సన్‌రైజర్స్ బౌలింగ్‌లో భారీ మార్పులు.. మరో స్టార్ పేసర్‌కు గుడ్‌బై!
IPL 2027: ఐపీఎల్ 2027 రిటెన్షన్ గడువు ముగియడానికి కొద్ది గంటల ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీకి, యజమాని కావ్య మారన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్‌తో పాటు జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా రాబోయే ఐపీఎల్ సీజన్‌కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్ బిజీగా ఉండటం, వర్క్‌లోడ్ మేనేజ్మెంట్ కారణంగా ఈ ఇద్దరు కంగారూ దిగ్గజాలు ఐపీఎల్ 2027 నుంచి తప్పుకునే దిశగా అడుగులు వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఆరెంజ్ ఆర్మీ క్యాంపులో కలకలం
గత కొన్ని సీజన్లుగా అభిషేక్ శర్మతో కలిసి ట్రావిస్ హెడ్ సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. వీరిద్దరి ఓపెనింగ్ జోడీ ఓవర్‌కు 12.27 రన్ రేట్‌తో పరుగుల వరద పారించింది. ట్రావిస్ హెడ్ హైదరాబాద్ తరఫున 43 మ్యాచ్‌ల్లో 176కు పైగా స్ట్రైక్ రేట్‌తో 1,351 పరుగులు సాధించాడు. ఇప్పుడు ట్రావిస్ హెడ్‌తో పాటు జట్టును ముందుండి నడిపించే కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా దూరమైతే సన్‌రైజర్స్ జట్టు కూర్పుపై తీవ్ర ప్రభావం పడనుంది. అయితే రూ.14 కోట్లకు రీటైన్ అయిన ట్రావిస్ హెడ్ తప్పుకోవడంతో ఆ మొత్తం నేరుగా హైదరాబాద్ మినీ వేలం పర్సులోకి జమ కానుండటం ఫ్రాంచైజీకి ఆర్థికంగా పెద్ద ఊరటనిచ్చే అంశం.

రీటెన్షన్‌కు ముందే సన్‌రైజర్స్ భారీ మార్పులు
నవంబర్ 17న రిటెన్షన్ జాబితా సమర్పించడానికి ముందు సన్‌రైజర్స్ యాజమాన్యం ట్రేడ్ మార్కెట్లో సంచలన మార్పులు చేసింది. లెగ్ స్పిన్నర్ జీషన్ అన్సారీని ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇచ్చి.. తమ పాత యార్కర్ స్పెషలిస్ట్ టీ నటరాజన్‌ను తిరిగి జట్టులోకి తెచ్చుకుంది. సీఎస్కేకు లియామ్ లివింగ్‌స్టోన్, జాక్ ఎడ్వర్డ్స్‌లను అప్పగించి.. అందుకు బదులుగా పేసర్లు ఖలీల్ అహ్మద్, నాథన్ ఎల్లిస్‌లను సొంతం చేసుకుంది. స్టార్ పేసర్ హర్షల్ పటేల్‌ను రూ.4 కోట్లకు గుజరాత్ టైటాన్స్‌కు ట్రేడ్ చేసింది.
గోవా మినీ వేలంలో కావ్య మారన్ వ్యూహం ఏంటి?
డిసెంబర్ 16న గోవాలో జరగనున్న మినీ వేలంలో కావ్య మారన్, ఎస్ఆర్‌హెచ్ యాజమాన్యం సరికొత్త ప్రణాళికలతో బరిలోకి దిగనున్నాయి. పర్సు బ్యాలెన్స్ పెరగడంతో ఫ్రాంచైజీ ప్రధానంగా ఈ విభాగాలపై దృష్టి సారించనుంది. అభిషేక్ శర్మకు తోడుగా పవర్‌ప్లేలో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడే విధ్వంసకర ఓపెనర్ కోసం వేలంలో గట్టిగా ప్రయత్నించనుంది. ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్న వెస్టిండీస్ స్టార్ బ్యాటర్ షాయ్ హోప్ వంటి ప్లేయర్లపై కావ్యమారన్ కన్నేసే అవకాశం ఉంది. ట్రావిస్ హెడ్ తరహాలోనే జట్టుకు మెరుపు ఆరంభాలను ఇవ్వగల సత్తా హోప్‌కు ఉంది. మిడిలార్డర్‌ను పటిష్టం చేసేందుకు ఓ నమ్మకమైన ఫినిషర్ లేదా అనుభవజ్ఞుడైన ఆల్‌రౌండర్‌పై భారీగా ఖర్చు చేసే అవకాశం ఉంది. అలాగే కమిన్స్ అందుబాటులో లేకపోతే కొత్త కెప్టన్ ఎంపికపై కూడా ఫ్రాంచైజీ దృష్టి పెట్టనుంది.












Click it and Unblock the Notifications
