India Vs New Zealand: అభిషేక్-వైభవ్ దెబ్బకు 2 వరల్డ్ రికార్డుల బ్రేక్-మరొకటి సమం..!

న్యూజీలాండ్ తో వెల్లింగ్టన్ లో ఇవాళ జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో పలు రికార్డులు బద్దలయ్యాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ ఇచ్చిన 199 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓపెనర్లుగా బరిలోకి దిగిన లెఫ్ట్ హ్యాండర్ల జోడీ అభిషేక్ శర్మ-వైభవ్ సూర్యవంశీ ( Abhishek Sharma-Vaibhav Sooryavanshi) ఏకంగా రెండు ప్రపంచ రికార్డులు సృష్టించారు. అంతే కాదు మరో ప్రపంచ రికార్డును సైతం సమం చేశారు. దీంతో భారత్ కు భవిష్యత్తులో టీ20ల్లో అద్భుతమైన ఓపెనర్ల జోడీ లభించినట్లయింది.

Tilak Varma: న్యూజీలాండ్ తో రెండో టీ20లో తిలక్ వర్మ వరల్డ్ రికార్డు..!
Tilak Varma: న్యూజీలాండ్ తో రెండో టీ20లో తిలక్ వర్మ వరల్డ్ రికార్డు..!

టెస్టు హోదా దేశాల్లో భారత్ సాధించిన ఈ 50 పరుగులే అత్యంత వేగవంతమైనవి. అన్ని టీ20 ఆడుతున్న దేశాలను పరిగణనలోకి తీసుకుంటే, పాపువా న్యూ గినియా, రొమేనియా నెలకొల్పిన రికార్డును భారత్ ఇప్పుడు సమం చేసింది. అంతకుముందు టెస్టు హోదా కలిగిన దేశాల విభాగంలో న్యూజిలాండ్ (స్కాట్లాండ్, ఇంగ్లాండ్‌లపై) దక్షిణాఫ్రికా (వెస్టిండీస్‌పై) 2.4 ఓవర్లలో 50 పరుగులు సాధించి రికార్డును కలిగి ఉండేవి. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 50 పరుగులు సాధించిన జట్లను ఓవర్ల పరంగా చూస్తే 2.2 ఓవర్లలో పాపువా న్యూ గినియా vs వనువాటు (పోర్ట్ మోర్స్బీ, 2019), రొమేనియా vs సెర్బియా (సోఫియా, 2021) భారత్ vs న్యూజిలాండ్ (క్రైస్ట్‌చర్చ్, 2026) టాప్ 3లో ఉన్నాయి.

Abhishek Sharma-Vaibhav Sooryavanshi Duo Breaks Two World Records Equals Another in Wellington
కివీస్ తో రెండో టీ20కి స్టార్ బ్యాట్స్ మెన్ అవుట్..! వైభవ్ కు ఛాన్స్..!
కివీస్ తో రెండో టీ20కి స్టార్ బ్యాట్స్ మెన్ అవుట్..! వైభవ్ కు ఛాన్స్..!

తర్వాత భారత్ కేవలం 5 ఓవర్లలోనే 100 పరుగుల మార్కును చేరుకుని టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో సరికొత్త ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకుంది. అంతకుముందు ఈ రికార్డు రొమేనియా పేరిట ఉండేది. 2021లో సెర్బియాతో జరిగిన మ్యాచ్‌లో 32 బంతుల్లో రొమేనియా 100 పరుగులను పూర్తి చేసింది. టెస్టు హోదా కలిగిన దేశాల విషయానికి వస్తే, గతంలో దక్షిణాఫ్రికా ఈ రికార్డును కలిగి ఉండేది. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 5.3 ఓవర్లలో వంద పరుగుల మైలురాయిని దక్షిణాప్రికా అందుకుంది. అలాగే 199 పరుగుల లక్ష్యఛేదనలో భారత్ మొదటి 6 ఓవర్లలోనే 118 పరుగులు సాధించి, పవర్‌ప్లేలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఇది ఒక టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో పవర్‌ప్లేలో నమోదైన అత్యధిక స్కోరు. అంతకుముందు ఈ రికార్డు రొమేనియా పేరిట ఉండేది. 2021లో సెర్బియాతో జరిగిన టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో పవర్‌ప్లేలో రొమేనియా 116/0 స్కోరును నమోదు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+