అలిపిరి నడకమార్గంలో కేబుల్ బ్రిడ్జి - వైకుంఠ ద్వార దర్శనం, టోకెన్లు జారీ ఇలా..!!
తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 20 నుండి 29వ తేదీ వరకు 8.34 లక్షల మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. కొంత కాలంగా చర్చల్లో ఉన్న అలిపిరి వద్ద యాత్రికుల టౌన్ షిప్ నిర్మాణానికి కన్సెల్టెన్సీ ఎంపికతో పాటుగా అలిపిరిక నడకమార్గంలో కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి ఆలోచన చేస్తోంది. ఇక, టీటీడీ ఉద్యోగులకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
టీటీడీ స్పెసిఫైడ్ కమిటీ తొలి సమావేశంలో పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. అందులో భాగంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు.. భక్తులకు దర్శనం పైన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 20 నుండి 29వ తేదీ వరకు 8.34 లక్షల మంది భక్తుల కు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు అన్ని విభాగాల సమన్వయంతో ప్రణాళికాబద్ధంగా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ సాధికారిక మండలి ఛైర్మన్ ముద్దాడ రవిచంద్ర తెలిపారు. సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజులకు సంబంధించి SSD టోకెన్లను ఆన్ లైన్ లో విడుదల చేస్తాం. తొలి రెండు రోజులు సర్వ దర్శనం ఉండదు. తర్వాత 8 రోజులు భక్తులకు సర్వ దర్శనం అమలు చేయడం జరుగుతుంది. అదే విధంగా అలిపిరి-ఎస్.వి. జూ పార్క్ రోడ్డుకు సమీపంలోని టీటీడీ స్థలంలో రూ.2,750 కోట్ల శ్రీవాణి ట్రస్ట్ నిధులతో నిర్మించనున్న యాత్రికుల టౌన్షిప్ కోసం డీపీఆర్, డిజైన్ల తయారీ, ప్రాజెక్టు పర్యవేక్షణ కోసం కన్సల్టెన్సీ సంస్థను ఎంపిక చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

స్సెసిఫైడ్ కమిటీ సమావేశంలో నిర్ణయాలు
ఈ టౌన్ షిప్ లో భక్తులకు మెరుగైన వసతి, ఆధునిక మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. కాగా.. టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాలు కేటాయింపులో భాగంగా సీనియారిటీ జాబితా 2007 ఆధారంగా ఫేజ్-IIIలో రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి వారసులకు పల్లం గ్రామంలో ప్లాట్లు కేటాయించడానికి ఆమోదించారు. శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం నుంచి శ్రీవారిమెట్టు వరకు భక్తుల రాకపోకలకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా రహదారి అభివృద్ధి, ఇరువైపులా ఇంటర్ లాకింగ్ సిమెంట్ బ్లాక్‌ల నిర్మాణానికి రూ.9.50 కోట్లు మంజూరుకు ఆమోదం. ప్రతి ఏడాది శ్రీవారి బ్రహ్మోత్సవాల అనంతరం ఉద్యోగులకు అందించే బ్రహ్మోత్సవ బహుమానాన్ని ఈ ఏడాది టీటీడీ పర్మినెంట్ ఉద్యోగులకు రూ.16,940, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు రూ.8,289 చొప్పున ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అలిపిరి నడకమార్గంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం నుంచి మోకాళ్లమిట్ట వరకు రోడ్డుపై నడిచివచ్చే భక్తుల సౌకర్యార్థం ఐఐటీ నిపుణులు సహకారంతో కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి ఉన్న సాధ్యాసాధ్యాల ను పరిశీలిస్తున్నట్లు రవిచంద్ర వెల్లడించారు.













Click it and Unblock the Notifications
