పాకిస్థాన్ Fatah-3 క్షిపణి పరీక్ష విజయవంతం.. భారత ఆర్మీ స్థావరాలకు ముప్పు..!

పాకిస్థాన్ ఆర్మీ తాజాగా కీలక ప్రకటన చేసింది. తమ వద్ద ఉన్న ఫతా-3 సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ ను విజయవంతంగా పరీక్షించినట్లు పేర్కొంది. సుదూర ప్రాంతాల్లోని లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం ఈ క్షిపణికి ఉందని పాకిస్థాన్ ఆర్మీ స్పష్టం చేసింది. సూపర్ సోనిక్ స్పీడ్ తో కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఈ క్షిపణి సమర్థవంతంగా పూర్తి చేయగలదని పేర్కొంది. ఫతా-3 సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ ను పాకిస్థాన్ అమ్ముల పొదిలోకి చేర్చుకోవడం ద్వారా తమ దేశ రక్షణ సామర్థ్యం మరింత బలపడిందని స్పష్టం చేసింది. అత్యాధునిక నేవిగేషన్ టెక్నాలజీ ఈ ఫతా-3 మిసైల్ సొంతం అని పేర్కొంది. ఇక ఈ క్షిపణి పరీక్ష ఆర్మీ రాకెట్ ఫోర్స్ కమాండ్ కు చెందిన కమాండర్ తో పాటుగా పాకిస్థాన్ ఆర్మీలోని సీనియర్ అధికారులు, శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల సమక్షంలో జరిగింది.

ఇక ఫతా-3 సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ పరీక్ష విజయవంతం కావడంతో పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ, ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ స్టాఫ్ అలాగే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అసిమ్ మునీర్ తో పాటు సర్వీసెస్ చీఫ్ లు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ఇంటీరియల్ మినిస్టర్ మోహ్సిన్ నఖ్వీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఫతా-3 క్షిపణి పరీక్ష విజయంతో పాకిస్థాన్ రక్షణ వ్యవస్థ మరింత సమర్థవంతంగా, దృఢంగా మారిందని స్పష్టం చేశారు. పాకిస్థాన్ రక్షణ శక్తి, సామర్థ్యాల్లో ఇది ఒక కీలకమైన మైలు రాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నట్లు పాకిస్థాన్ లోని ప్రముఖ మీడియా సంస్థ అయిన డాన్ పత్రిక పేర్కొంది.

Pakistan successfully tests Fatah3 supersonic cruise missile india alert amid threats from pakistan

ఇక అంతకుముందు ఫాజ్ అనే దేశీయ క్షిపణిని పాకిస్థాన్ విజయవంతంగా పరీక్షించింది. ఈ మిసైల్ పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో రూపొందింది. ఈ క్షిపణి ఎయిర్ టూ ఎయిర్ విధానంలో దాడులను చేస్తుంది. అలాగే ఈ ఏడాది అక్టోబర్ లో పాకిస్థాన్ రెండు పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసింది. ఫతా-2 ఎక్స్ టెండెడ్ రేంజ్ హైపర్ సోనిక్ బాలిస్టిక్ మిసైల్ ను అక్టోబర్ 13 న విజయవంతంగా పరీక్షించింది. అంతకుముందు అక్టోబర్ 6 న ఫతా-4 గ్రౌండ్ లాంచ్ డ్ క్రూయిజ్ మిసైల్ ను విజయవంతంగా పరీక్షించింది. ఇక తాజాగా ఫతా-3 సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ పరీక్ష విజయవంతం కావడంతో భారత్ అలర్ట్ అయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+