APPSC Group-1 Scam: రంగంలోకి ఈడీ-పీఎస్సార్ సహా వీరి ఇళ్లపై దాడులు..!

ఆంధ్రప్రదేశ్ లో గత వైసీపీ ప్రభుత్వంలో చోటు చేసుకున్న ఏపీపీఎస్సీ (APPSC) అక్రమాల కేసులో ఈడీ రంగంలోకి దిగింది. మూల్యాంకనం సందర్భంగా మనీలాండరింగ్ ద్వారా భారీగా డబ్బులు చేతులు మారాయన్న ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న ఈడీ (ED) హైదరాబాద్ విభాగం.. ఇవాళ మాజీ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు సహా ఏడుగురు నిందితుల ఇళ్లపై దాడులు నిర్వహిస్తోంది. తెలంగాణలోని హైదరాబాద్ సహా ఏపీలోని వివిధ ప్రాంతాల్లో ఈ దాడులు కొనసాగుతున్నాయి.

ఆరు నెలల్లో ఏపీ పీఆర్సీ రిపోర్ట్ ? ఉద్యోగుల తాజా డిమాండ్స్ ఇవే..!
ఆరు నెలల్లో ఏపీ పీఆర్సీ రిపోర్ట్ ? ఉద్యోగుల తాజా డిమాండ్స్ ఇవే..!

గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకనంలో అక్రమాలు చోటు చేసుకున్నట్లు సిట్ కేసు నమోదు చేసింది. ఇందులో మనీలాండరింగ్ పాత్ర కూడా ఉన్నట్లు గుర్తించిన ఈడీ.. ఇప్పుడు రంగంలోకి దిగింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ఏపీపీఎస్సీ మాజీ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు సహా ఇతర నిందితులు, పలు వ్యాపార సంస్థల కార్యాలయాల్లో ఇవాళ తనిఖీలు నిర్వహిస్తోంది. ఇందులో హైదరాబాద్ బంజారాహిల్స్ లోని క్యామ్ సైన్ సంస్థ కార్యాలయంతో పాటు దాని ఎండీ పి. మధుసూదన్ రావు ఇల్లు, అలాగే సికింద్రాబాద్, నేరేడ్ మెట్, అల్వాల్ లోని పలు సంస్థల ఆఫీసుల్లో దాడులు జరుగుతున్నాయి. ఏపీలోనూ గుంటూరు జిల్ాల మంగళగిరి మండలం చిన కాకాని వద్ద ఉన్న హాయ్ ల్యాండ్ రిసార్ట్ లోనూ తనిఖీలు చేస్తున్నారు.

APPSC Group-1 Scam ED Searches Premises Linked to Former IPS Officer PSR Anjaneyulu and Others
AP Poll Counting: ఏపీ ఉద్యోగుల తీర్పు ఇదే..! పోస్టల్ బ్యాలెట్ ఫలితాల్లో క్లారిటీ..!
AP Poll Counting: ఏపీ ఉద్యోగుల తీర్పు ఇదే..! పోస్టల్ బ్యాలెట్ ఫలితాల్లో క్లారిటీ..!

ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష తర్వాత అభ్యర్ధుల జవాబు పత్రాల్ని క్యామ్ సైన్ సంస్థ మూల్యాంకనం చేయకుండానే తమ వద్ద 84 రోజుల పాటు ఉంచుకుందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు సిట్ విచారణలో అధికారులు ఆధారాలు సేకరించారు. అలాగే అర్హత లేనని 66 మంది వ్యక్తులతో ఓఎంఆర్ షీట్లలో ముందుగా అనుకున్న మార్కులు నమోదు చేయించారని, వీటి వల్ల 1.14 కోట్లకు పైగా ప్రజాధనం దారి మళ్లించినట్లు తేలింది. దీన్ని పీఎస్సార్ అంగీకరించడం లేదు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారమే అప్పట్లో తాము సమిష్టి నిర్ణయంతో భౌతికంగా మూల్యాంకనం చేయించినట్లు చెబుతోంది. ఈ వ్యవహారంపైనే ఇప్పుడు ఈడీ దర్యాప్తు జరుపుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+