎన్నికలపై అందరి దృష్టీ నెలకొనడం సహజమే. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలో వరుసగా రెండుసార్లు బీజేపీ ఇక్కడ అధికారంలోకి వచ్చింది. హ్యాట్రిక్ కొట్టాలనే పట్టుదలతో ఉంది. దీంతో రాజకీయ వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది.

ఈ నేపథ్యంలో బీజేపీ రాజకీయ వ్యూహాలకు పదును పెడుతోంది. ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు హస్తిన నుంచి పిలుపు అందింది. దీంతో ఈ సాయంత్రం ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్, రాజ్యసభ సభ్యుడు వినోద్ తావ్డేను కలుసుకోనున్నారు. ఎన్నికల వ్యూహాలపై చర్చించనున్నారు.

UP CM Yogi Adityanath will meet Union Home Minister Amit Shah Nitin Nabin in Delhi today evening

మధురలో ఇటీవలే రెండు రోజుల పాటు బీజేపీ చింతన్ బైఠక్ ఏర్పాటైన విషయం తెలిసిందే. ఇది ముగిసిన వెంటనే యోగి ఆదిత్యనాథ్ ఢిల్లీ పర్యటన ఖరారు కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. మధుర సమావేశంలో వ్యూహాత్మకంగా చర్చించిన అంశాలను ఆయన ఈ సందర్భంగా పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. సంస్థాగత వ్యవహారాలు, రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, రాబోయే సంక్షేమ పథకాలపై సమగ్రంగా సమీక్షించనున్నట్లు సమాచారం.

యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకాలపై తకరారు?
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకాలపై తకరారు?

ఈ సమావేశంలో ప్రధానంగా ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల కార్యాచరణపైనే ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు.. నేతలు. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల ప్రాథమిక జాబితా రూపకల్పన, నియోజకవర్గాల వారీగా సమీక్షలు, నాయకులకు బాధ్యతల కేటాయింపు, ఎన్నికల ఇన్ ఛార్జీల నియామకం వంటి కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. క్షేత్రస్థాయి నివేదికలను పరిశీలించి, గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న నాయకులను ఖరారు చేయడానికి అవసరమైన రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయనున్నారని పేర్కొంటోన్నాయి.

ఏపీ మీదుగా వారణాసికి ప్రత్యేక రైలు- హాల్ట్ స్టేషన్లు
ఏపీ మీదుగా వారణాసికి ప్రత్యేక రైలు- హాల్ట్ స్టేషన్లు

ఎన్నికల వ్యూహాలతో పాటు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాబోయే రోజుల్లో చేపట్టనున్న ప్రధాన కార్యక్రమాలు, నూతన ప్రాజెక్టులు, అభివృద్ధి పనులపై కూడా ఈ భేటీలో సమీక్షించనున్నారు. ఎన్నికల గడువు దగ్గర పడుతోన్నందున రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న అభివృద్ధి ప్రాజెక్టులు, ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత వేగంగా చేరువ చేయడంపై చర్చ జరగనుంది. పాలనాపరమైన ప్రాధాన్యతలను ఖరారు చేయనున్నారు. మేనిఫెస్టో, ఎన్నికల ప్రచారాస్త్రాలపైనా చర్చించే అవకాశాలు లేకపోలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+