ఐపీఎల్ కు గుడ్ బై చెప్పిన ధోనీ: ఇకపై..!!
ఐపీఎల్ చరిత్రలో ఓ ఉజ్వల శకం ముగిసింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు అయిదు ట్రోఫీలను అందించిన టీమిండియా మాజీ కెప్టెన్, క్రికెట్ దిగ్గజం మహేంద్రసింగ్ ధోనీ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆటగాడిగా తన సుదీర్ఘ ప్రస్థానానికి స్వస్తి పలికాడు. గ్రౌండ్ లో పదునైన వ్యూహాలు, ఆఖరి బంతి వరకు మ్యాచ్‌ను మలుపు తిప్పే ఫినిషింగ్ సామర్థ్యంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న ధోనీ.. ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
అభిమానుల్లో భావోద్వేగాన్ని నింపింది. క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన ఫినిషర్‌గా గుర్తింపు పొందిన ధోనీ నిర్ణయం ఒక ప్రత్యేక అధ్యాయానికి తెరదించింది. 45 ఏళ్ల వయస్సులో ధోనీ ఆటగాడిగా నిష్క్రమించినప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీతో ఆయన అనుబంధం మాత్రం కొనసాగబోతోంది. రాబోయే ఐపీఎల్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మెంటార్‌గా ధోనీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ యాజమాన్యం అధికారికంగా ధృవీకరించింది కూడా.













Click it and Unblock the Notifications
