మెడికల్ కాలేజీలపై పట్టువదలని వైసీపీ: 66 ఏళ్ల లీజు ప్రతిపాదనలపై

రాష్ట్రంలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో పురుడుపోసుకున్న మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- బీజేపీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలపై వ్యతిరేకత మళ్లీ మొదలైంది. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను 66 ఏళ్ల లీజు పేరుతో ప్రైవేట్‌ వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నాలను అడ్డుకుంటామని వైసీపీ తేల్చి చెప్పింది.

ఎన్నికల్లో అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి నాయకులు.. ప్రజల ఆస్తులను విచ్చలవిడిగా తన అనుయాయులకు అమ్ముతోందని, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌ పరం చేయడానికి ఎడతెరిపి లేని ప్రయత్నాలు చేస్తోందని వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. 33 ఏళ్ల లీజుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఇప్పుడు ఏకంగా 66 ఏళ్ల పాటు ప్రైవేటుకు ఇచ్చేస్తామంటున్నారని ఆరోపించారు. ప్రజల ఆస్తిని అప్పనంగా రాసిచ్చే హక్కు మీకెక్కడిదని నిలదీశారు.

Medical Colleges Protection Committee warned of massive statewide agitation if govt says Perni Nani

ఇప్పటికే ఉన్న ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో బ్లాక్‌లో సీట్ల అమ్మకాలు, కార్పొరేట్‌ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని నియంత్రించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ వ్యవస్థను సర్వనాశనం చేశారని, పేదవాడికి జబ్బు చేస్తే ఎమ్మెల్యే లెటర్‌ కోసం పీఏలకు లంచాలు ఇచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. ఆదోని, పాలకొల్లు వంటి మారుమూల ప్రాంతాల్లో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు పూర్తయితే న్యూరాలజీ, కార్డియాలజీ, నెఫ్రాలజీ వంటి సూపర్‌ స్పెషాలిటీ వైద్యం సామాన్యుడికి అందుబాటులోకి వస్తుందని చెప్పారు.

ఈ టౌన్ లో 65 రోజుల పాటు చీకటి రాత్రులు: చిట్టచివరి సూర్యాస్తమయం
ఈ టౌన్ లో 65 రోజుల పాటు చీకటి రాత్రులు: చిట్టచివరి సూర్యాస్తమయం

చంద్రబాబు, లోకేష్, పవన్‌ కళ్యాణ్‌లకు చిన్న నొప్పి వచ్చినా విమానాల్లో హైదరాబాద్‌ ఏఐజీ ఆసుపత్రి, ముంబైకి వెళ్లి వైద్యం చేయించుకుంటోన్నారని, ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన కాలేజీలను యథేచ్ఛగా అమ్మేస్తోన్నారని ధ్వజమెత్తారు. ఎన్టీఆర్‌ విగ్రహ నిర్మాణం కోసం రూ.1,500 కోట్లు ఖర్చు పెట్టడానికి డబ్బులుంటాయి గానీ, రెండు మెడికల్‌ కాలేజీలు పూర్తి చేయడానికి మనసు రాదా? అని ప్రశ్నించారు పేర్ని నాని.

చెన్నై రూపురేఖలు మార్చే ప్రాజెక్టులను ప్రారంభించిన విజయ్
చెన్నై రూపురేఖలు మార్చే ప్రాజెక్టులను ప్రారంభించిన విజయ్

మార్కాపురం, ఆదోని, పెనుగొండ, నర్సీపట్నం వంటి వెనుకబడిన ప్రాంతాల్లో మెడికల్‌ కాలేజీలు రావడం వల్ల సీట్లతో పాటు 300 పడకల ఆసుపత్రులు పేదలకు అందుబాటులోకి వస్తాయని, పీపీపీ విధానంలో ఎవరూ ముందుకు రాకపోవడంతో, కేంద్రంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ప్రభుత్వం నాలుగు అంశాలను ప్రతిపాదించిందని మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు విమర్శించారు. లీజు గడువును 66 ఏళ్లకు పెంచడం, రూ.1,630 కోట్లు వయబిలిటీ గ్యాప్‌ ఫండ్‌ ఇవ్వడం, రెండేళ్ల పాటు డాక్టర్లు, ప్రొఫెసర్లు, సిబ్బంది జీతాలు ప్రభుత్వమే భరించడం అనే నిబంధనలతో క్రోని క్యాపిటలిజానికి తెరలేపారని చెప్పారు.

కర్ణాటక సరిహద్దులోని పెనుగొండ, ఆదోని ప్రాంతాల ప్రజలు అత్యవసర వైద్యం కోసం బెంగళూరు, బళ్లారికి వెళ్లాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. పెనుగొండలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణం దాదాపు పూర్తయినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని విమర్శించారు. విశాఖ సమ్మిట్, యోగా వంటి ప్రచార ఈవెంట్ల కోసం వందల కోట్ల రూపాయలు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్న ప్రభుత్వానికి, పేదల ప్రాణాలు కాపాడే మెడికల్‌ కాలేజీలను పూర్తి చేయాలనే చిత్తశుద్ధి లేదని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+