Ys Jagan: జగన్ ఆస్తుల కేసులో కీలక పరిణామం- చాలా కాలం తర్వాత ఈడీ కీలక అడుగు..!

మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు (YS Jagan) ఇవాళ ఈడీ మరో షాకిచ్చింది. అక్రమాస్తుల కేసులో సుదీర్ఘ దర్యాప్తు జరుపుతున్న ఈడీ చాలా కాలం తర్వాత ఇవాళ ఓ కీలక కేసులో ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఇప్పటివరకూ జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో 9 ఛార్జిషీట్లు దాఖలు చేసిన ఈడీ.. ఇవాళ హైదరాబాద్ లోని సీబీఐ, ఈడీ కేసుల న్యాయస్థానంలో పదో ఛార్జిషీట్ వేసింది. దాల్మియా సిమెంట్స్ వ్యవహారంలో ఈ ఛార్జిషీట్ దాఖలు చేసింది. దీంతో జగన్ ఇప్పుడు 10 ఛార్జిషీట్లపై విచారణ ఎదుర్కోవాల్సి ఉంది.

4 కార్పోరేషన్లలో సంచలన ఫలితాలు? భారీ క్రాస్ ఓటింగ్ ? మేయర్లు, కార్పోరేటర్లపై సీప్యాక్ సర్వే..!
4 కార్పోరేషన్లలో సంచలన ఫలితాలు? భారీ క్రాస్ ఓటింగ్ ? మేయర్లు, కార్పోరేటర్లపై సీప్యాక్ సర్వే..!

వైఎస్ హయాంలో కడప జిల్లాలో దాల్మియా సిమెంట్స్ కు 417 హెక్టార్ల సున్నపురాయి గనుల్ని లీజుకు ఇచ్చారు. ఇందులో జగన్ తో కుమ్మక్కై దాల్మియా సిమెంట్స్ అక్రమంగా ఈ లీజుల్ని పొందినట్లు 2013లో దాఖలు చేసిన ఛార్జిషీట్ లో సీబీఐ ఆరోపించింది. ఈ వ్యవహారంలో జగన్ కు రూ.150 కోట్ల ముడుపులు అందినట్లు అందులో పేర్కొన్నారు. వీటిలో రూ.95 కోట్ల షేర్లు రఘురామ్ సిమెంట్స్ ద్వారా, మరో రూ.55 కోట్లు హవాలా రూపంలో జగన్ కు దాల్మియా సిమెంట్స్ ఇచ్చినట్లు ఆరోపించింది. ఈ ఛార్జిషీట్ ఆధారంగా ఈడీ వీరిపై మనీలాండరింగ్ కేసు దాఖలు చేసింది. అనంతరం రూ.793 కోట్ల విలువైన దాల్మియా సిమెంట్స్ ఆస్తుల్ని జప్తు చేసింది.

Fresh Trouble for YS Jagan as ED Files Chargesheet in Dalmia Cements Case
ఫీజులపై సర్కార్ లెక్క తప్పు?-కాగ్ రిపోర్ట్ బయటపెట్టిన జగన్..!
ఫీజులపై సర్కార్ లెక్క తప్పు?-కాగ్ రిపోర్ట్ బయటపెట్టిన జగన్..!

ఈ మేరకు ఇప్పటికే ఓసారి ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. దీన్ని సాంకేతిక కారణాలతో కోర్టు తోసిపుచ్చడంతో తప్పులు సవరించి తాజాగా ఇవాళ మరోసారి ఇదే కేసులో ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ ఛార్జిషీట్ లో గతంలో సమర్పించిన ఆధారాలకు తోడు మరిన్ని ఆధారాలను ఈడీ జత చేసినట్లు తెలుస్తోంది. దీనిపై కోర్టు విచారణ జరపాల్సి ఉంది. ఈ కేసులో జగన్ తో పాటు దాల్మియా సిమెంట్స్ తరఫున పునీత్ దాల్మియా, ఇతరులు నిందితులుగా ఉన్నారు. గతంలో దాఖలైన ఛార్జిషీట్లతో పాటు దీనిపైనా కోర్టు విచారణ జరిపి తీర్పు ప్రకటించాల్సి ఉంది. తాజాగా జగన్ కేసుల్లో విచారణ వేగం పెరగడంతో ఈ ఛార్జిషీట్ ప్రాధాన్యం సంతరించుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+