టీడీపీతో కలిసారు, వారి లెక్కలు సిద్దం - త్వరలోనే... తేల్చి చెప్పిన జగన్..!!
మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. పార్టీ ముఖ్య నేతలతో పార్టీ ప్రక్షాళన పైన స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. స్థానిక ఎన్నికల్లో తన ఆదేశాలకు భిన్నంగా కొందరు వ్యవహరించారని.. వారి నివేదికలు పూర్తిగా తన వద్ద ఉన్నాయని చెప్పారు. త్వరలోనే అందరితో మాట్లాడుతానని.. కొందరి పైన ఏం చేయాలో అది చేస్తానని స్పష్టం చేసారు. నియోజకవర్గాల వారీగా ప్రతీ ఇంఛార్జ్ తోనూ జగన్ ఒన్ టు ఒన్ సమావేశానికి డిసైడ్ అయ్యారు.
పార్టీ ముఖ్య నేతలతో జగన్ సమావేశం అయ్యారు. స్థానిక ఎన్నికల ఫలితాల పైన చర్చించారు. కొందరు నేతలు నియోజకవర్గాల ఇంఛార్జ్ ల నుంచి పూర్తి సహకారం అందలేదనే విషయాన్ని జగన్ వద్ద ప్రస్తావించారు. ఈ సమయంలో జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సరిగ్గా పని చేయని నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తల పని తీరు పైన నివేదికలు తెప్పించినట్లు జగన్ వెల్లడించారు. ఎన్నికలతో పాటుగా రెండున్నారేళ్ల కాలంలో సమన్వయకర్తల పని తీరును మదింపు చేస్తున్నట్లు వివరించారు. జైలులో ఉండి కూడా ఇటీవల జెడ్పీటీసీ ఎన్నిక ల్లో గెలిచిన పెళ్లకూరు జెడ్పీటీసీ సభ్యుడు సత్యనారాయణ రెడ్డి సమావేశంలో పాల్గొన్నారు. ఆయన గెలిచిన తీరును అందరూ గుర్తించాలని సూచించారు. స్థానిక ఎన్నికల్లో నియోజకవర్గాల ఇంఛార్జ్ లు సరిగ్గా పట్టించుకోలేదని.. జగన్ చెప్పిన మాటలను అమలు చేయలేదని.. రాష్ట్ర వ్యాప్తంగా ఇంఛార్జ్ ల విషయంలో ప్రక్షాళన చేయాలని కొందరు నేతలు చెప్పినట్లు తెలుస్తోంది. దీనికి స్పందించిన సజ్జల సమావేశంలో ఉన్న ఇంఛార్జ్ లు ఏమైనా అనుకుంటారేమో అని వ్యాఖ్యానించినట్లు సమాచారం.

పార్టీ సమూల ప్రక్షాళన దిశగా
కాగా, జగన్ ఈ సమయంలోనే కల్పించుకుంటూ లిస్టు సిద్దం అయిందని.. త్వరలోనే అందరితో మాట్లాడుతానని స్పష్టం చేసారు. తమ నియోజకవర్గంలో కొన్ని చోట్ల గెలిచే అవకాశం ఉన్నా.. అంటే అక్కడి పార్టీ నేతల పై క్రిష్ణా జిల్లా కు చెందిన నేత తన మనసులో మాట చెప్పే ప్రయత్నం చేయగా.. జగన్ స్పందిస్తూ మీ రిపోర్ట్ కూడా అందింది. ఇక్కడ కాదు.. విడిగా మాట్లాడుతానని చెప్పినట్లు తెలుస్తోంది. కాగా.. జగన్ ఇప్పటికే నియోజకవర్గాల వారీగా ఇంఛార్జ్ ల పని తీరుపై జగన్ నివేదికలు తెప్పించుకొని సమీక్ష చేస్తున్నట్లు సమాచారం. స్థానిక ఎన్నికల్లో టీడీపీ నేతలతో కలిసిపోయి పోటీ చేయకుండా వదిలేయటం.. అభ్యర్ధులకు ఆర్దికంగా అండగా నిలబడకపోవటం.. అభ్యర్ధులకు సహకరించకుండా.. వారి ఫోన్ లకు కూడా స్పందించికపోవటంతో పాటుగా ఆ నియోజకవర్గంలో ఫలితాల ఆధారంగా ఒక నిర్ణయానికి వస్తున్నట్లు సమాచారం. వచ్చే వారం నుంచి నియోజకవర్గాల వారీగా ఇంఛార్జ్ ల తో మాట్లాడిన తరువాత కీలక చర్యలకు జగన్ సిద్దం అవుతున్నారనే సమాచారం పార్టీలో ఆసక్తిగా మారుతోంది.













Click it and Unblock the Notifications
