పాక్ ప్లేయర్ షూ లేస్ కట్టిన టీమిండియా కెప్టెన్.. వీడియో వైరల్

అండర్-19 ఆసియా కప్ 2026లో భాగంగా ఆదివారం భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన రసవత్తర పోరులో ఓవైపు హోరాహోరీ పోరు సాగగా.. మరోవైపు స్టేడియంలో అద్భుతమైన క్రీడాస్ఫూర్తి ఆవిష్కృతమైంది. మ్యాచ్‌లో భారత్ పరాజయం పాలైనప్పటికీ.. భారత అండర్-19 జట్టు కెప్టెన్ లక్ష్య రాజేష్ రాయచందానీ తన ఉదారతతో కోట్ల మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. క్రికెట్‌ను జెంటిల్మెన్ గేమ్ అని ఎందుకు అంటారో ఆయన మరోసారి నిరూపించారు.

Ind vs NZ 3rd ODI: న్యూజీలాండ్ తో మూడో వన్డేకు 2 కీలక మార్పులు- వాళ్లిద్దరూ రిటర్న్?
Ind vs NZ 3rd ODI: న్యూజీలాండ్ తో మూడో వన్డేకు 2 కీలక మార్పులు- వాళ్లిద్దరూ రిటర్న్?

సోషల్ మీడియాలో వీడియో వైరల్
పాకిస్తాన్ బ్యాటింగ్ సమయంలో వారి బ్యాటర్ హస్నైన్ అబ్బాస్ దార్ షూ లేస్ ఊడిపోయింది. అది గమనించిన భారత కెప్టెన్ లక్ష్య రాజేష్ రాయచందానీ వెంటనే ఏ మాత్రం సంకోచించకుండా మోకాళ్లపై కూర్చొని ప్రత్యర్థి ప్లేయర్ షూ లేస్‌ను స్వయంగా కట్టారు. స్టేడియంలో పాక్ ఆటగాళ్లు తరచూ అగ్రెసివ్ ప్రవర్తనతో వార్తల్లో నిలుస్తుంటారు. కానీ భారత కెప్టెన్ చూపిన ఈ వినమ్రత, నిజమైన క్రీడాస్ఫూర్తికి నిదర్శనమని నెటిజన్లు, క్రికెట్ ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

U19 Asia Cup 2026 Lakshya Raichandani Ties Pak Batter Hasnain Abbas Dar Shoelace Wins Hearts

అర్జున్ రాజ్‌పుత్ అద్భుత శతకం
అర్జున్ రాజ్‌పుత్ అల్ అమెరాత్ క్రికెట్ స్టేడియంలో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 46.3 ఓవర్లలో 208 పరుగులకు ఆలౌట్ అయింది. ఇన్నింగ్స్ రెండో బంతికే కెప్టెన్ లక్ష్య రాజేష్ రాయచందానీ(0) డకౌట్ కాగా.. 22 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది. ఈ దశలో అర్జున్ రాజ్‌పుత్ వీరోచితంగా పోరాడి 85 బంతుల్లో 5 సిక్సర్లు, 11 ఫోర్లతో 107 పరుగులు సాధించి జట్టును ఆదుకున్నాడు. మనల్ చౌహాన్(11), కావ్యపటేల్(23) సాయంతో భారత్ 208 పరుగులు చేయగలిగింది.

భారత్‌పై గెలిచి చీటీ చూపించిన పాక్ క్రికెటర్.. అసలేం రాశాడంటే!
భారత్‌పై గెలిచి చీటీ చూపించిన పాక్ క్రికెటర్.. అసలేం రాశాడంటే!

భారత్‌పై పాకిస్థాన్ విజయం
209 పరుగుల లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ ను భారత బౌలర్లు ఆరంభంలో తీవ్రంగా దెబ్బతీశారు. మనల్ చౌహాన్(3 వికెట్లు), మోహిత్ ఉల్వా(2 వికెట్లు) ధాటికి 61 పరుగులకే పాక్ 5 వికెట్లు కోల్పోయింది. అయితే హంజా జహూర్(100 నాటౌట్), హస్నైన్ అబ్బాస్ దారా(38) కలిసి ఆరో వికెట్ కు 107 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్‌ను భారత్ చేతుల మీదుగా లాగేసుకున్నారు.

చివరకు పాకిస్తాన్ 48.1 ఓవర్లలో 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గ్రూప్-ఏలో వరుసగా రెండు విజయాలతో పాక్ అగ్రస్థానంలో ఉండగా.. భారత్ రెండో స్థానంలో నిలిచింది. సెమీస్ చేరుకోవాలంటే భారత్ నవంబర్ 19న యూఏఈపై కచ్చితంగా గెలవాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+