Ind vs NZ ODI: న్యూజీలాండ్ తో వన్డేల్లో భారత్ కు అతిపెద్ద సమస్య ఇదేనా?

న్యూజీలాండ్ టూర్ లో భాగంగా రేపటి నుంచి ఐదు వన్డేల సిరీస్ లో భారత్ తలపడబోతోంది. ఇప్పటికే టీ20 సిరీస్ ను 3-2 తేడాతో దక్కించుకున్న టీమిండియా వాస్తవంగా అయితే సంతోషంగా ఉండాలి. కానీ చివరి రెండు టీ20ల్లో న్యూజీలాండ్ ప్రదర్శన చూసిన తర్వాత భారత్ మబ్బులు వీడిపోయాయి. ఇదే ఆటతీరును కివీస్ వన్డేల్లోనూ కొనసాగిస్తే టీ20 సిరీస్ కు భిన్నమైన ఫలితం వస్తుందన్న ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో న్యూజీలాండ్ తో వన్డే సిరీస్ కు ముందు భారత్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏంటో దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) వెల్లడించాడు.

India Vs New Zealand: అభిషేక్-వైభవ్ దెబ్బకు 2 వరల్డ్ రికార్డుల బ్రేక్-మరొకటి సమం..!
India Vs New Zealand: అభిషేక్-వైభవ్ దెబ్బకు 2 వరల్డ్ రికార్డుల బ్రేక్-మరొకటి సమం..!

న్యూజీలాండ్ తో అక్లాండ్ లో అక్టోబర్ 4న తొలి వన్డే, వెల్లింగ్టన్ లో 7న రెండో వన్డే, హ్యామిల్టన్ లో 10న మూడో వన్డే, మౌంట్ మౌంగనుయ్ లో 13న నాలుగో వన్డే, అక్కడే 15న ఐదో వన్డే భారత్ ఆడబోతోంది. ఈ ఐదు వన్డేల సిరీస్ కు ముందు భారత బౌలర్లు టీ20 సిరీస్ చివరి రెండు మ్యాచ్ ల్లో భారీగా పరుగులు సమర్పించుకున్నారు. పసలేని భారత బౌలింగ్ ను కివీస్ బ్యాట్స్ మెన్ చీల్చిచెండాడారు. అదే ఇప్పడు టీమిండియాకు అతిపెద్ద సమస్యగా మారిందని రవిచంద్రన్ అశ్విన్ విశ్లేషించాడు.

It Is a Big Concern Ravichandran Ashwin Criticises India s Bowling Strategy Against New Zealand
Ind vs New Zealand: ఐదో టీ20లో ఆరంభంలోనే అభిషేక్, శాంసన్ ఔట్..ఆ తర్వాత..!
Ind vs New Zealand: ఐదో టీ20లో ఆరంభంలోనే అభిషేక్, శాంసన్ ఔట్..ఆ తర్వాత..!

"ఇది చాలా ఆందోళనకరమైన విషయం. గత కొన్ని మ్యాచ్‌లలో మనం ఎన్నిసార్లు 200 పరుగులకు పైగా సమర్పించుకున్నామో చూడండి. నేను జట్టును అభినందిస్తున్నాను, కానీ పరిస్థితి మరింత దిగజారకముందే బౌలింగ్ విభాగంపై దృష్టి సారించాలి. బౌలింగ్ లైనప్‌లో కొత్త ఆటగాళ్లు ఉన్నారు, "అయితే, వారికి అసలు ఎలాంటి ప్రణాళిక ఉందో అర్థం చేసుకోవడం నాకు కష్టంగా ఉంది. సమావేశాల్లో ఎలాంటి చర్చలు జరుగుతున్నాయి? దీనిపై మీరు దృష్టి పెట్టకపోతే, సమస్య మరింత పెద్దదవుతుంది. అందుకే నాకు ఆందోళనగా ఉంది. కొన్ని ప్రాథమిక తప్పులు జరిగాయి," అని 'అష్ కీ బాత్' కార్యక్రమంలో అశ్విన్ తెలిపాడు. మరి వన్డే సిరీస్ లో అయినా భారత బౌలర్లు మెరుగుపడతారా లేక అవే తప్పులు పునరావృతం చేసి సిరీస్ కివీస్ కు అప్పగిస్తారా అన్నది రేపు జరిగే తొలి మ్యాచ్ లోనే తేలిపోనుంది. భారత కాలమానం ప్రకారం రేపు ఉదయం 7.30కు తొలి వన్డే ప్రారంభం కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+