మున్సిపల్ సమరం వేళ రూటు మార్చిన కొడాలి నాని - కొత్త లెక్కలు, అసలు సవాల్..!!
గుడివాడ కేంద్రంగా రాజకీయం ఆసక్తిగా మారుతోంది. రెండో విడత మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 26న గుడివాడ మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. జెడ్పీటీసీ ఎన్నికల్లో నియోజకవర్గం లో కూటమి విజయం సాధించింది. దీంతో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు మాజీ మంత్రి కొడాలి నాని సమర్థతకు పరీక్షగా మారుతున్నాయి. ఈ ఎన్నికల కోసం నాని కొత్త వ్యూహాలు సిద్దం చేసారు. నామినేషన్ సమయం నుంచే రూటు మార్చారు. దీంతో.. మారుతున్న లెక్కలతో తుది ఫలితం పైనా ఉత్కంఠ పెరుగుతోంది.
గుడివాడ మున్సిపల్ ఎన్నికలు కొడాలి నాని సమర్థతకు పరీక్షగా నిలుస్తున్నాయి. అటు టీడీపీకి ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. దీంతో.. ఇక్కడ జరిగే మున్సిపల్ ఎన్నిక పైన రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గుడివాడ ఒకప్పుడు ఆ పార్టీకి కంచుకోటగా ఉండేది. అయితే ఆ తర్వాత మాజీ మంత్రి కొడాలి నాని తన అడ్డాగా మార్చుకున్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ అధి నాయకత్వం గురి పెట్టి అక్కడ కొడాలి నాని ని ఓడించింది. ఇక.. ఆ తరువాత చాలా కాలం కొడాలి నాని అనారోగ్య సమస్యలతో నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. స్థానిక ఎన్నికల నుంచి తిరిగి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటానని ప్రకటించారు. కాగా.. తాజాగా జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ ఏకపక్షంగా విజయం సాధించింది. గుడవాడ నియోజకవర్గంలోని నందివాడ మండలంలో టీడీపీ ఎప్పుడూ గెలవలేదు.

తుది ఫలితం పై ఉత్కంఠ
అయితే, ఈ సారి ఆ రికార్డు కూడా బద్దలైంది. గతంలో ఎన్నడూ గెలవని నందివాడ ఎంపీపీ పీఠంతో పాటు జడ్పీటీసీ సీటును దక్కించుకుంది. అదే విధంగా గుడివాడ నియోజక వర్గంలో 32 ఎంపీటీసీ స్థానాలు, 3 జడ్పీటీసీ స్థానాలు కూడా టీడీపీ సొంతం చేసుకుంది. దీంతో.. గుడివాడ కేంద్రంగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు కొడాలి నానికి ప్రతిష్ఠాత్మకంగా మారాయి. మున్సిప ల్ పీఠాన్ని సొంతం చేసుకోవటం ద్వారా తన పట్టు నిరూపించుకోవాలనే లక్ష్యంతో కొత్త వ్యూహాలను అమలు చేస్తున్నారు. చైర్మన్ నామినేషన్ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించి బలప్రదర్శన చేశారు. చైర్‌పర్సన్ అభ్యర్థి కరుణ నామినేషన్ సందర్భంగా వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. 12 ఏళ్లుగా మున్సిపాలిటీకి ఎన్నికలు జరగకపోవడంతో వార్డుల వారీగా ఎవరి బలం ఎంత అనేది ఖచ్చితమైన అంచనాలు అందటం లేదు. దీంతో.. ఇప్పుడు కొడాలి నాని ఈ ఎన్నిక ల్లో సానుకూల ఫలితం సాధించి తిరిగి కేడర్ లో జోష్ తేవాలని భావిస్తున్నారు. కాగా.. తుది ఫలితం పైన రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది.













Click it and Unblock the Notifications
