IND vs NZ: వెల్లింగ్టన్‌లో బుమ్రా నిప్పులు.. తొలి సెషన్‌లోనే కివీస్‌కు భారత్ షాక్!

IND vs NZ: న్యూజిలాండ్ గడ్డపై 18 ఏళ్ల టెస్ట్ గెలుపు నిరీక్షణకు తెరదించాలనే పట్టుదలతో బరిలోకి దిగిన భారత జట్టుకు అద్భుతమైన ఆరంభం లభించింది. వెల్లింగ్టన్‌లోని బేసిన్ రిజర్వ్ స్టేడియంలో గురువారం ప్రారంభమైన తొలి టెస్ట్‌లో భారత పేసర్లు నిప్పులు చెరిగారు. టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్న కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నిర్ణయాన్ని బౌలర్లు పూర్తిగా సమర్థించారు. ఫలితంగా తొలిరోజు లంచ్ విరామ సమయానికి ఆతిథ్య న్యూజిలాండ్ 4 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

టెస్టులకు ముందు టీమిండియాకు దిమ్మతిరిగే షాక్.. మ్యాచ్ ఫీజులో 35 శాతం కోత!
టెస్టులకు ముందు టీమిండియాకు దిమ్మతిరిగే షాక్.. మ్యాచ్ ఫీజులో 35 శాతం కోత!

తొలి ఓవర్ నుంచే బుమ్రా విశ్వరూపం
బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ జట్టుకు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆదిలోనే కోలుకోలేని దెబ్బతీశాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ మూడో బంతికి కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్‌ను(0) క్లీన్ బౌల్డ్ చేసి భారత్‌కు శుభారంభం అందించాడు. ఆ తర్వాత నాలుగో ఓవర్లో యువ పేసర్ అన్షుల్ కాంబోజ్ మరో ఓపెనర్ డెవాన్ కాన్వేను పెవిలియన్‌కు పంపాడు. కాన్వే బ్యాట్ అంచును తాకిన బంతిని వికెట్ కీపర్ రిషబ్ పంత్ అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. అంతకుముందు బుమ్రా బౌలింగ్‌లోని డెవాన్ కాన్వేకు డీఆర్ఎస్ రూపంలో ఓ లైఫ్ లభించినా దానిని అతను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. దీంతో కివీస్ 12 పరుగులకే ఓపెనర్లిద్దరినీ కోల్పోయింది.

IND vs NZ 1st Test Day 1 Jasprit Bumrah Strikes Early as New Zealand Lose 4 by Lunch Details

ఆకాశ్ దీప్, బుమ్రా జోరు.. చేజారిన అవకాశాలు
ఆరంభ వికెట్ల తర్వాత హెన్రీ నికోల్స్, రచిన్ రవీంద్ర ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ మూడో వికెట్ కు 39 పరుగులు జోడించారు. ఈక్రమంలో భారత జట్టు రెండు కీలక అవకాశాలను చేజార్చుకుంది. అన్షుల్ కాంబోజ్ బౌలింగ్‌లో రచిన్ రవీంద్ర క్యాచ్ అవుట్ అయినట్లు వినిపించినా, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రివ్యూ తీసుకోలేదు. రీప్లేలో బంతి బ్యాట్‌కు తాకినట్లు స్పష్టమైంది. అలాగే ఆకాశ్ దీప్ బౌలింగ్ లో నికోల్స్ ఇచ్చిన క్యాచ్, రిషబ్ పంత్ గ్లౌజుల్లోకి చేరే ముందే నేలను తాకడంతో అతనికి లైఫ్ లభించింది.

Ind Vs NZ Test: న్యూజీలాండ్ తో టెస్టులకు బౌలింగ్ ప్లాన్ మార్పు- గిల్ ప్రకటన..!
Ind Vs NZ Test: న్యూజీలాండ్ తో టెస్టులకు బౌలింగ్ ప్లాన్ మార్పు- గిల్ ప్రకటన..!

అయితే జట్టు స్కోరు 51 పరుగుల వద్ద ఆకాశ్ దీప్ ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. 50 బంతుల్లో 15 పరుగులు చేసిన రచిన్ రవీంద్రను పంత్ క్యాచ్ ద్వారా ఔట్ చేశాడు. ఇక లంచ్ విరామానికి సరిగ్గా ముందు 21వ ఓవర్లో బుమ్రా మరోసారి మాయ చేశాడు. క్రీజు వెలుపలికి వచ్చి ఆడేందుకు ప్రయత్నించిన డారిల్ మిచెల్(1) ఇన్‌సైడ్ ఎడ్జ్ అయి ప్యాడ్లకు తగిలి గాల్లోకి లేచిన బంతిని షార్ట్ లెగ్‌లో ఉన్న యశస్వి జైస్వాల్ ఒడిసిపట్టాడు. దీంతో బుమ్రా తన ఖాతాలో రెండో వికెట్ వేసుకున్నాడు.

చరిత్ర తిరగరాయాలని గిల్ సేన పట్టుదల
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో నిలవాలంటే భారత్‌కు ఈ సిరీస్ అత్యంత కీలకం. 2024లో స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో ఎదురైన 0-3 వైట్‌వాష్‌కు ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు 2008-09 తర్వాత కివీస్ గడ్డపై తొలి టెస్ట్ సిరీస్ గెలవాలని గిల్ సేన లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే వన్డే, టీ20 సిరీస్ లను కైవసం చేసుకున్న భారత్.. తొలి టెస్ట్ తొలి సెషన్లోనే ఆధిపత్యం చెలాయించి శుభసంకేతాలు పంపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+