ప్రపంచంలోనే అత్యంత అందమైన పాము.. అడవిలో ఎందుకు వదిలారు?

ప్రపంచంలో ఎంతో అందమైన, అదే సమయంలో అంతరించిపోతున్న అరుదైన సరీసృపాలలో 'శాన్ ఫ్రాన్సికో గార్టర్ స్నేక్' ఒకటి. దశాబ్దాలుగా తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటున్న ఈ అరుదైన పాములను కాపాడేందుకు వన్యప్రాణి సంరక్షకులు ఒక అద్భుతమైన ప్రయోగానికి తెరలేపారు. కాలిఫోర్నియాలోని జూలో ప్రత్యేక రక్షణలో పెంచిన 62 చిన్న పాములను తొలిసారిగా వాటి సహజ సిద్ధమైన అడవిలోకి విడిచిపెట్టారు. వన్యప్రాణి సంరక్షణ చరిత్రలో ఇదొక చారిత్రక మైలురాయిగా నిలిచింది.

అత్యంత ఆకర్షణీయమైన రంగులతో, సన్నని శరీరంతో ఉండే ఈ పాములు ప్రపంచంలోనే కేవలం కాలిఫోర్నియాలోని శాన్ మాతేయో , శాంటా క్రూజ్ అనే రెండే రెండు ప్రాంతాలలో సహజంగా జీవిస్తాయి. ఇవి మనుషులకు ఎలాంటి ప్రమాదం తలపెట్టవు. విషపూరితమైన కోరలు కూడా వీటికి ఉండవు. అయితే ఆవాసాలు కోల్పోవడం, కరవు పరిస్థితులు, అడవుల్లోకి కొత్త జాతుల దండయాత్ర, అక్రమ వేట వంటి కారణాల వల్ల గత ఆరు దశాబ్దాలుగా ఇవి అంతరించిపోయే జాబితాలో చేరాయి. ప్రస్తుతం అడవిలో కేవలం కొన్ని వేల సంఖ్యలో మాత్రమే ఇవి మిగిలి ఉన్నట్లు పరిశోధకులు అంచనా వేస్తున్నారు.

Endangered San Francisco Garter Snakes Get Major Conservation Boost With First Ever Wild Release
మగతనానికి దివ్యౌషధం? ఆసియా దేశాల్లో పిచ్చిపిచ్చిగా తాగే డ్రింక్!
మగతనానికి దివ్యౌషధం? ఆసియా దేశాల్లో పిచ్చిపిచ్చిగా తాగే డ్రింక్!

జూలో ప్రత్యేక సంరక్షణ.. 'హెడ్-స్టార్టింగ్' పద్ధతిలో పెంపకం

ఈ అరుదైన జాతిని కాపాడేందుకు శాస్త్రవేత్తలు 'హెడ్-స్టార్టింగ్' అనే ప్రత్యేక విధానాన్ని అనుసరించారు. 2025లో గర్భంతో ఉన్న కొన్ని ఆడ పాములను అడవి నుంచి సురక్షితంగా జూకి తీసుకొచ్చారు. అక్కడ అవి పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత తల్లి పాములను మళ్లీ వాటి సహజ ఆవాసాలకు పంపేశారు. పుట్టిన పిల్ల పాములను మాత్రం శాన్ ఫ్రాన్సికో జూలో అత్యంత పర్యవేక్షణలో పెంచారు. ప్రమాదకరమైన తొలి దశలను దాటి, వేటాడే జంతువులను తట్టుకునే శక్తి వచ్చే వరకు వాటిని సంరక్షించి.. ఇప్పుడు సరైన వయస్సుకు వచ్చాక అడవిలో విడిచిపెట్టారు. భద్రత దృష్ట్యా ఆ పాములను ఎక్కడ వదిలిపెట్టింది గోప్యంగా ఉంచారు.

తప్పించుకున్న 900 పాములు.. భయంతో వణికిపోతున్న గ్రామస్థులు
తప్పించుకున్న 900 పాములు.. భయంతో వణికిపోతున్న గ్రామస్థులు

2027లో మరో 130 పాములను వదిలేందుకు సన్నాహాలు

మొదటి విడత ప్రయోగం విజయవంతం కావడంతో వన్యప్రాణి సంరక్షకులు మరింత ఉత్సాహంగా ముందుకు వెళ్తున్నారు. 2026లో జూలో పుట్టిన మరో 130కి పైగా చిన్న పాములను ప్రస్తుతం ప్రత్యేకంగా పెంచుతున్నారు. రాబోయే 2027లో వాటిని కూడా అడవిలోకి విడిచిపెట్టాలని ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ పాములు కొత్త వాతావరణంలో ఎలా జీవిస్తున్నాయి, సంతానోత్పత్తి ఎలా సాగుతుందనే అంశాలపై పరిశోధకులు నిరంతరం నిఘా ఉంచారు. దశాబ్దాలుగా మనుగడ కోసం పోరాడుతున్న ఈ అరుదైన పాములకు ఈ సంరక్షణా చర్యలు కొత్త ప్రాణం పోస్తాయని అందరూ ఆశిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+