అదానీ సిమెంట్ గ్రీన్ లాజిస్టిక్స్.. గుజరాత్ ప్లాంట్‌లో 410 ఎలక్ట్రిక్ ట్రక్కులు

భారత్‌లో భారీ రవాణా రంగాన్ని పర్యావరణ అనుకూలంగా మార్చే దిశగా అదానీ సిమెంట్ ఒక ప్రాముఖ్యమైన అడుగు వేసింది. గుజరాత్‌లోని తన సంఘీ ప్లాంట్ నుంచి సిమెంట్, క్లింకర్ రవాణా చేయడం కోసం భారీ విద్యుత్ (ఈవీ) ట్రక్కుల వినియోగాన్ని అధికారికంగా ప్రారంభించింది. రవాణా వ్యవస్థలో కార్బన్ ఉద్గారాలను తగ్గించడమే ప్రధాన ధ్యేయంగా చేపట్టిన ఈ ప్రాజెక్టులో భాగంగా, 2027 మార్చి నాటికి దేశవ్యాప్తంగా మొత్తం 410 ఈ-ట్రక్కులను ప్రవేశపెట్టాలని కంపెనీ నిర్ణయించింది.

ఈ విద్యుత్ ట్రక్కుల వినియోగం వల్ల పర్యావరణానికి ప్రతి ఏటా గణనీయమైన ప్రయోజనం చేకూరనుంది. ప్రతి సంవత్సరం సుమారు 1.1 కోట్ల లీటర్ల డీజిల్ వినియోగాన్ని తగ్గించడంతో పాటు, 25,000 టన్నులకు పైగా కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలను నివారించవచ్చని అదానీ సిమెంట్ అంచనా వేసింది. తొలిదశలో దేశంలోని ప్రధాన ప్లాంట్లు, సరఫరా మార్గాలను అనుసంధానిస్తూ ఈ హెవీ డ్యూటీ వాహనాలు నిరంతరం రాకపోకలు సాగిస్తాయి.

adani-cement-to-deploy-410-electric-trucks-by-march-2027-targets-25-000-tonnes-in-annual-carbon-emi

ఈ-రవాణా విస్తరణ, ఆర్థిక సమర్థత
కంపెనీ తన సుదీర్ఘ ప్రణాళికలో భాగంగా 2030 నాటికి రోడ్డు రవాణా పరిమాణంలో 10 శాతాన్ని విద్యుత్ వాహనాల ద్వారానే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం భవిష్యత్తులో 2,000 కంటే ఎక్కువ విద్యుత్ ట్రక్కులను నడపనుంది. సంప్రదాయ డీజిల్ ట్రక్కులు ప్రతి కిలోమీటరుకు సుమారు 0.7375 కేజీల కార్బన్ డై ఆక్సైడ్‌ను విడుదల చేస్తాయి. అయితే పునరుత్పాదక విద్యుత్‌తో నడిచే ఈ-ట్రక్కులు పర్యావరణానికి కలిగే హానిని దాదాపు వంద శాతం వరకు తగ్గించగలవని సంస్థ వెల్లడించింది.

గత పదేళ్ల కాలంలో డీజిల్ ధరలు 60 శాతం పెరగ్గా, లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ వ్యయం 70 శాతం వరకు తగ్గుముఖంట్టింది. అదే సమయంలో సౌర విద్యుత్ ఛార్జీలు 47 శాతం తగ్గడం విద్యుత్ వాహనాల నిర్వహణను ఆర్థికంగా ఎంతో సమర్థవంతంగా మార్చింది. డీజిల్ ధరల హెచ్చుతగ్గుల నుంచి లాజిస్టిక్స్ వ్యయాన్ని కాపాడుకోవడానికి, రవాణా ఖర్చులను స్థిరీకరించడానికి ఈ విద్యుత్ లారీల వినియోగం దోహదపడుతుందని అదానీ గ్రూప్ సిమెంట్ వ్యాపార సీఈఓ వినోద్ బహేటీ స్పష్టం చేశారు.

అదానీ సిమెంట్ నెట్-జీరో రోడ్‌మ్యాప్
అంబుజా సిమెంట్స్, ఏసీసీ, ఓరియంట్ సిమెంట్‌లతో కూడిన అదానీ సిమెంట్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం ప్రస్తుతం 113.5 మిలియన్ టన్నులుగా ఉంది. 2050 నాటికి సంపూర్ణంగా 'నెట్-జీరో' ఉద్గారాల స్థాయికి చేరుకోవాలని కంపెనీ ప్రతిపాదించిన లక్ష్యాలను 'సైన్స్ బేస్డ్ టార్గెట్స్ ఇనిషియేటివ్' (SBTi) ధృవీకరించింది. ఈ రోడ్‌మ్యాప్‌లో భాగంగా 2027-28 ఆర్థిక సంవత్సరం నాటికి 1 గిగావాట్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు, 376 మెగావాట్ల వేస్ట్ హీట్ రికవరీ సిస్టమ్స్ (WHRS) నెలకొల్పేందుకు భారీగా నిధులు కేటాయిస్తోంది.

తక్కువ కార్బన్ సాంకేతికతలను అభివృద్ధి చేసేందుకు 'లైలాక్', 'కూల్‌బ్రూక్' వంటి అంతర్జాతీయ సంస్థలతో అదానీ సిమెంట్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. అంతేకాకుండా, గ్లోబల్ అలయన్స్ ఫర్ ఇండస్ట్రియల్ డికార్బనైజేషన్, లీడ్‌ఐటీ వంటి అంతర్జాతీయ వేదికల్లో సభ్యత్వం పొందిన తొలి సిమెంట్ తయారీ సంస్థగా నిలిచింది. ఇప్పటికే 'వాటర్ పాజిటివ్', 'ప్లాస్టిక్ నెగెటివ్' గుర్తింపు పొందిన ఈ సంస్థ, గ్రీన్ ప్రో మరియు గృహ (GRIHA) ప్రమాణాలతో కూడిన పర్యావరణ అనుకూల ఉత్పత్తులను అందిస్తోంది.

ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద సిమెంట్ ఉత్పత్తిదారుగా ఉన్న భారతదేశంలో, పరిశ్రమల లాజిస్టిక్స్ రంగాన్ని డికార్బనైజ్ చేయడం అత్యంత ఆవశ్యకంగా మారింది. సుదూర ప్రాంతాలకు ముడిసరుకు, సిమెంట్ రవాణా చేసే భారీ వాహనాలను విద్యుదీకరించడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు పారిశ్రామిక వ్యయ నిర్వహణలో కొత్త ప్రమాణాలు నెలకొల్పుతున్నట్లు అదానీ సిమెంట్ ప్రతినిధులు వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+