Ind Vs NZ Test: న్యూజీలాండ్ తో టెస్టులకు బౌలింగ్ ప్లాన్ మార్పు- గిల్ ప్రకటన..!

న్యూజీలాండ్ టూర్ లో భాగంగా ఇప్పటికే టీ20, వన్డే సిరీస్ లు దక్కించుకున్న టీమ్ ఇండియా.. ఇప్పుడు టెస్టు సిరీస్ పై ఫోకస్ పెట్టింది. ఈ నెల 19న ప్రారంభం కాబోతున్న టెస్టు సిరీస్ కోసం వ్యూహరచనలో జట్టు కెప్టెన్ శుభ్ మన్ గిల్ (shubman gill)నిమగ్నమై ఉన్నాడు. ఈ నేపథ్యంలో న్యూజీలాండ్ తో జరిగే టెస్టుల్లో భారత జట్టు బౌలింగ్ ప్లాన్ ను గిల్ వెల్లడించాడు. వన్డే సిరీస్ లో పేసర్ల ప్లాన్ విజయవంతం కావడంతో దాన్ని టెస్టుల్లోనూ రిపీట్ చేయబోతున్నట్లు కెప్టెన్ తెలిపాడు.

India Vs New Zealand: అభిషేక్-వైభవ్ దెబ్బకు 2 వరల్డ్ రికార్డుల బ్రేక్-మరొకటి సమం..!
India Vs New Zealand: అభిషేక్-వైభవ్ దెబ్బకు 2 వరల్డ్ రికార్డుల బ్రేక్-మరొకటి సమం..!

న్యూజీలాండ్ తో వన్డే సిరీస్ లో యువపేసర్లు రాణించడం మంచి పరిణామమని కెప్టెన్ శుభ్ మన్ గిల్ తెలిపాడు. దీంతో టెస్టుల కోసం జట్టు తుది కూర్పు విషయంలో తీవ్ర కసరత్తు చేయాల్సి వస్తోందని గిల్ పేర్కొన్నాడు. తమకు ఏడుగురు స్పెషలిస్టు బ్యాటర్లు ఉన్నారని, ఎనిమిది, తొమ్మిది స్ధానాల్లో బ్యాట్ తో సహకారం అందించేందుకు అన్షుల్ కాంబోజ్, ఆకాష్ దీప్ వంటి ఆప్షన్లు ఉన్నాయని తెలిపాడు. నితీష్ రెడ్డి కూడా బ్యాటింగ్ చేయగలడని, అందుకే తుది జట్టులో నలుగురు పేసర్లతో బరిలోకి దిగబోతున్నట్లు గిల్ వెల్లడించాడు.

Indian captain shubman gill reveals bowling plan against new Zealand in tests
Ind vs NZ ODI: న్యూజీలాండ్ తో వన్డేల్లో భారత్ కు అతిపెద్ద సమస్య ఇదేనా?
Ind vs NZ ODI: న్యూజీలాండ్ తో వన్డేల్లో భారత్ కు అతిపెద్ద సమస్య ఇదేనా?

అయితే తుది జట్టు విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని గిల్ తెలిపాడు. మరోవైపు వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఫిట్ నెస్ విషయంలో ఎలాంటి సందిగ్ధత లేదని గిల్ తేల్చిచెప్పేశాడు. అతను 50కి పైగా టెస్టులు ఆడాడని గుర్తుచేశాడు. ప్రపంచవ్యాప్తంగా పరుగులు సాధించాడని తెలిపాడు. అయితే వన్డేల కంటే టెస్టుల్లో తమకు పెను సవాల్ ఎదురుకాబోతున్నట్లు గిల్ అంగీకరించాడు. దీన్ని ఎదుర్కొనేందుకు జట్టుగా సన్నద్ధమవుతున్నట్లు భారత కెప్టెన్ గిల్ పేర్కొన్నాడు. రెండు టెస్టుల సిరీస్ లో శుభారంభం చేయడమే లక్ష్యంగా టీమిండియా సిద్ధమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+